అప్రతిష్టపాలయిన కాంగ్రెస్ కు, మతోన్మాద బిజెపి ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదు. ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్ళే అభ్యుదయ ఆర్ధిక విధానాలతో కూడిన లౌకిక, ప్రజాతంత్ర ప్రభుత్వం మాత్రమే ప్రత్యామ్నాయం. అలాంటి ప్రత్యామ్నాయానికి ఏ అంశాలు ఆధారంగా ఉంటాయి, కాంగ్రెస్ ఇప్పటిదాకా అనుసరించిన విధానాలకు, బిజెపి చెబుతున్న విధానాలకు భిన్నమయిన ప్రజానుకూల విధానాలు ఏమిటి అన్న విషయాలను క్రోడికరించిన పుస్తకం ఇది. ఈ అంశాలన్నీ వామపక్ష, అభ్యుదయ శక్తులు, మేధావులూ రూపొందించినవి. ఎన్నికల సమయంలోనే కాకుండా ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రత్యామ్నాయ విధానాల పట్ల అవగాహన పెంచుకొని వాటి సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. సరళీకృత ఆర్ధిక విధానాల ఫలితంగా విభిన్న సెక్షన్ల ప్రజానీకం స్థితిగతులు ఎంతగా దిగజారిపోయాయో వివరిస్తూ, వాటికి ప్రత్యామ్నాయాలను కూడ సూచించే ఈ పుస్తకానికి దీర్ఘకాలిక ప్రాధాన్యత ఉంది.
- గుడిపూడి విజయరావు
అప్రతిష్టపాలయిన కాంగ్రెస్ కు, మతోన్మాద బిజెపి ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదు. ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్ళే అభ్యుదయ ఆర్ధిక విధానాలతో కూడిన లౌకిక, ప్రజాతంత్ర ప్రభుత్వం మాత్రమే ప్రత్యామ్నాయం. అలాంటి ప్రత్యామ్నాయానికి ఏ అంశాలు ఆధారంగా ఉంటాయి, కాంగ్రెస్ ఇప్పటిదాకా అనుసరించిన విధానాలకు, బిజెపి చెబుతున్న విధానాలకు భిన్నమయిన ప్రజానుకూల విధానాలు ఏమిటి అన్న విషయాలను క్రోడికరించిన పుస్తకం ఇది. ఈ అంశాలన్నీ వామపక్ష, అభ్యుదయ శక్తులు, మేధావులూ రూపొందించినవి. ఎన్నికల సమయంలోనే కాకుండా ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రత్యామ్నాయ విధానాల పట్ల అవగాహన పెంచుకొని వాటి సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. సరళీకృత ఆర్ధిక విధానాల ఫలితంగా విభిన్న సెక్షన్ల ప్రజానీకం స్థితిగతులు ఎంతగా దిగజారిపోయాయో వివరిస్తూ, వాటికి ప్రత్యామ్నాయాలను కూడ సూచించే ఈ పుస్తకానికి దీర్ఘకాలిక ప్రాధాన్యత ఉంది. - గుడిపూడి విజయరావు© 2017,www.logili.com All Rights Reserved.