ఈ వాస్తు శాస్త్రములో మంచి విషయములు, పదములు, ప్లానులు, గృహారంభ ప్రవేశములకు ముహూర్త నిర్ణయంతో కావలసిన సంభారములతో అందరికి ఉపయోగపడేలా పొందుపరచినారు.
శిక్షాకల్ప వ్యాకరణ నిరుక్త ఛందో జ్యోతిష్యాలలో 'వేదానాం చక్షుః జ్యోతిష్యముచ్చతే' అంటారు. జ్యోతిష్యము కాలాన్ని గణించే శాస్త్రమైతే, వాస్తుశాస్త్రం దేశం యొక్క నైసర్గిక, భౌగోళిక అంశాలను వివరిస్తుంది. ఈ భూమిపై మనుగడ సాగిస్తూ, అభ్యున్నతిని, సుఖశాంతులను పొందగోరి గృహ, ఆలయ, కర్మాగార, కర్యాలయాది నిర్మాణాలను చేపట్టే వారికీ యోగ్యమైన దిశానిర్దేశాన్ని సూచిస్తుంది ఈ వాస్తుశాస్త్రం. ఇది గృహవాస్తు, ఆగమవాస్తు అనే భేదాలతో విభిన్నమైన అంశాలను సమగ్రంగా చర్చించిన విలక్షణమైన శాస్త్రం.
నిర్మాణంలో ఇమిడియున్న ఎన్నో అంశాలను సోదాహరణాలతో 155 అంశాలుగా విభజించి వాటిని వివరిస్తూ 'సమగ్ర వాస్తుశాస్త్రం' అనే పేరిట ఈ బృహత్తర గ్రంథమును వెలువరుస్తున్నారు. బ్రహ్మశ్రీ కారుపర్తి నాగ మల్లేశ్వర సిద్ధాంతి, వీరి కృషి ప్రశంసనీయము. ఈ కృషి సఫలీకృతమై యోగ్యమైన ఫలితాలను అందించగలదని మంగళాశాసనములను తెలియజేస్తున్నాము.
హరిఃఓం తత్సత్
- స్వామి పరిపూర్ణానంద సరస్వతి
ఈ వాస్తు శాస్త్రములో మంచి విషయములు, పదములు, ప్లానులు, గృహారంభ ప్రవేశములకు ముహూర్త నిర్ణయంతో కావలసిన సంభారములతో అందరికి ఉపయోగపడేలా పొందుపరచినారు. శిక్షాకల్ప వ్యాకరణ నిరుక్త ఛందో జ్యోతిష్యాలలో 'వేదానాం చక్షుః జ్యోతిష్యముచ్చతే' అంటారు. జ్యోతిష్యము కాలాన్ని గణించే శాస్త్రమైతే, వాస్తుశాస్త్రం దేశం యొక్క నైసర్గిక, భౌగోళిక అంశాలను వివరిస్తుంది. ఈ భూమిపై మనుగడ సాగిస్తూ, అభ్యున్నతిని, సుఖశాంతులను పొందగోరి గృహ, ఆలయ, కర్మాగార, కర్యాలయాది నిర్మాణాలను చేపట్టే వారికీ యోగ్యమైన దిశానిర్దేశాన్ని సూచిస్తుంది ఈ వాస్తుశాస్త్రం. ఇది గృహవాస్తు, ఆగమవాస్తు అనే భేదాలతో విభిన్నమైన అంశాలను సమగ్రంగా చర్చించిన విలక్షణమైన శాస్త్రం. నిర్మాణంలో ఇమిడియున్న ఎన్నో అంశాలను సోదాహరణాలతో 155 అంశాలుగా విభజించి వాటిని వివరిస్తూ 'సమగ్ర వాస్తుశాస్త్రం' అనే పేరిట ఈ బృహత్తర గ్రంథమును వెలువరుస్తున్నారు. బ్రహ్మశ్రీ కారుపర్తి నాగ మల్లేశ్వర సిద్ధాంతి, వీరి కృషి ప్రశంసనీయము. ఈ కృషి సఫలీకృతమై యోగ్యమైన ఫలితాలను అందించగలదని మంగళాశాసనములను తెలియజేస్తున్నాము. హరిఃఓం తత్సత్ - స్వామి పరిపూర్ణానంద సరస్వతి© 2017,www.logili.com All Rights Reserved.