అప్పుడు సూరికి పధ్నాలుగేళ్లు. 1946లో పుట్టాడు. తన వయసు చాలామంది పిల్లల్లాగే పరిమిత జ్ఞానం.
జిల్లా ముఖ్య పట్టణం వాళ్ళుంటున్నది. అయినా ఆధునిక విషయాలు అక్కడికి, అందులో పిల్లల వరకూ రావాలంటే చాలా సమయమే పట్టేది.
స్కూలు చదువు, స్నేహితులతో కబుర్లు, ఆటలు, అప్పుడప్పుడు ఓ సినిమా. అదే లోకం.
ఆడ మగ భేదం వరకు తెలుసు. అంతవరకే. అంతకు దాటి ఆలోచన పోయేది కాదు.
కానీ సూరి శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. లేతగా గడ్డం మీసాలు వచ్చాయి.
పిల్లలకి కొన్ని విషయాలు తెలియనట్టే, పెద్దాళ్ళకీ కొన్ని విషయాలు తెలియవు. తమ పిల్లలు స్కూలుకి వెడుతున్నారా, సరిగ్గా చదువుతున్నారా, అల్లరి ఏమైనా చేస్తున్నారా, ఆటల్లో దెబ్బలేమైనా తగుల్చుకుంటున్నారా, వాళ్ల అనారోగ్యాలూ. ఇంతవరకే తప్ప, మరేం పట్టించుకునేవారు కాదు. పట్టించుకునేవారు కాదు అనటం కన్నా, తెలియదు అనాలి. పిల్లల మనస్తత్వం, మార్పు, వయసు వస్తుంటే వాళ్లలో కొత్త భావనలు, ఆసక్తులు. వీటి గురించి చాలామందికి తెలియదు. తెలియకుండానే పిల్లల్ని పెంచేవారు.
అయినా, లైంగిక విషయాలు రహస్యమన్న అవగాహన అప్పటికే సూరికి తెలిసింది. అవి బాహాటంగా బైటికి చేసేవి కావని, చాటుగానే జరుగుతాయని ఎరుక ఏర్పడింది. కానీ చూసిన అనుభవం లేదు......................
అప్పుడు సూరికి పధ్నాలుగేళ్లు. 1946లో పుట్టాడు. తన వయసు చాలామంది పిల్లల్లాగే పరిమిత జ్ఞానం. జిల్లా ముఖ్య పట్టణం వాళ్ళుంటున్నది. అయినా ఆధునిక విషయాలు అక్కడికి, అందులో పిల్లల వరకూ రావాలంటే చాలా సమయమే పట్టేది. స్కూలు చదువు, స్నేహితులతో కబుర్లు, ఆటలు, అప్పుడప్పుడు ఓ సినిమా. అదే లోకం. ఆడ మగ భేదం వరకు తెలుసు. అంతవరకే. అంతకు దాటి ఆలోచన పోయేది కాదు. కానీ సూరి శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. లేతగా గడ్డం మీసాలు వచ్చాయి. పిల్లలకి కొన్ని విషయాలు తెలియనట్టే, పెద్దాళ్ళకీ కొన్ని విషయాలు తెలియవు. తమ పిల్లలు స్కూలుకి వెడుతున్నారా, సరిగ్గా చదువుతున్నారా, అల్లరి ఏమైనా చేస్తున్నారా, ఆటల్లో దెబ్బలేమైనా తగుల్చుకుంటున్నారా, వాళ్ల అనారోగ్యాలూ. ఇంతవరకే తప్ప, మరేం పట్టించుకునేవారు కాదు. పట్టించుకునేవారు కాదు అనటం కన్నా, తెలియదు అనాలి. పిల్లల మనస్తత్వం, మార్పు, వయసు వస్తుంటే వాళ్లలో కొత్త భావనలు, ఆసక్తులు. వీటి గురించి చాలామందికి తెలియదు. తెలియకుండానే పిల్లల్ని పెంచేవారు. అయినా, లైంగిక విషయాలు రహస్యమన్న అవగాహన అప్పటికే సూరికి తెలిసింది. అవి బాహాటంగా బైటికి చేసేవి కావని, చాటుగానే జరుగుతాయని ఎరుక ఏర్పడింది. కానీ చూసిన అనుభవం లేదు......................© 2017,www.logili.com All Rights Reserved.