1988, 89, 90 సంవత్సరాలలో వరుసగా వెలువడ్డ "గణితంలో గారడీలు", "మెదడుకి మేత", "మెదడకు పదును", అనే గణిత వినోదాలకు సంబంధించి నా మూడు పుస్తకాలనూ తెలుగు పాఠకులు విశేషంగా ఆదరించారు. నన్ను అభినందిస్తూ వందలకొద్ది ఉత్తరాలు వ్రాశారు. ఎన్నెన్నో కొత్త సమస్యలనూ, సందేహలనూ గుప్పించారు. వాటికీ సమాధానాలు వ్రాసే ప్రయత్నంలో తయారైన ఈ గ్రంథ నా చమత్కార గణిత పుస్తక శ్రేణిలో నాలుగవదీ, బహుశా చిట్ట చివరిదీనూ.
ఇందులో :
- చింతగింజలూ, గవ్వలూ, గులకరాళ్లు, అట్టముక్కలూ, కదుపుతూ సాధించ వలసిన సమస్యలున్నాయి.
- రైలు పెట్టెల షంటింగు సమస్యలున్నాయి
- పాలు - నీళ్ల కలగలుపు సమస్యలున్నాయి.
- అక్షరాలతో గుణకారాలూ, భాగాహారాలూ, కుడికలూ, తీసివేతలూ చేయించే సమస్యలున్నాయి.
- తర్క శక్తితో అపరాధపరిశోధన జరిపించే సమస్యలున్నాయి.
- అగ్గిపుల్లతో నిర్మించిన తప్పుడు సమీకరణాల సవరింపు సమస్యలున్నాయి.
- చదరంగంలో వివిధ జంతువుల నడకలకు సంబంధించిన సమస్యలున్నాయి.
- ఇంతేకాదు, ఇందులో :
- మాయచదరాలతోనూ, గుర్రపు గంతులతోనూ చమత్కారాలు చూపించాను. జూదంలో నెగ్గడానికి అవసరమైన గణితాన్ని ప్రదర్శించాను.
- అనుమానపు మొగుళ్ళ ఇబ్బందులకు పరిష్కారాలు కనబరచాను.
- ఆఖరికి మొక్కలు పాతడంలోనూ, పిల్లలకు పళ్లు పంచి పెట్టడంలోనూ కూడా గణితం సాయపడుతుందని తెలియబరచాను.
- అంకెల విచిత్ర ధర్మాలను వివరించాను.
ఇవికాక, ఇందులో :
పేకముక్కల సమస్యలూ, కేలండరు సమస్యలూ, గడియారం సమస్యలూ, ప్రయాణసమస్యలూ... ఇంకా ఎన్నో, ఎన్నోన్నో మనస్సుకి గిలిగింతలు పెట్టేవి, మేధస్సుకీ చురుకుపుట్టించేవీ, ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకేత్తించే సమస్యలు 200 దాకా పొండుపరించాను. ఈ సమస్యలన్నీటికీ జవాబులు ఇవ్వడమేకాదు - ఈ జవాబులు రాబట్టడానికి అవసరమైన తర్కాన్ని కూడా వివరించాను. ఈ తర్కపు మెట్లు ఎక్కి, పాఠకులు స్వయంగా ఇటువంటి సమస్యలను సాధించడంలో నేరుపులు కాగలరని నా ఆశ.
- మహీధర నళినీమోహన్
1988, 89, 90 సంవత్సరాలలో వరుసగా వెలువడ్డ "గణితంలో గారడీలు", "మెదడుకి మేత", "మెదడకు పదును", అనే గణిత వినోదాలకు సంబంధించి నా మూడు పుస్తకాలనూ తెలుగు పాఠకులు విశేషంగా ఆదరించారు. నన్ను అభినందిస్తూ వందలకొద్ది ఉత్తరాలు వ్రాశారు. ఎన్నెన్నో కొత్త సమస్యలనూ, సందేహలనూ గుప్పించారు. వాటికీ సమాధానాలు వ్రాసే ప్రయత్నంలో తయారైన ఈ గ్రంథ నా చమత్కార గణిత పుస్తక శ్రేణిలో నాలుగవదీ, బహుశా చిట్ట చివరిదీనూ. ఇందులో : - చింతగింజలూ, గవ్వలూ, గులకరాళ్లు, అట్టముక్కలూ, కదుపుతూ సాధించ వలసిన సమస్యలున్నాయి. - రైలు పెట్టెల షంటింగు సమస్యలున్నాయి - పాలు - నీళ్ల కలగలుపు సమస్యలున్నాయి. - అక్షరాలతో గుణకారాలూ, భాగాహారాలూ, కుడికలూ, తీసివేతలూ చేయించే సమస్యలున్నాయి. - తర్క శక్తితో అపరాధపరిశోధన జరిపించే సమస్యలున్నాయి. - అగ్గిపుల్లతో నిర్మించిన తప్పుడు సమీకరణాల సవరింపు సమస్యలున్నాయి. - చదరంగంలో వివిధ జంతువుల నడకలకు సంబంధించిన సమస్యలున్నాయి. - ఇంతేకాదు, ఇందులో : - మాయచదరాలతోనూ, గుర్రపు గంతులతోనూ చమత్కారాలు చూపించాను. జూదంలో నెగ్గడానికి అవసరమైన గణితాన్ని ప్రదర్శించాను. - అనుమానపు మొగుళ్ళ ఇబ్బందులకు పరిష్కారాలు కనబరచాను. - ఆఖరికి మొక్కలు పాతడంలోనూ, పిల్లలకు పళ్లు పంచి పెట్టడంలోనూ కూడా గణితం సాయపడుతుందని తెలియబరచాను. - అంకెల విచిత్ర ధర్మాలను వివరించాను. ఇవికాక, ఇందులో : పేకముక్కల సమస్యలూ, కేలండరు సమస్యలూ, గడియారం సమస్యలూ, ప్రయాణసమస్యలూ... ఇంకా ఎన్నో, ఎన్నోన్నో మనస్సుకి గిలిగింతలు పెట్టేవి, మేధస్సుకీ చురుకుపుట్టించేవీ, ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకేత్తించే సమస్యలు 200 దాకా పొండుపరించాను. ఈ సమస్యలన్నీటికీ జవాబులు ఇవ్వడమేకాదు - ఈ జవాబులు రాబట్టడానికి అవసరమైన తర్కాన్ని కూడా వివరించాను. ఈ తర్కపు మెట్లు ఎక్కి, పాఠకులు స్వయంగా ఇటువంటి సమస్యలను సాధించడంలో నేరుపులు కాగలరని నా ఆశ. - మహీధర నళినీమోహన్© 2017,www.logili.com All Rights Reserved.