కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలో మహ్మదాలీ సోదరులు 'వందేమాతరం' గీతాన్ని ఆలపింప నిరాకరించడంతో గాంధీజీ వందేమాతరానికి బదులు 'సారే జహాసే అచ్చా' గేయాన్ని ఆలపించవచ్చు అని సలహా ఇచ్చినట్టు విన్నాం. దానితో నాకు ఇక్బాల్ పట్ల ఒక విధమైన భక్తిభావం ఏర్పడింది. నాకు కుల మత భేదాలు అంతగా పట్టవు, 'మనమంతా భారతీయులం' అనే వాడే నాకు ఆత్మబంధువు!.
ఇక్బాల్ మహ్మదీయుడైనా తన పూర్వులు సోమనాథ్ దేవాలయ అర్చకులని చెప్పుకొనడం, శ్రీరాముని పట్ల అపారమైన భక్తీ ప్రపత్తులను ప్రదర్శించడం నన్నెంతగానో ఆకర్షించింది. దానితో తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తి గారి "జాతీయకవి - ఇక్బాల్" అనే అనువాద గ్రంథాన్ని పఠించడం తెలుగు లిపిలో ఇక్బాల్ గీతాలను వాటి తాత్పర్యాలను గ్రహించి ఆనందించడం జరిగింది. ఇక్బాల్ పట్ల భక్తీ భావంతో ఆయన గీతాలను కొన్నింటిని మాత్రా ఛందస్సులో అనువదించడం జరిగింది.
ఉరుదూ, పారశీక భాషలు తెలిసిన వారికీ, తెలియని వారికీ మూలలిపి తెలిసిన వారికి, తెలియని వారికి - సామాన్య తెలుగు పాఠకులకు సైతం ఇక్బాల్ సాహిత్యాన్ని పరిచయం చేయాలనే ఆకాంక్షతో మూలము, తెలుగు లిపిలో ఇక్బాల్ గేయము, నా అనువాద గీతము వరుసగా పొందుపరచాను. ఈ కృతి రసజ్ఞులను ఏ మాత్రం అలరించినా నేను ధన్యుణ్ణి. పెద్దల ఆశిస్సులతో సర్వదా ఆశిస్తూ...
- అల్లూరి వెంకట నరసింహరాజు
కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలో మహ్మదాలీ సోదరులు 'వందేమాతరం' గీతాన్ని ఆలపింప నిరాకరించడంతో గాంధీజీ వందేమాతరానికి బదులు 'సారే జహాసే అచ్చా' గేయాన్ని ఆలపించవచ్చు అని సలహా ఇచ్చినట్టు విన్నాం. దానితో నాకు ఇక్బాల్ పట్ల ఒక విధమైన భక్తిభావం ఏర్పడింది. నాకు కుల మత భేదాలు అంతగా పట్టవు, 'మనమంతా భారతీయులం' అనే వాడే నాకు ఆత్మబంధువు!. ఇక్బాల్ మహ్మదీయుడైనా తన పూర్వులు సోమనాథ్ దేవాలయ అర్చకులని చెప్పుకొనడం, శ్రీరాముని పట్ల అపారమైన భక్తీ ప్రపత్తులను ప్రదర్శించడం నన్నెంతగానో ఆకర్షించింది. దానితో తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తి గారి "జాతీయకవి - ఇక్బాల్" అనే అనువాద గ్రంథాన్ని పఠించడం తెలుగు లిపిలో ఇక్బాల్ గీతాలను వాటి తాత్పర్యాలను గ్రహించి ఆనందించడం జరిగింది. ఇక్బాల్ పట్ల భక్తీ భావంతో ఆయన గీతాలను కొన్నింటిని మాత్రా ఛందస్సులో అనువదించడం జరిగింది. ఉరుదూ, పారశీక భాషలు తెలిసిన వారికీ, తెలియని వారికీ మూలలిపి తెలిసిన వారికి, తెలియని వారికి - సామాన్య తెలుగు పాఠకులకు సైతం ఇక్బాల్ సాహిత్యాన్ని పరిచయం చేయాలనే ఆకాంక్షతో మూలము, తెలుగు లిపిలో ఇక్బాల్ గేయము, నా అనువాద గీతము వరుసగా పొందుపరచాను. ఈ కృతి రసజ్ఞులను ఏ మాత్రం అలరించినా నేను ధన్యుణ్ణి. పెద్దల ఆశిస్సులతో సర్వదా ఆశిస్తూ... - అల్లూరి వెంకట నరసింహరాజు© 2017,www.logili.com All Rights Reserved.