గత యాబై రెండేళ్ళ సాహితీ, సామాజిక స్థితిగతులను తలస్పర్శిగా పంచుకోవాలనుకునే వారికి మరిన్ని విశేషాలు ఇప్పటి నేపధ్యంలో విశ్లేషిస్తూ పొతే - అది కేవలం నా కధేకాక చాలామంది పాఠకుల్లో మధుర స్మృతుల్ని మేలుకొలుపుతుందన్న ప్రయత్నమే ఈ పేజీలు. ఇందులో
ఎన్.టి. రామారావు :
ఎన్.టి. రామారావు 'దాన వీర శూర కర్ణ' ప్రివ్యూని మద్రాసు సత్యం దియేటర్ లో ఏర్పాటు చేశారు. మరునాడు తెల్లవారు జామున వారిని కలిసే పని కలిగింది. "ఎలా ఉంది సినిమా?" అన్నారాయన. నా సమాధానం ఇప్పటికి గుర్తుంది. "చలన చిత్ర రంగంలో మూడు పాత్రలకు ప్రత్యామ్నాయం లేదు. బహుశా చరిత్రలో వారు ఇలాగే ఉండేవారేమో అనేంత పెర్ ఫెక్షన్ సాధించిన నటులు వారు. రెక్స్ హారిసన్ 'సీజర్', వృధ్విరాజ్ కపూర్ 'అక్బర్', ఎన్టిఆర్ ' 'దుర్యోధనుడు' అన్నాను.
పి.వి. నరసింహారావు :
పి.వి. నరసింహారావు, కాళోజీ నారాయణరావు గారు మిత్రులు. అయితే జీవన దృక్పధంలో, అభిప్రాయాల్లో ఇద్దరికీ చుక్కెదురు. అయినా పి.వి. గారు ఆయన్ని పద్మభూషణ్ ని చేశారు. చేసినందుకు నా ముందు (వారిని డిల్లీలో వారి బంగాళాలో కలిసినప్పుడు) గర్వపడ్డారు. అది వారి స్నేహశీలత.
శ్రీశ్రీ :
నా మొదటి చిత్రంలో (డా.చక్రవర్తి) శ్రీ శ్రీ పాట రాసున్నప్పుడు (మనసున మనపై) నేను పక్కనే ఉన్నాను. రేడియో ఆఫీసరుగా ఆయనతో పరిచయం కారణంగానే గర్వపడే తరాన్ని చూశాను. ఆ తరంలో పెరిగాను.
రాచకొండ విశ్వనాధ శాస్త్రి :
ఆ రోజుల్లో చిత్రగుప్తలో చిన్న కధలు రాసే మరొక రచయిత రాచకొండ విశ్వనాధశాస్త్రి. 'జాస్మిన్' అనే కలం పేరుతో రాసేవారు. రాచకొండను "ఏమైనా రాస్తున్నారా?" అని అడిగితే, అదేదో తప్పు పని లాగ "అబ్బే! ఏం లేదండి. అబ్బెబ్బే?" అనే వారు. రచయితలు రెండు రకాలు. ఆలోచనను పూరించుకుని, మెరుగులు మనస్సులోనే దిద్దుకుని కాగితం మీదకి తెచ్చే రచయితలు. వారికీ రచన ఓ వ్యాసంగం. కేవలం రాయడం ద్వారా క్రమంగా ఆలోచనని పదును పెట్టుకునే రచయితలు రెండోరకం. రావిశాస్త్రి మొదటి రకానికి చెందిన రచయిత.
శశికపూర్ :
26సంవత్సరాలు వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. శశికపూర్ కంటె జెన్నిఫర్ కాస్త పెద్దది. ఆయన్ని కంటికి రెప్పలా చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్యా ఏ రహస్యాలూ లేవు. శశికపూర్ జీవితంలో ఓకే ఒక రహస్యాన్ని ఆమె ముందు దాచాడు ఆమె క్యాన్సర్ విషయం. ఆరోగ్యం క్షీణించి 1984 సెప్టెంబర్ 7న జెన్నిఫర్ కన్నుమూసింది.
"నా డైరీలో కొన్ని పేజీలు" ఇవన్నీ మహనీయుల జ్ఞాపకాలు, మధుర స్మృతులు, ఎందరు మహనీయుల పునశ్చరణ! ఎన్ని వింత సంఘటనలు! ఎన్నో అనుభవాలు, అనుభూతులూ ఉన్నాయి.
