తెలుగులో హిందుస్తానీ సంగీతం గురించి సామల సదాశివ, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ వంటివారు, కర్నాటక సంగీతం గురించి సినిమాల ద్వారా కె.విశ్వనాథ్, బాపు తదితరులు పరిచయం, ప్రచారం, విశ్లేషణలు చేసి కొంతవరకూ రసజ్ఞ లోకాన్ని సృజించే ప్రయత్నాలు చెసారు. అయితే చిత్రకళకు సంబంధించి అటువంటి ప్రయత్నాలు చాలా చాలా అరుదు. ఆ లోటును తీర్చడానికి, మనల్ని రంగుల కలలలోకి తీసుకువెళ్ళడానికి వచ్చిన పుస్తకం – సప్తపర్ణి.
రసజ్ఞులు, రచయిత కాండ్రేగుల నాగేశ్వరరావు మిసిమి పత్రికలో చిత్రకళ గురించి, ఈ భూమిలో సినిమాల గురించి రాసిన వ్యాసాలూ, ఫోటోగ్రఫీ గురించి, శిల్పకళ గురించిన చెరో వ్యాసంతో రూపుదిద్దుకున్న సంకలనం ‘సప్తపర్ణి’. పుస్తకంలోని 68 వ్యాసాల్లో 47కు పైగా వ్యాసాలతో చిత్ర కళకు సంబంధించిన వ్యాసాలది అతిపెద్ద వాటా. చిత్రకళలో అతిరథ మహారథుల గురించీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పికాసో గుయెర్నికా లాంటి కళాఖండాల గురించి, క్యూబిజం, డాడాయిజం వంటి ధోరణులు, చిత్ర శిల్ప కళల్లో నగ్నత్వం లాంటి అంశాలపై వ్యాసాలున్నాయి. ఇందులో వ్యాసాల్లో పరిచయం, లోచూపు, విశ్లేషణ, విమర్శలు, వివరణలు ఇస్తూ చిత్రకళపై పాఠకులకు ఆసక్తి, కొంత అవగాహన కలిగిస్తారు.
తెలుగులో హిందుస్తానీ సంగీతం గురించి సామల సదాశివ, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ వంటివారు, కర్నాటక సంగీతం గురించి సినిమాల ద్వారా కె.విశ్వనాథ్, బాపు తదితరులు పరిచయం, ప్రచారం, విశ్లేషణలు చేసి కొంతవరకూ రసజ్ఞ లోకాన్ని సృజించే ప్రయత్నాలు చెసారు. అయితే చిత్రకళకు సంబంధించి అటువంటి ప్రయత్నాలు చాలా చాలా అరుదు. ఆ లోటును తీర్చడానికి, మనల్ని రంగుల కలలలోకి తీసుకువెళ్ళడానికి వచ్చిన పుస్తకం – సప్తపర్ణి. రసజ్ఞులు, రచయిత కాండ్రేగుల నాగేశ్వరరావు మిసిమి పత్రికలో చిత్రకళ గురించి, ఈ భూమిలో సినిమాల గురించి రాసిన వ్యాసాలూ, ఫోటోగ్రఫీ గురించి, శిల్పకళ గురించిన చెరో వ్యాసంతో రూపుదిద్దుకున్న సంకలనం ‘సప్తపర్ణి’. పుస్తకంలోని 68 వ్యాసాల్లో 47కు పైగా వ్యాసాలతో చిత్ర కళకు సంబంధించిన వ్యాసాలది అతిపెద్ద వాటా. చిత్రకళలో అతిరథ మహారథుల గురించీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పికాసో గుయెర్నికా లాంటి కళాఖండాల గురించి, క్యూబిజం, డాడాయిజం వంటి ధోరణులు, చిత్ర శిల్ప కళల్లో నగ్నత్వం లాంటి అంశాలపై వ్యాసాలున్నాయి. ఇందులో వ్యాసాల్లో పరిచయం, లోచూపు, విశ్లేషణ, విమర్శలు, వివరణలు ఇస్తూ చిత్రకళపై పాఠకులకు ఆసక్తి, కొంత అవగాహన కలిగిస్తారు.© 2017,www.logili.com All Rights Reserved.