రండి ..... నవ్వుతూ బ్రతుకుదాం !
"సంతోషమే సగం బలం " అన్నారు పెద్దలు. కొందరు ఎప్పుడూ నవ్వుతూ, అందరిని నవ్విస్తూ ఉంటారు. మరికొందరు ఎప్పుడూ సీరియస్ గా వుంటూ ఎందరినో దూరం చేసుకుంటారు. మనకు ఎన్నో కష్టాలుండవచ్చు. సమస్యలుండవచ్చు. ముఖాన్ని సీరియస్ గా ఉంచుకున్నంత మాత్రాన మన భాధలన్నీ మటుమాయమవుతాయా చెప్పండి.
"నవ్వడం చేతకానివాడు దుకాణం తెరవకూడదు" ఇది చైనా సామెత.
వికసించిన వదనానదంలో ప్రత్యేకమైన అందముంది. ఆకర్షణ వుంది. నవ్వుతూ పిల్లలతో మాట్లాడితే పరుగున వచ్చి మనల్ని చుట్టేసుకుంటారు. కాస్త చిరాకుగా కనిపించే వాళ్ళకు మాత్రం దూరంగా ఉంటారు పిల్లలు. పిల్లలు నవ్వుతూ,తుళ్ళుతూ,కేరింతలు కొడుతూ వుంటే వాళ్ళను చూస్తూ తల్లిదండ్రులు బాధల్ని మరచిపోతారు.నవ్వుతూ మాట్లాడేవాళ్ళ పట్ల ఇతరులు తొందరగా ఆకర్షించబతారు.
నవ్వడం మనకు దేవుడిచ్చిన అద్బుత శక్తి. అపూర్వ ఔషధం. ప్రతిక్షణం సంతోషంగా జీవిత పయనం సాగిద్దాం.... విజయం మన స్వంతం.
ఈ పుస్తకం ద్వారా మీరు ఓ గంటపాటు నవ్వితే మా ప్రయత్నం ఫలించినట్లే.
నవ్వండి నవ్వించండి
మీ హృదయాలను పరవశింపచేసే పసందైన జోక్స్
© 2017,www.logili.com All Rights Reserved.