టి.వేణుగోపాలరావు జీవితం - కృషి
మానవతావాది, ముక్కుసూటి మనిషి, జీవితంలో ఒడిదుడుకులను సాహసోపేతంగా నవ్వుకుంటూ ఈదగలిగిన ఆశావాది, ఎందరికో అండ, మరెందరికో సలహాలిచ్చి వారి జీవనరేఖలను మార్చిన మహామనిషి మన వేణు మాస్టారు.
చిన్నప్పుడు చదువు మాన్పించి వ్యవసాయంలో పెడుతుంటే ఏడ్చినందుకు తల్లి మళ్ళీ చదువులో పెట్టించింది. శేషమ్మ, పరశురామయ్యల కొడుకే అయినా మాణిక్యమ్మ, బాపయ్యగార్లు చేరదీసి పెంచారు. ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డగా పెరిగాడు. ఎప్పుడైనా బడి మానితే బెత్తంతో ఇంటికి వచ్చే మాస్టారి నించి మాణిక్యమ్మ రక్షించి, అటక మీద దాచిపెట్టేది. కానీ తర్వాత చదువు మీద మక్కువతో ఇంజనీరింగ్ చదివి, ఘంటశాలపాలెంలో ఆనాడు చదువుకున్న కొద్దిమందిలో ఒకడయాడు.
తల్లి చెప్పినట్లు అబద్దాలు మానేశాడు. ఆమె మడి ఆచారాలు పాటించినా, కాలంతో మారి, విశాఖలో తన ఇంట్లో కులమతాలతో సంబంధం లేకుండా కలిసిపోవడం చూసి మురిసిపోయాడు. తండ్రి సిద్ధాంతి. ఏ శుభకార్యానికైనా పాలెంలో ఆయనే ముహూర్తం పెట్టేవాడు. కానీ విస్తరిస్తున్న కొడుకు దృష్టిని ఆయన ఎన్నడూ అడ్డగించలేదు. ఎవరి నమ్మకాలు వారివనే విశాల దృక్పథం ఆయనది. వేణుగారికి కూడా అదే విశాల దృష్టి అలవడింది. అందుకే తన అభిప్రాయాలని నిక్కచ్చిగా వెల్లడించేవారు కానీ ఎవరిమీదా వాటిని రుద్దేవాడు కాదు.
ప్రాథమిక విద్య పాలెంలో, హైస్కూలు విద్య చల్లపల్లిలో, ఇంటరు బందరు హిందూ కాలేజీలో, ఇంజనీరింగ్ బి.ఇ. కాకినాడ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజిలో, యం.టెక్ ఖరగ్పూర్ ఐ.ఐ.టిలో, యం.యస్. ఇలినాయి యూనివర్సిటీలో కొన సాగిస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ, తన దృష్టిని విస్తరింపజేసుకుంటూ, స్నేహితులని...........................
టి.వేణుగోపాలరావు జీవితం - కృషి మానవతావాది, ముక్కుసూటి మనిషి, జీవితంలో ఒడిదుడుకులను సాహసోపేతంగా నవ్వుకుంటూ ఈదగలిగిన ఆశావాది, ఎందరికో అండ, మరెందరికో సలహాలిచ్చి వారి జీవనరేఖలను మార్చిన మహామనిషి మన వేణు మాస్టారు. చిన్నప్పుడు చదువు మాన్పించి వ్యవసాయంలో పెడుతుంటే ఏడ్చినందుకు తల్లి మళ్ళీ చదువులో పెట్టించింది. శేషమ్మ, పరశురామయ్యల కొడుకే అయినా మాణిక్యమ్మ, బాపయ్యగార్లు చేరదీసి పెంచారు. ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డగా పెరిగాడు. ఎప్పుడైనా బడి మానితే బెత్తంతో ఇంటికి వచ్చే మాస్టారి నించి మాణిక్యమ్మ రక్షించి, అటక మీద దాచిపెట్టేది. కానీ తర్వాత చదువు మీద మక్కువతో ఇంజనీరింగ్ చదివి, ఘంటశాలపాలెంలో ఆనాడు చదువుకున్న కొద్దిమందిలో ఒకడయాడు. తల్లి చెప్పినట్లు అబద్దాలు మానేశాడు. ఆమె మడి ఆచారాలు పాటించినా, కాలంతో మారి, విశాఖలో తన ఇంట్లో కులమతాలతో సంబంధం లేకుండా కలిసిపోవడం చూసి మురిసిపోయాడు. తండ్రి సిద్ధాంతి. ఏ శుభకార్యానికైనా పాలెంలో ఆయనే ముహూర్తం పెట్టేవాడు. కానీ విస్తరిస్తున్న కొడుకు దృష్టిని ఆయన ఎన్నడూ అడ్డగించలేదు. ఎవరి నమ్మకాలు వారివనే విశాల దృక్పథం ఆయనది. వేణుగారికి కూడా అదే విశాల దృష్టి అలవడింది. అందుకే తన అభిప్రాయాలని నిక్కచ్చిగా వెల్లడించేవారు కానీ ఎవరిమీదా వాటిని రుద్దేవాడు కాదు. ప్రాథమిక విద్య పాలెంలో, హైస్కూలు విద్య చల్లపల్లిలో, ఇంటరు బందరు హిందూ కాలేజీలో, ఇంజనీరింగ్ బి.ఇ. కాకినాడ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజిలో, యం.టెక్ ఖరగ్పూర్ ఐ.ఐ.టిలో, యం.యస్. ఇలినాయి యూనివర్సిటీలో కొన సాగిస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ, తన దృష్టిని విస్తరింపజేసుకుంటూ, స్నేహితులని...........................© 2017,www.logili.com All Rights Reserved.