అప్పుడెప్పుడో అయన రచనల్ని చదువుదామనుకుని, చదవలేకపోయిన వేణుగోపాల్ రచనల్ని ఇప్పుడు చదివి, తడిసిపోయాను. వణికిపోయాను. మండిపోయాను. వేణు గోపాల్ వచనం వర్షంలా నన్ను తడిపేసింది. చలిలా వణికించేసింది. ఎండలా మండించేసింది. మంచి వచనానికి కూడా ఋతువులూ, కాలాలూ ఉంటాయని తెలియజేసింది.వారం రోజులపాటు కధలన్నీ చదివాను. చదివిన ఈ వారం రోజులూ నా ప్రవర్తన నాకే అంతు చిక్కకుండా పోయింది. నవ్వనా? లేదు. ఆలోచనల్లో పడ్డానా ? లేదు. మరి? కళ్ళు చెమర్చుకుంటూ, కన్నీళ్ళు పెడుతూ కూర్చున్నాను. ఏడవడం గొప్ప రీలిఫ్. హాయిగా ఉపిరి పీల్చుకున్నాను. జ్ఞాపకాలు అందరికి ఉంటాయి.కానీ, ఆ జ్ఞాపకాల్ని కొందరే కధలుగా రాయగలడు. అనుభవాలు అందరికి ఉంటాయి, అయితే ఆ అనుభూతుల్ని కొందరే రాగయుక్తంగా పలికించగలరు. ఆ కొందరిలో కాశీభట్ల ప్రధముడనిపించారు.
వెయ్యి గొంతులు చెయ్యలేని పనిని ఓ కధ చేస్తుందంటారు. ఇందులో సుమారుగా అరవై కధలు ఉన్నాయి. అందుకు ఆనందంగా ఉంది.
- ఏ. ఎన్. జగన్నాధ శర్మ
"పుస్తకాల్ని చదువుదాం గౌరవిద్దాం. మనలోని మురికిని కడుక్కుందాం."
" మనుషుల్లో మార్దవం ప్రేమా నశించిపోతున్న తరుణంలో.... మనిషిలోని మనిషే మాయమైపోతున్నప్పుడు... మనస్సులో లాలిత్యాన్ని, మనిషితత్త్వాన్ని నింపే దినుసులు సంగీత సాహిత్యాలు"
అప్పుడెప్పుడో అయన రచనల్ని చదువుదామనుకుని, చదవలేకపోయిన వేణుగోపాల్ రచనల్ని ఇప్పుడు చదివి, తడిసిపోయాను. వణికిపోయాను. మండిపోయాను. వేణు గోపాల్ వచనం వర్షంలా నన్ను తడిపేసింది. చలిలా వణికించేసింది. ఎండలా మండించేసింది. మంచి వచనానికి కూడా ఋతువులూ, కాలాలూ ఉంటాయని తెలియజేసింది.వారం రోజులపాటు కధలన్నీ చదివాను. చదివిన ఈ వారం రోజులూ నా ప్రవర్తన నాకే అంతు చిక్కకుండా పోయింది. నవ్వనా? లేదు. ఆలోచనల్లో పడ్డానా ? లేదు. మరి? కళ్ళు చెమర్చుకుంటూ, కన్నీళ్ళు పెడుతూ కూర్చున్నాను. ఏడవడం గొప్ప రీలిఫ్. హాయిగా ఉపిరి పీల్చుకున్నాను. జ్ఞాపకాలు అందరికి ఉంటాయి.కానీ, ఆ జ్ఞాపకాల్ని కొందరే కధలుగా రాయగలడు. అనుభవాలు అందరికి ఉంటాయి, అయితే ఆ అనుభూతుల్ని కొందరే రాగయుక్తంగా పలికించగలరు. ఆ కొందరిలో కాశీభట్ల ప్రధముడనిపించారు. వెయ్యి గొంతులు చెయ్యలేని పనిని ఓ కధ చేస్తుందంటారు. ఇందులో సుమారుగా అరవై కధలు ఉన్నాయి. అందుకు ఆనందంగా ఉంది. - ఏ. ఎన్. జగన్నాధ శర్మ "పుస్తకాల్ని చదువుదాం గౌరవిద్దాం. మనలోని మురికిని కడుక్కుందాం." " మనుషుల్లో మార్దవం ప్రేమా నశించిపోతున్న తరుణంలో.... మనిషిలోని మనిషే మాయమైపోతున్నప్పుడు... మనస్సులో లాలిత్యాన్ని, మనిషితత్త్వాన్ని నింపే దినుసులు సంగీత సాహిత్యాలు"
© 2017,www.logili.com All Rights Reserved.