కవిత్వం ప్రతి పంక్తినీ ఉయ్యాలలో ఊపడం నేర్పరితనమే. నేనుకాదనను. కానీ ఊహారాహువు వచ్చి వాస్తవికతా చంద్రుణ్ణి మింగడం నాకు సరిపడని సంగతి. అలంకారాల జోలికే పోవద్దనడం లేదు. మామూలు సంభాషణలలోనే అలంకారాలు ఉంటాయి. నిజానికి కవిత్వంలో ఏదీ అతిగా ఉండకూడదు. వస్తు స్పృహ గానీ, వర్ణన గానీ, ప్రచారం గానీ అన్నీ సమపాళ్ళలో ఉంటేనే రాణిస్తుంది.
- కుందుర్తి
కవులంతా ఒక్కటి కాదు. కవిత్వమంతా ఒక్కటి కాదు. ఒకే భావంతో కవులంతా ఏకీకృతం కావచ్చు. అభివ్యక్తిలో ఎవరి శైలి వారిది. ఒక్కో కవిత ఒక్కో కోణంలో వైవిధ్యభరితంగా ఉంటుంది. అదే కవిత్వానికున్నంత గొప్ప శక్తి. ఎవరి శైలి వారిది. ఎవరి శిల్పం వారిది. కవితా సృజనలో భాష మనస్సులోని భావాన్ని బయటకు వెల్లడి చేస్తుంది. భావాన్ని స్థూలంగా బయటపెడుతుంది. తెలుగులో సాంప్రదాయికంగా ఉండే పద్యలక్షణాలకు ఒదగకుండా, సాధారణ వచనం కంటే భిన్నంగా ఉంటూ ప్రాచుర్యంలోకి వచ్చిన కవితా రూపమే 'వచనకవిత్వం' అని అంటున్నాం.
కవిత్వం ప్రతి పంక్తినీ ఉయ్యాలలో ఊపడం నేర్పరితనమే. నేనుకాదనను. కానీ ఊహారాహువు వచ్చి వాస్తవికతా చంద్రుణ్ణి మింగడం నాకు సరిపడని సంగతి. అలంకారాల జోలికే పోవద్దనడం లేదు. మామూలు సంభాషణలలోనే అలంకారాలు ఉంటాయి. నిజానికి కవిత్వంలో ఏదీ అతిగా ఉండకూడదు. వస్తు స్పృహ గానీ, వర్ణన గానీ, ప్రచారం గానీ అన్నీ సమపాళ్ళలో ఉంటేనే రాణిస్తుంది. - కుందుర్తి కవులంతా ఒక్కటి కాదు. కవిత్వమంతా ఒక్కటి కాదు. ఒకే భావంతో కవులంతా ఏకీకృతం కావచ్చు. అభివ్యక్తిలో ఎవరి శైలి వారిది. ఒక్కో కవిత ఒక్కో కోణంలో వైవిధ్యభరితంగా ఉంటుంది. అదే కవిత్వానికున్నంత గొప్ప శక్తి. ఎవరి శైలి వారిది. ఎవరి శిల్పం వారిది. కవితా సృజనలో భాష మనస్సులోని భావాన్ని బయటకు వెల్లడి చేస్తుంది. భావాన్ని స్థూలంగా బయటపెడుతుంది. తెలుగులో సాంప్రదాయికంగా ఉండే పద్యలక్షణాలకు ఒదగకుండా, సాధారణ వచనం కంటే భిన్నంగా ఉంటూ ప్రాచుర్యంలోకి వచ్చిన కవితా రూపమే 'వచనకవిత్వం' అని అంటున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.