పత్రిక నుంచి ఫేస్ బుక్ దాకా మీడియా మన నిత్యజీవితపు అడుగులో, ఆలోచనలో, విజయంలో, పరాజయంలో, ఉత్సాహంలో, వికారంలో తోడుగా నీడగా కలిసి కదులుతోంది. ఈ ముద్ర రోజురోజుకూ పెరుగుతోంది.
ఫలానా పత్రిక ఇలా రాసిందేమిటి? ఫలానా టీవీ అలా చెప్తోందేమిటి? ఈ ప్రోగ్రామేమిటి ఇలా ఉంది. నా పిల్లలు చూడచ్చా? మా అబ్బాయేమిటి ఇరవై నాలుగు గంటలూ కంప్యూటర్ ను, మొబైల్ ను వదిలి పెట్టడం లేదు?
ఏ రాత నిజం, ఏ కధనం సత్యం, ఏది మంచి, ఏది చెడు?
పూర్వం పత్రికలు, టీవీలు, ఇంటర్నెట్ లు, ఫోన్ల ధాటి ఇంతగా ఉండేది కాదు. వాటి ఆనుపానుల గురించి ఇంతటి స్పృహ ఉండేది కాదు. ఇంతటి పట్టింపు ఉండేది కాదు. కానీ మీడియా, పై-లిన్ లా ప్రతి క్షణాన్ని, ప్రతి పార్శ్వాన్నీ తడిమేస్తోంది. భావోద్వేగాలనూ రాజేస్తుంది.
మీడియా పోకడ గురించి, దానితో ముడిపడి ఉన్న యాజమాన్యాల స్వార్ధాల గురించి, రేటింగ్ ల గురించి - సమస్తం తెలుసుకోవాలన్న ఆలోచన సామాన్య ప్రజానీకంలోనూ రానురానూ బలపడుతోంది.
ఈ పుస్తకం మీ అన్వేషణకు విరామం ఇస్తుంది. మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. మొత్తంగా మీడియాకు సంబంధించిన మీ అవగాహనను, పరిధిని పెంచుతుంది.
- గోవిందరాజు చక్రధర్
పత్రిక నుంచి ఫేస్ బుక్ దాకా మీడియా మన నిత్యజీవితపు అడుగులో, ఆలోచనలో, విజయంలో, పరాజయంలో, ఉత్సాహంలో, వికారంలో తోడుగా నీడగా కలిసి కదులుతోంది. ఈ ముద్ర రోజురోజుకూ పెరుగుతోంది. ఫలానా పత్రిక ఇలా రాసిందేమిటి? ఫలానా టీవీ అలా చెప్తోందేమిటి? ఈ ప్రోగ్రామేమిటి ఇలా ఉంది. నా పిల్లలు చూడచ్చా? మా అబ్బాయేమిటి ఇరవై నాలుగు గంటలూ కంప్యూటర్ ను, మొబైల్ ను వదిలి పెట్టడం లేదు? ఏ రాత నిజం, ఏ కధనం సత్యం, ఏది మంచి, ఏది చెడు? పూర్వం పత్రికలు, టీవీలు, ఇంటర్నెట్ లు, ఫోన్ల ధాటి ఇంతగా ఉండేది కాదు. వాటి ఆనుపానుల గురించి ఇంతటి స్పృహ ఉండేది కాదు. ఇంతటి పట్టింపు ఉండేది కాదు. కానీ మీడియా, పై-లిన్ లా ప్రతి క్షణాన్ని, ప్రతి పార్శ్వాన్నీ తడిమేస్తోంది. భావోద్వేగాలనూ రాజేస్తుంది. మీడియా పోకడ గురించి, దానితో ముడిపడి ఉన్న యాజమాన్యాల స్వార్ధాల గురించి, రేటింగ్ ల గురించి - సమస్తం తెలుసుకోవాలన్న ఆలోచన సామాన్య ప్రజానీకంలోనూ రానురానూ బలపడుతోంది. ఈ పుస్తకం మీ అన్వేషణకు విరామం ఇస్తుంది. మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. మొత్తంగా మీడియాకు సంబంధించిన మీ అవగాహనను, పరిధిని పెంచుతుంది. - గోవిందరాజు చక్రధర్© 2017,www.logili.com All Rights Reserved.