మనదేశ సామాజిక వాస్తవికతను ఈ ప్రత్యేక నేపధ్యంలో పునర్విశ్లేషించుకోవలసిన, పునరంచనా వేయాల్సిన అవసరం ఏర్పడింది. చరిత్రలో, సంస్కృతిలో, సాహిత్యంలో శతాబ్దాలుగా విస్మరింపబడిన అనేక అంశాలు నేడు ప్రధానాంశాలై తలెత్తి నిలబడుతున్నాయి. మన దేశానికే పరిమితమైన 'కులం' 'అస్పృశ్యత' సమస్యలు కేవలం ఆర్ధిక పోరాటాల ద్వారా పరిష్కారమయ్యేవి కావనీ, దీనికోసం కులనిర్మూలన పోరాటాలనూ నిర్మించాల్సిన అవసరం ఉందనే స్పష్టమైన దృష్టి నేటి సాహిత్య ప్రక్రియల్లో వ్యక్తమౌతున్నది. సంకోచాలు తోలోగిపోయి నూతన అభివ్యక్తి, నూతన వ్యక్తీకరణలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నాయి.
జాషువాగారు ఈ నేపధ్యంలో సృజనశీలతకు మూలమైన సామాజిక, ఆర్ధిక, తాత్విక పునాదులను వివరించడానికి యత్నించారు. జాషువా రచనల ఆధారంగా, నాటి సామాజిక రుగ్మతలను నేటి తరం కళ్ళకు రూపుకట్టించే యత్నం చేశారు. విభిన్న కోణాల ద్వారా జాషువాను - ఆయన సాహిత్యాన్ని అంచనా వేసే కృషి చేశారు. జాషువాను ఎలా చదవాలో నేటి యువ సాహితీ విద్యార్ధులకు సూచనప్రాయంగా ఓ చూపు కల్గించే ప్రయత్నం ఈ సంకలనం నెరవేర్చగలదన్న చిరు ఆశతో దీన్ని అందిస్తున్నాం.
- డా. ఎస్వీ. సత్యనారాయణ
మనదేశ సామాజిక వాస్తవికతను ఈ ప్రత్యేక నేపధ్యంలో పునర్విశ్లేషించుకోవలసిన, పునరంచనా వేయాల్సిన అవసరం ఏర్పడింది. చరిత్రలో, సంస్కృతిలో, సాహిత్యంలో శతాబ్దాలుగా విస్మరింపబడిన అనేక అంశాలు నేడు ప్రధానాంశాలై తలెత్తి నిలబడుతున్నాయి. మన దేశానికే పరిమితమైన 'కులం' 'అస్పృశ్యత' సమస్యలు కేవలం ఆర్ధిక పోరాటాల ద్వారా పరిష్కారమయ్యేవి కావనీ, దీనికోసం కులనిర్మూలన పోరాటాలనూ నిర్మించాల్సిన అవసరం ఉందనే స్పష్టమైన దృష్టి నేటి సాహిత్య ప్రక్రియల్లో వ్యక్తమౌతున్నది. సంకోచాలు తోలోగిపోయి నూతన అభివ్యక్తి, నూతన వ్యక్తీకరణలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. జాషువాగారు ఈ నేపధ్యంలో సృజనశీలతకు మూలమైన సామాజిక, ఆర్ధిక, తాత్విక పునాదులను వివరించడానికి యత్నించారు. జాషువా రచనల ఆధారంగా, నాటి సామాజిక రుగ్మతలను నేటి తరం కళ్ళకు రూపుకట్టించే యత్నం చేశారు. విభిన్న కోణాల ద్వారా జాషువాను - ఆయన సాహిత్యాన్ని అంచనా వేసే కృషి చేశారు. జాషువాను ఎలా చదవాలో నేటి యువ సాహితీ విద్యార్ధులకు సూచనప్రాయంగా ఓ చూపు కల్గించే ప్రయత్నం ఈ సంకలనం నెరవేర్చగలదన్న చిరు ఆశతో దీన్ని అందిస్తున్నాం. - డా. ఎస్వీ. సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.