కళా ప్రపూర్ణ, మహా మహోపాధ్యాయ గిడుగు వేంకట రామమూర్తి గారి రచనలపైనా, వారి జీవితం పైనా ఇంతకు ముందు కొంత అనుశీలన జరిగింది. కొన్ని గ్రంధాలు ముద్రితమయ్యాయి. అయినా వారి లేఖలు సంకలనంగా రాలేదు. ఇప్పడి "గిడుగు లేఖలు" అనే గ్రంధంలో గిడుగు వారికీ ఇతరులు, ఇతరులకు గిడుగువారి రాసిన లేఖలు ఉన్నాయి. సవరల విద్యాభివృద్ధికై గిడుగువారు అప్పటి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఉంది. కొన్ని లేఖలు ఇందులోనే మొదటిసారి ముద్రితమవుతున్నాయి. తెలుగుతో పాటు కొన్ని లేఖలు ఇంగ్లీషులో కూడా ఉన్నాయి. ఈ సంకలనం ద్వారా గిడుగువారు విద్యారంగంలోను చేసిన కృషి గురించి ఇంతవరకు లభ్యంకాని మరికొంత సమాచారం దొరుకుతుంది. గిడుగువారి సమగ్ర కృషి గురించి చదవదగిన రచనలకు ఈ గ్రంథం మరో చేర్పు.
ఈ లేఖలు సేకరించి, వాటి ముద్రిత ప్రతులను సిద్ధం చేసి, వాటి విశ్లేషణ ద్వారా తెలియదగిన విశేషాలను ప్రకటించినవారు డా. ఎన్.ఎస్ రాజుగారు. వీరు హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పనిచేస్తున్నారు. భాషా ఛందస్సాహిత్య రంగాలలో వీరి గ్రంధాలు ఇంతకు ముందు ముద్రితమయ్యాయి.
- ఎన్.ఎస్. రాజు
కళా ప్రపూర్ణ, మహా మహోపాధ్యాయ గిడుగు వేంకట రామమూర్తి గారి రచనలపైనా, వారి జీవితం పైనా ఇంతకు ముందు కొంత అనుశీలన జరిగింది. కొన్ని గ్రంధాలు ముద్రితమయ్యాయి. అయినా వారి లేఖలు సంకలనంగా రాలేదు. ఇప్పడి "గిడుగు లేఖలు" అనే గ్రంధంలో గిడుగు వారికీ ఇతరులు, ఇతరులకు గిడుగువారి రాసిన లేఖలు ఉన్నాయి. సవరల విద్యాభివృద్ధికై గిడుగువారు అప్పటి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఉంది. కొన్ని లేఖలు ఇందులోనే మొదటిసారి ముద్రితమవుతున్నాయి. తెలుగుతో పాటు కొన్ని లేఖలు ఇంగ్లీషులో కూడా ఉన్నాయి. ఈ సంకలనం ద్వారా గిడుగువారు విద్యారంగంలోను చేసిన కృషి గురించి ఇంతవరకు లభ్యంకాని మరికొంత సమాచారం దొరుకుతుంది. గిడుగువారి సమగ్ర కృషి గురించి చదవదగిన రచనలకు ఈ గ్రంథం మరో చేర్పు. ఈ లేఖలు సేకరించి, వాటి ముద్రిత ప్రతులను సిద్ధం చేసి, వాటి విశ్లేషణ ద్వారా తెలియదగిన విశేషాలను ప్రకటించినవారు డా. ఎన్.ఎస్ రాజుగారు. వీరు హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పనిచేస్తున్నారు. భాషా ఛందస్సాహిత్య రంగాలలో వీరి గ్రంధాలు ఇంతకు ముందు ముద్రితమయ్యాయి. - ఎన్.ఎస్. రాజు
© 2017,www.logili.com All Rights Reserved.