ఈ చిన్న పుస్తకం ఈనాటి బాల బాలికల కోసం వ్రాయబడింది. విషయం పాతదే అయినా ఈనాటి ద్రుష్టి కోణంతో అర్ధం చేసుకోవడం, చెప్పడం అవసరం.
మా చిన్నతనంలో పల్లెటూరి వాతావరణంలో పెరిగినపుడు బహుశా ఇలాంటి పుస్తకం అవసరం ఉండేది కాదు. ఏఏ పండుగ ఉంటే ఆయా దేవుణ్ణి పూజిస్తూ గుడికి వెళ్ళడం, లేదా ఇంట్లోనే ఆయా పూజల గురించి వ్రతాల గురించి కధలు వినడం చేసేవాళ్ళం. దేవుడంటే ఏమిటి, స్వర్గం, నరకం అంటే ఏమిటి అనేవాటి గురించి పురాణాలలో కధలు లేదా పౌరాణిక సినిమాలలో చూసిన విషయాలే మాకు ప్రమాణాలు. మా మనస్సుల్లో ఎలాంటి సందేహాలు ఉండేవి కావు. ఒకవేళ సందేహమంటూ ఉంటే ఏ దేవుడు అందరికన్నా బలవంతుడు, హనుమంతుడు బలవంతుడా, రాముడు బలవంతుడా లాంటి ప్రశ్నలు మాత్రం ఉండేవి. చాలా ఉత్సాహంగా రామనవమినాడు శ్రీరాముని పూజ, శివరాత్రి రోజు శివునిపూజ, లేదా దుర్గాష్టమి రోజు దుర్గాదేవి పూజ చేస్తూ గడిపేవాళ్ళం.
ఈరోజు కూడా బహుశా పల్లెల్లో కొంతవరకూ అలాంటి వాతావరణమే ఉండి ఉండవచ్చు. కానీ, సమాజంలో మార్పు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. దేవుళ్ళలో కూడా స్పర్ధ పెరిగినట్లు కనిపిస్తోంది. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అనే మతాలు టూత్ పేస్టులు, సబ్బులు, ఎడ్వర్టైజ్ చేసినట్లుగా ఇతర మతస్థులు తమ తమ దేవుళ్ళ గురించి ప్రచారం చేస్తూ ఎన్నో వేల ఏళ్ళుగా భారతదేశంలో వున్న రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు మొదలైన వాళ్ళని పనికిరాని వాళ్ళుగా చిత్రించడంలో పల్లెటూర్లలో కూడా చాల మార్పు వచ్చింది. ఆ మార్పు కళ్ళకు కనిపిస్తూనే ఉంది. హిందూమతంలో అబ్బో ఎంతోమంది దేవుళ్ళట, వీళ్ళు రాళ్ళని రప్పల్ని పుజిస్తారట అంటూ ప్రచారం చేస్తే చాలామంది ఇదంతా నిజమే కాబోలు అనుకునే వాతావరణం ఏర్పడింది. మనం ఏ దేశానికి వెళ్ళి వారి మతవిశ్వసాల్ని తప్పుబట్టడం లేదు. కానీ మనదేశంలో మన విశ్వాసాలపై అసత్య ప్రచారం ఉన్నందువల్ల మనధర్మం యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవడం కనీస అవసరం.
అంతేకాదు, 21వ శతాబ్దంలో మతం గొడవ ఎందుకు? అని మనం అనుకోవచ్చు. ప్రపంచంలో అందరూ అలా అనుకుంటే చాలమంచిదే. కానీ ఇటీవల సామజిక శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గమనించారు. 20వ శతాబ్దం కమ్యూనిజం, మావోయిజం, హిట్లర్ సిద్ధాంతం, పెట్టుబడి విధానం మొదలైన సిద్ధాంతాల మధ్య పోరాటం కాగా 21వ శతాబ్దంలో మతం మళ్ళీ ముఖ్యవిషయంగా మారిందని వీరు చెబుతున్నారు. దిని కారణంగానే అనేక దేశాల్లో వివిధ మతాలకు చెందినవాళ్ళ మధ్య పోరాటాలు, అంతర్యుద్దాలు మొదలైనవి.