- గొల్లపూడి మారుతీరావు
గత యాబై రెండేళ్ళ సాహితీ, సామాజిక స్థితిగతులను తలస్పర్శిగా పంచుకోవాలనుకునే వారికి మరిన్ని విశేషాలు ఇప్పటి నేపధ్యంలో విశ్లేషిస్తూ పొతే - అది కేవలం నా కధేకాక చాలామంది పాఠకుల్లో మధుర స్మృతుల్ని మేలుకొలుపుతుందన్న ప్రయత్నమే ఈ పేజీలు. ఇందులో ఎన్.టి. రామారావు : ఎన్.టి. రామారావు 'దాన వీర శూర కర్ణ' ప్రివ్యూని మద్రాసు సత్యం దియేటర్ లో ఏర్పాటు చేశారు. మరునాడు తెల్లవారు జామున వారిని కలిసే పని కలిగింది. "ఎలా ఉంది సినిమా?" అన్నారాయన. నా సమాధానం ఇప్పటికి గుర్తుంది. "చలన చిత్ర రంగంలో మూడు పాత్రలకు ప్రత్యామ్నాయం లేదు. బహుశా చరిత్రలో వారు ఇలాగే ఉండేవారేమో అనేంత పెర్ ఫెక్షన్ సాధించిన నటులు వారు. రెక్స్ హారిసన్ 'సీజర్', వృధ్విరాజ్ కపూర్ 'అక్బర్', ఎన్టిఆర్ ' 'దుర్యోధనుడు' అన్నాను. పి.వి. నరసింహారావు : పి.వి. నరసింహారావు, కాళోజీ నారాయణరావు గారు మిత్రులు. అయితే జీవన దృక్పధంలో, అభిప్రాయాల్లో ఇద్దరికీ చుక్కెదురు. అయినా పి.వి. గారు ఆయన్ని పద్మభూషణ్ ని చేశారు. చేసినందుకు నా ముందు (వారిని డిల్లీలో వారి బంగాళాలో కలిసినప్పుడు) గర్వపడ్డారు. అది వారి స్నేహశీలత. శ్రీశ్రీ : నా మొదటి చిత్రంలో (డా.చక్రవర్తి) శ్రీ శ్రీ పాట రాసున్నప్పుడు (మనసున మనపై) నేను పక్కనే ఉన్నాను. రేడియో ఆఫీసరుగా ఆయనతో పరిచయం కారణంగానే గర్వపడే తరాన్ని చూశాను. ఆ తరంలో పెరిగాను. రాచకొండ విశ్వనాధ శాస్త్రి : ఆ రోజుల్లో చిత్రగుప్తలో చిన్న కధలు రాసే మరొక రచయిత రాచకొండ విశ్వనాధశాస్త్రి. 'జాస్మిన్' అనే కలం పేరుతో రాసేవారు. రాచకొండను "ఏమైనా రాస్తున్నారా?" అని అడిగితే, అదేదో తప్పు పని లాగ "అబ్బే! ఏం లేదండి. అబ్బెబ్బే?" అనే వారు. రచయితలు రెండు రకాలు. ఆలోచనను పూరించుకుని, మెరుగులు మనస్సులోనే దిద్దుకుని కాగితం మీదకి తెచ్చే రచయితలు. వారికీ రచన ఓ వ్యాసంగం. కేవలం రాయడం ద్వారా క్రమంగా ఆలోచనని పదును పెట్టుకునే రచయితలు రెండోరకం. రావిశాస్త్రి మొదటి రకానికి చెందిన రచయిత. శశికపూర్ : 26సంవత్సరాలు వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. శశికపూర్ కంటె జెన్నిఫర్ కాస్త పెద్దది. ఆయన్ని కంటికి రెప్పలా చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్యా ఏ రహస్యాలూ లేవు. శశికపూర్ జీవితంలో ఓకే ఒక రహస్యాన్ని ఆమె ముందు దాచాడు ఆమె క్యాన్సర్ విషయం. ఆరోగ్యం క్షీణించి 1984 సెప్టెంబర్ 7న జెన్నిఫర్ కన్నుమూసింది. "నా డైరీలో కొన్ని పేజీలు" ఇవన్నీ మహనీయుల జ్ఞాపకాలు, మధుర స్మృతులు, ఎందరు మహనీయుల పునశ్చరణ! ఎన్ని వింత సంఘటనలు! ఎన్నో అనుభవాలు, అనుభూతులూ ఉన్నాయి. - గొల్లపూడి మారుతీరావు
© 2017,www.logili.com All Rights Reserved.