శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతి వేంకట కవులలో ఒకరు. షడ్డర్శనీవేది చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గురువరేణ్యుల కటాక్షం పొందినవారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఎందరో అవధానులు, కవులు తయారయ్యారో లెక్కలేదు. పాండవోద్యోగ విజయ నాటకాల ద్వారా విఱుగు తఱుగు లేని చిరయశస్సు ఆర్జించారు. వీరి అవధానశక్తి అత్యంత విలక్షణం. ధారాశుద్ధితో కూడిన ధారణాశక్తి, ఆశుధారాపటిమ ఆజన్మసిద్ధమా అనిపిస్తుంది. అవధానమనే యాగాశ్వంతో దిగ్విజయ యాత్ర సలిపి కవితా సామ్రాజ్య పట్టాభిషిక్తులయ్యారు. పద్యమైనా, వచనమైనా, కబుర్లైనా చవులూరించేటట్లు రాయగలరు; చెప్పగలరు.
శతావధాని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి 18 యేండ్ల వయసులో శ్రీ కాశీ మహాక్షేత్రానికి వ్యాకరణాధ్యయనం కొరకు వెళ్లి ఆ అనుభవాలను రాశారు. అదే కాశీ యాత్ర. కాశీ గురించి చెప్పాలంటే అతి భారతీయ ఆత్మ. Timeless City. ప్రాచీన సంప్రదాయ విద్యలకు అప్పుడూ, ఇప్పుడూ అధ్యయన అధ్యాపన కేంద్రం.
చెళ్లపిళ్ల వారు చెప్పిన కథలు - గాథలులో చేరని మరి నాలుగు రచనలు కూడా కలిపి ఈ తరానికి అర్థం కావడానికి చక్కని పాద సూచికలతో, అలనాటి ఛాయాచిత్రాలతో, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీరమణల ముందు మాటలతో ఈ కాశీయాత్ర పొత్తాన్ని ప్రచురించాము.
- అన్నమయ్య గ్రంథాలయం
శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతి వేంకట కవులలో ఒకరు. షడ్డర్శనీవేది చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గురువరేణ్యుల కటాక్షం పొందినవారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఎందరో అవధానులు, కవులు తయారయ్యారో లెక్కలేదు. పాండవోద్యోగ విజయ నాటకాల ద్వారా విఱుగు తఱుగు లేని చిరయశస్సు ఆర్జించారు. వీరి అవధానశక్తి అత్యంత విలక్షణం. ధారాశుద్ధితో కూడిన ధారణాశక్తి, ఆశుధారాపటిమ ఆజన్మసిద్ధమా అనిపిస్తుంది. అవధానమనే యాగాశ్వంతో దిగ్విజయ యాత్ర సలిపి కవితా సామ్రాజ్య పట్టాభిషిక్తులయ్యారు. పద్యమైనా, వచనమైనా, కబుర్లైనా చవులూరించేటట్లు రాయగలరు; చెప్పగలరు. శతావధాని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి 18 యేండ్ల వయసులో శ్రీ కాశీ మహాక్షేత్రానికి వ్యాకరణాధ్యయనం కొరకు వెళ్లి ఆ అనుభవాలను రాశారు. అదే కాశీ యాత్ర. కాశీ గురించి చెప్పాలంటే అతి భారతీయ ఆత్మ. Timeless City. ప్రాచీన సంప్రదాయ విద్యలకు అప్పుడూ, ఇప్పుడూ అధ్యయన అధ్యాపన కేంద్రం. చెళ్లపిళ్ల వారు చెప్పిన కథలు - గాథలులో చేరని మరి నాలుగు రచనలు కూడా కలిపి ఈ తరానికి అర్థం కావడానికి చక్కని పాద సూచికలతో, అలనాటి ఛాయాచిత్రాలతో, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీరమణల ముందు మాటలతో ఈ కాశీయాత్ర పొత్తాన్ని ప్రచురించాము. - అన్నమయ్య గ్రంథాలయం© 2017,www.logili.com All Rights Reserved.