నేను కొన్ని నెలల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కొందరు తల్లిదండ్రులతో మాట్లాడే సందర్భంలో వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు తెలిశాయి. మనదేశంలో పాఠశాలల్లో మతాల గురించి బోధించరు, కానీ పాశ్చ్యాత దేశాలలో అన్ని మతాల గురించి ప్రాధమిక అవగాహన కల్గిస్తారు. సహజంగా తమ మతాన్ని గురించి గొప్పగా చిత్రించడం మిగతా వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ గమనించింది ఏమిటంటే ఒక్క హిందూమతం గురించి చెప్పే సందర్భంలో మాత్రమే అవహేళన చేస్తూ బోధిస్తున్నట్లు తెలుస్తుంది. పిల్లలు ఈ విషయంలో తమ తల్లిదండ్రులను ప్రశ్నించడం, వారు తెల్లముఖం వేయడం జరుగుతూంది. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులకు కూడా అంతో ఇంతో మన మతం గూర్చి సరైన అవగాహన అవసరమని నాకు అనిపించింది.
అందుకే ఈ పుస్తకంలో మన మనసుల్లో తిరుగాడే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. మనమతంలో ఇంతమంది దేవుళ్ళ ఎందుకున్నారు? మనం విగ్రహాల్ని, పాముల్ని, పుట్టల్ని పూజిస్తామా? అంతా మన కర్మ బట్టి జరుగుతుందా? కులం అడ్డుగోడలు మతగ్రంధాలలో నిజంగా ఉన్నాయా - లాంటి ప్రశ్నలు ఈ పుస్తకంలో వివరించబడ్డాయి.
ఈ పుస్తకంలో హిందూమతం మొక్క మూలగ్రంధాల్ని పరిచయం చేశాను. మూలగ్రంధాలంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, వీటిలో మతము, వేదాంతశాస్త్రము రెండూ కలిసి ఉన్నాయి. వేదాంతానికి సంబంధించిన విషయాల్ని వీలైనంత సులభ భాషలో చెప్పడానికి ప్రయత్నించాను. అలాగే మూలగ్రంధాలకి ఆ తరువాత వచ్చిన ఇతిహాసాలు, పురాణాలకు ఎలాంటి సంబంధం ఉంది అనే విషయాన్ని కూడా చెప్పాను.
పిల్లల్ని ఉద్దేశించి వ్రాయబడిందే అయినా ఈ పుస్తకాన్ని తల్లిదండ్రులు చదివి అవగాహన చేసుకుని పిల్లలకి సరైన దృక్పథం కల్గించటం అవసరమని నా ఉద్దేశం.
ఈ చిన్న పుస్తకం ఈనాటి బాల బాలికల కోసం వ్రాయబడింది. విషయం పాతదే అయినా ఈనాటి ద్రుష్టి కోణంతో అర్ధం చేసుకోవడం, చెప్పడం అవసరం. మా చిన్నతనంలో పల్లెటూరి వాతావరణంలో పెరిగినపుడు బహుశా ఇలాంటి పుస్తకం అవసరం ఉండేది కాదు. ఏఏ పండుగ ఉంటే ఆయా దేవుణ్ణి పూజిస్తూ గుడికి వెళ్ళడం, లేదా ఇంట్లోనే ఆయా పూజల గురించి వ్రతాల గురించి కధలు వినడం చేసేవాళ్ళం. దేవుడంటే ఏమిటి, స్వర్గం, నరకం అంటే ఏమిటి అనేవాటి గురించి పురాణాలలో కధలు లేదా పౌరాణిక సినిమాలలో చూసిన విషయాలే మాకు ప్రమాణాలు. మా మనస్సుల్లో ఎలాంటి సందేహాలు ఉండేవి కావు. ఒకవేళ సందేహమంటూ ఉంటే ఏ దేవుడు అందరికన్నా బలవంతుడు, హనుమంతుడు బలవంతుడా, రాముడు బలవంతుడా లాంటి ప్రశ్నలు మాత్రం ఉండేవి. చాలా ఉత్సాహంగా రామనవమినాడు శ్రీరాముని పూజ, శివరాత్రి రోజు శివునిపూజ, లేదా దుర్గాష్టమి రోజు దుర్గాదేవి పూజ చేస్తూ గడిపేవాళ్ళం. ఈరోజు కూడా బహుశా పల్లెల్లో కొంతవరకూ అలాంటి వాతావరణమే ఉండి ఉండవచ్చు. కానీ, సమాజంలో మార్పు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. దేవుళ్ళలో కూడా స్పర్ధ పెరిగినట్లు కనిపిస్తోంది. