ఆధునిక సాహిత్యాన్ని మలుపు తిప్పిన విభిన్న ధోరణలు సాహిత్యం లంకా వెంకటేశ్వర్లుకు మంచి పరిశోధనాంశమైంది. 'ఆధునిక సాహిత్యంలో వృత్తి చైతన్యం' పిహెచ్. డి. పరిశోధనకు ఎంచుకున్న అంశం. దీనిని అత్యాధునిక దృష్టికోణం నుంచి నిర్వహించడం ఈ పరిశోధకుడు సాధించిన విజయం. సాహిత్యంలో వృత్తి చైతన్యం నెలకొనడానికి గల మూలాల్లోకీ వెళ్ళారు. ఒక నికార్సయిన దృక్పధంతో వృత్తి చైతన్యాన్ని అభివ్యక్తం చేసిన సాహిత్యాన్ని కూలంకషంగా పరిశోధించారు. ఈ చైతన్యం పాదుకోవడానికి గల నేపధ్యాన్ని సరిగ్గా అంచనా వేశారు. అణచివేతకు గురయిన వర్గాల వారు ఆధునిక సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించి, తమ గొంతుల్ని వినిపించిన సందర్భాల సంభ్రమంలోని చైతన్య విస్ఫోటనం ఎలాంటిదో ఈ పరిశోధన తేల్చి చెప్పింది. వృత్తుల విధ్వంసాన్ని గురించి వాపోతున్నవారు అక్షరాన్ని అంటి పెట్టుకున్న మడిని దడిని చెరిపేసిన క్రమంలో జరిగిన సాహిత్య సృష్టి ఔనత్యాన్ని గుర్తించాలి. ఆ ఎరుకను ఇచ్చే విశిష్ట పరిశోధన ఇది. వృత్తి చైతన్యం ఇతివృత్తంలో, శైలీశిల్పాల్లో, భాషలో, అభివ్యక్తీలో తీసుకొచ్చిన పెనుమార్పుల్ని ప్రతిఫలించిన విలక్షణ గ్రంథమిది.
ఆధునిక సాహిత్యాన్ని మలుపు తిప్పిన విభిన్న ధోరణలు సాహిత్యం లంకా వెంకటేశ్వర్లుకు మంచి పరిశోధనాంశమైంది. 'ఆధునిక సాహిత్యంలో వృత్తి చైతన్యం' పిహెచ్. డి. పరిశోధనకు ఎంచుకున్న అంశం. దీనిని అత్యాధునిక దృష్టికోణం నుంచి నిర్వహించడం ఈ పరిశోధకుడు సాధించిన విజయం. సాహిత్యంలో వృత్తి చైతన్యం నెలకొనడానికి గల మూలాల్లోకీ వెళ్ళారు. ఒక నికార్సయిన దృక్పధంతో వృత్తి చైతన్యాన్ని అభివ్యక్తం చేసిన సాహిత్యాన్ని కూలంకషంగా పరిశోధించారు. ఈ చైతన్యం పాదుకోవడానికి గల నేపధ్యాన్ని సరిగ్గా అంచనా వేశారు. అణచివేతకు గురయిన వర్గాల వారు ఆధునిక సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించి, తమ గొంతుల్ని వినిపించిన సందర్భాల సంభ్రమంలోని చైతన్య విస్ఫోటనం ఎలాంటిదో ఈ పరిశోధన తేల్చి చెప్పింది. వృత్తుల విధ్వంసాన్ని గురించి వాపోతున్నవారు అక్షరాన్ని అంటి పెట్టుకున్న మడిని దడిని చెరిపేసిన క్రమంలో జరిగిన సాహిత్య సృష్టి ఔనత్యాన్ని గుర్తించాలి. ఆ ఎరుకను ఇచ్చే విశిష్ట పరిశోధన ఇది. వృత్తి చైతన్యం ఇతివృత్తంలో, శైలీశిల్పాల్లో, భాషలో, అభివ్యక్తీలో తీసుకొచ్చిన పెనుమార్పుల్ని ప్రతిఫలించిన విలక్షణ గ్రంథమిది.© 2017,www.logili.com All Rights Reserved.