పవిత్రభారతదేశంలో జన్మించిన ధర్మాభిమానులందరూ రామాయణ గ్రంధాన్ని పారాయణం చేస్తూనే ఉంటారు. ధర్మస్థాపనే లక్ష్యముగాగల రామాయణమందలి హనుమంతుని భక్తీ భావుకత అత్యంత విశిష్టమైనది. భక్తీకి, శక్తికి నిస్వార్ధ సేవకు, త్యాగబలిదాన భావాదులకు హనుమజీవితము ఒక ఆదర్శప్రాయము. బుద్ధి కుశలతకు, భక్తీ జ్ఞానవైరాగ్యతలకు, శూరవిరత్త్వములకు ఆంజనేయుని జీవితమొక ఆణిముత్యము లాంటిది.
హనుమంతుడు గొప్ప నీతిజ్ఞుడు. అమంగళములను అంతము చేసి సన్మంగళములనొనగూర్చే శక్తిమంతుడు హనుమంతుడు. హనుమంతుని ఆరాధించుటవలన భూత, ప్రేత, పిశాచములు నశించుటేగాక, "బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అజాడ్యం, వాక్పటిమత్వం కలుగుతున్నవి.
హనుమంతుని బ్రహ్మచారి. హనుమంతుని చరిత్ర పటించటం వలన భక్తీవిశ్వాసములు, శ్రద్ధ, సాంప్రదాయములు సిద్ధిస్తాయి.
ప్రస్తుతము శ్రీరామభక్తహనుమన్మందిరములు ఈ భారతావనిలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ఇంతటి విశేష ప్రాముఖ్యత గల్గిన మా "హనుమచ్చరిత్ర"ను పారాయణం చేయటం వలన భక్తులందరూ భగవత్క్రుపను పొందగలరని ఆశిస్తున్నాము.
పవిత్రభారతదేశంలో జన్మించిన ధర్మాభిమానులందరూ రామాయణ గ్రంధాన్ని పారాయణం చేస్తూనే ఉంటారు. ధర్మస్థాపనే లక్ష్యముగాగల రామాయణమందలి హనుమంతుని భక్తీ భావుకత అత్యంత విశిష్టమైనది. భక్తీకి, శక్తికి నిస్వార్ధ సేవకు, త్యాగబలిదాన భావాదులకు హనుమజీవితము ఒక ఆదర్శప్రాయము. బుద్ధి కుశలతకు, భక్తీ జ్ఞానవైరాగ్యతలకు, శూరవిరత్త్వములకు ఆంజనేయుని జీవితమొక ఆణిముత్యము లాంటిది. హనుమంతుడు గొప్ప నీతిజ్ఞుడు. అమంగళములను అంతము చేసి సన్మంగళములనొనగూర్చే శక్తిమంతుడు హనుమంతుడు. హనుమంతుని ఆరాధించుటవలన భూత, ప్రేత, పిశాచములు నశించుటేగాక, "బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అజాడ్యం, వాక్పటిమత్వం కలుగుతున్నవి. హనుమంతుని బ్రహ్మచారి. హనుమంతుని చరిత్ర పటించటం వలన భక్తీవిశ్వాసములు, శ్రద్ధ, సాంప్రదాయములు సిద్ధిస్తాయి. ప్రస్తుతము శ్రీరామభక్తహనుమన్మందిరములు ఈ భారతావనిలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ఇంతటి విశేష ప్రాముఖ్యత గల్గిన మా "హనుమచ్చరిత్ర"ను పారాయణం చేయటం వలన భక్తులందరూ భగవత్క్రుపను పొందగలరని ఆశిస్తున్నాము.
© 2017,www.logili.com All Rights Reserved.