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అనే మతాలు టూత్ పేస్టులు, సబ్బులు, ఎడ్వర్టైజ్ చేసినట్లుగా ఇతర మతస్థులు తమ తమ దేవుళ్ళ గురించి ప్రచారం చేస్తూ ఎన్నో వేల ఏళ్ళుగా భారతదేశంలో వున్న రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు మొదలైన వాళ్ళని పనికిరాని వాళ్ళుగా చిత్రించడంలో పల్లెటూర్లలో కూడా చాల మార్పు వచ్చింది. ఆ మార్పు కళ్ళకు కనిపిస్తూనే ఉంది. హిందూమతంలో అబ్బో ఎంతోమంది దేవుళ్ళట, వీళ్ళు రాళ్ళని రప్పల్ని పుజిస్తారట అంటూ ప్రచారం చేస్తే చాలామంది ఇదంతా నిజమే కాబోలు అనుకునే వాతావరణం ఏర్పడింది. మనం ఏ దేశానికి వెళ్ళి వారి మతవిశ్వసాల్ని తప్పుబట్టడం లేదు. కానీ మనదేశంలో మన విశ్వాసాలపై అసత్య ప్రచారం ఉన్నందువల్ల మనధర్మం యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవడం కనీస అవసరం. అంతేకాదు, 21వ శతాబ్దంలో మతం గొడవ ఎందుకు? అని మనం అనుకోవచ్చు. ప్రపంచంలో అందరూ అలా అనుకుంటే చాలమంచిదే. కానీ ఇటీవల సామజిక శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గమనించారు. 20వ శతాబ్దం కమ్యూనిజం, మావోయిజం, హిట్లర్ సిద్ధాంతం, పెట్టుబడి విధానం మొదలైన సిద్ధాంతాల మధ్య పోరాటం కాగా 21వ శతాబ్దంలో మతం మళ్ళీ ముఖ్యవిషయంగా మారిందని వీరు చెబుతున్నారు. దిని కారణంగానే అనేక దేశాల్లో వివిధ మతాలకు చెందినవాళ్ళ మధ్య పోరాటాలు, అంతర్యుద్దాలు మొదలైనవి. నేను కొన్ని నెలల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కొందరు తల్లిదండ్రులతో మాట్లాడే సందర్భంలో వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు తెలిశాయి. మనదేశంలో పాఠశాలల్లో మతాల గురించి బోధించరు, కానీ పాశ్చ్యాత దేశాలలో అన్ని మతాల గురించి ప్రాధమిక అవగాహన కల్గిస్తారు. సహజంగా తమ మతాన్ని గురించి గొప్పగా చిత్రించడం మిగతా వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ గమనించింది ఏమిటంటే ఒక్క హిందూమతం గురించి చెప్పే సందర్భంలో మాత్రమే అవహేళన చేస్తూ బోధిస్తున్నట్లు తెలుస్తుంది. పిల్లలు ఈ విషయంలో తమ తల్లిదండ్రులను ప్రశ్నించడం, వారు తెల్లముఖం వేయడం జరుగుతూంది. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులకు కూడా అంతో ఇంతో మన మతం గూర్చి సరైన అవగాహన అవసరమని నాకు అనిపించింది. అందుకే ఈ పుస్తకంలో మన మనసుల్లో తిరుగాడే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. మనమతంలో ఇంతమంది దేవుళ్ళ ఎందుకున్నారు? మనం విగ్రహాల్ని, పాముల్ని, పుట్టల్ని పూజిస్తామా? అంతా మన కర్మ బట్టి జరుగుతుందా? కులం అడ్డుగోడలు మతగ్రంధాలలో నిజంగా ఉన్నాయా - లాంటి ప్రశ్నలు ఈ పుస్తకంలో వివరించబడ్డాయి. ఈ పుస్తకంలో హిందూమతం మొక్క మూలగ్రంధాల్ని పరిచయం చేశాను. మూలగ్రంధాలంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, వీటిలో మతము, వేదాంతశాస్త్రము రెండూ కలిసి ఉన్నాయి. వేదాంతానికి సంబంధించిన విషయాల్ని వీలైనంత సులభ భాషలో చెప్పడానికి ప్రయత్నించాను. అలాగే మూలగ్రంధాలకి ఆ తరువాత వచ్చిన ఇతిహాసాలు, పురాణాలకు ఎలాంటి సంబంధం ఉంది అనే విషయాన్ని కూడా చెప్పాను. పిల్లల్ని ఉద్దేశించి వ్రాయబడిందే అయినా ఈ పుస్తకాన్ని తల్లిదండ్రులు చదివి అవగాహన చేసుకుని పిల్లలకి సరైన దృక్పథం కల్గించటం అవసరమని నా ఉద్దేశం.© 2017,www.logili.com All Rights Reserved.