మత్సువొ బషో (1644-1694) జపాన్ సాహిత్యంలో అగ్రశ్రేణి సాహిత్యకారుడు, కవి. జీవితమంతా తీవ్ర సౌందర్యోపాసకుడిగా జీవించాడు. తన జీవితకాలంలో ఐదుసార్లు జపానంతా పర్యటించాడు. ఆ పర్యటనల్లో తన అనుభవాల్నీ, అనుభూతినీ యాత్రావర్ణనలుగా రాసిపెట్టాడు. అలాగే అప్పుడప్పుడూ తన ఆనందాన్నీ, దుఃఖాన్నీ కూడా కవితాత్మక గద్యలుగా రాసిపెట్టాడు. ఇవికాక కొంత దినచర్య కూడా ఉంది. వీటన్నిటినీ మొదటి సారిగా తెలుగులోకి వాడ్రేవు చినవీరభద్రుడి అనువాదం ద్వారా అందిస్తున్నాం.
తెలుగు పాఠకులకు హైకూ కొత్తకాదు. 17 మాత్రల నిడివిగల మూడువాక్యాల హైకూ కవిత ‘వాక్యంరసాత్మకంకావ్యం’ అనే నానుడికి చక్కని ఉదాహరణ. కాని సుప్రసిద్ధమైన జపనీయ కవుల హైకూలు తెలుగులోకి విరివిగా అనువాదం కాలేదు. హైకూ కవుల్లో అగ్రగణ్యుడూ, ఆ ప్రక్రియకు అసామాన్యమైన గౌరవం సాధించినవాడూ అయిన బషో హైకూలు ఈ పుస్తకంలో సుమారు 200 పైదాకా ఉన్నాయి. ఆయన పూర్వకవులు సమకాలీనకవులు రాసిన కవితలు కూడా 60 పైచిలుకు ఉన్నాయి.
మత్సువొ బషో (1644-1694) జపాన్ సాహిత్యంలో అగ్రశ్రేణి సాహిత్యకారుడు, కవి. జీవితమంతా తీవ్ర సౌందర్యోపాసకుడిగా జీవించాడు. తన జీవితకాలంలో ఐదుసార్లు జపానంతా పర్యటించాడు. ఆ పర్యటనల్లో తన అనుభవాల్నీ, అనుభూతినీ యాత్రావర్ణనలుగా రాసిపెట్టాడు. అలాగే అప్పుడప్పుడూ తన ఆనందాన్నీ, దుఃఖాన్నీ కూడా కవితాత్మక గద్యలుగా రాసిపెట్టాడు. ఇవికాక కొంత దినచర్య కూడా ఉంది. వీటన్నిటినీ మొదటి సారిగా తెలుగులోకి వాడ్రేవు చినవీరభద్రుడి అనువాదం ద్వారా అందిస్తున్నాం. తెలుగు పాఠకులకు హైకూ కొత్తకాదు. 17 మాత్రల నిడివిగల మూడువాక్యాల హైకూ కవిత ‘వాక్యంరసాత్మకంకావ్యం’ అనే నానుడికి చక్కని ఉదాహరణ. కాని సుప్రసిద్ధమైన జపనీయ కవుల హైకూలు తెలుగులోకి విరివిగా అనువాదం కాలేదు. హైకూ కవుల్లో అగ్రగణ్యుడూ, ఆ ప్రక్రియకు అసామాన్యమైన గౌరవం సాధించినవాడూ అయిన బషో హైకూలు ఈ పుస్తకంలో సుమారు 200 పైదాకా ఉన్నాయి. ఆయన పూర్వకవులు సమకాలీనకవులు రాసిన కవితలు కూడా 60 పైచిలుకు ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.