అలెగ్జాండర్ కు ప్రపంచాన్ని జయించాలనే కోరిక రూపొందించిన నేపధ్యం, అందుకు అతడిలోని సాహస పరాక్రమాలు, కఠోర సాధన, తన సైనికులను ఆత్మియులుగా భావించి తనతో నడిపే విధానం, అతడు ఎదుర్కొన్న ఇబ్భందులు, కష్టాలు, అలెగ్జాండర్ సాహసాన్ని పరిగణించి అతడి పంచన చేరే రాజులను అతడు గౌరవించిన విధానం, పరాజిత రాజుల అంతఃపుర స్త్రీల పట్ల అతడి క్రూరత్వం మొదలగు ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో రచయిత మనకు అందించారు. అలెగ్జాండర్ గావించిన జైత్రయాత్రలకు, వాటికి గురైన పలు దేశాలకు ఆయన మనల్ని తనతోపాటే తీసుకువెళతారు.
మహా అలెగ్జాండర్ దండయాత్రల ఫలితంగా గ్రీకు నాగరికత ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వ్యాపించటమే కాక వర్తక వాణిజ్యాలు వృద్ధి చెందాయి. ఆ కాలంలోనే ఖగోళ శాస్త్రం వంటి విజ్ఞానాలు కూడా అభివృధి చెందేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇవన్నీ గుణపాఠాలు మనం స్వికరించాల్సిన అవసరం ఉందనేది రచయిత అభిప్రాయం. పుస్తకం మొత్తం దేశపటాలతోనూ, ఇతర చిత్రాలతోనూ మన పరిజ్ఞానం వృద్ధి చెందేందుకు తోడ్పడుతోంది.
- ఆత్మా రవి
అలెగ్జాండర్ కు ప్రపంచాన్ని జయించాలనే కోరిక రూపొందించిన నేపధ్యం, అందుకు అతడిలోని సాహస పరాక్రమాలు, కఠోర సాధన, తన సైనికులను ఆత్మియులుగా భావించి తనతో నడిపే విధానం, అతడు ఎదుర్కొన్న ఇబ్భందులు, కష్టాలు, అలెగ్జాండర్ సాహసాన్ని పరిగణించి అతడి పంచన చేరే రాజులను అతడు గౌరవించిన విధానం, పరాజిత రాజుల అంతఃపుర స్త్రీల పట్ల అతడి క్రూరత్వం మొదలగు ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో రచయిత మనకు అందించారు. అలెగ్జాండర్ గావించిన జైత్రయాత్రలకు, వాటికి గురైన పలు దేశాలకు ఆయన మనల్ని తనతోపాటే తీసుకువెళతారు. మహా అలెగ్జాండర్ దండయాత్రల ఫలితంగా గ్రీకు నాగరికత ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వ్యాపించటమే కాక వర్తక వాణిజ్యాలు వృద్ధి చెందాయి. ఆ కాలంలోనే ఖగోళ శాస్త్రం వంటి విజ్ఞానాలు కూడా అభివృధి చెందేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇవన్నీ గుణపాఠాలు మనం స్వికరించాల్సిన అవసరం ఉందనేది రచయిత అభిప్రాయం. పుస్తకం మొత్తం దేశపటాలతోనూ, ఇతర చిత్రాలతోనూ మన పరిజ్ఞానం వృద్ధి చెందేందుకు తోడ్పడుతోంది. - ఆత్మా రవి© 2017,www.logili.com All Rights Reserved.