క్రైమ్, సస్పెన్స్, పోలీస్ ప్రోసిజర్, మిస్టరీ మొదలైన కధల లక్ష్యం ఒక్కటే. అది పాఠకుల్లో సస్పెన్స్ రేకెత్తించి, చివరి దాకా ఏక బిగిన చదివించి, ఎదురు చూడని మలుపుతో కధ ముగియడం. ఓ చాక్లెట్ నీ చప్పరిస్తూంటే చివర్లో బాదం పప్పు, జీడి పప్పు, కిస్ మిస్ లేదా వేరుశెనగ పప్పుల్లో ఏది వస్తుందో తినే వాడికి చివరి దాకా తెలీదు. అలాగే ఈ కధల్లోని ముగింపు కూడా పాఠకులకి ముందుగా తెలీదు. వేటిరుచి వాటివే. ఇందువల్ల ముగింపుని ముందుగా ఊహించలేక పోవడంతో 'ఓ మంచి కధని చదివాను' అనే తృప్తి పాఠకుల్లో కలుగుతుంది.
ఈ సంపుటిలోని కధలన్నీ ప్లేబాయ్, న్యూయార్కర్, ది అట్లాంటిక్ మంత్లీ లాంటి ఎన్నో అమెరికన్ పత్రికల్లో తొలుత ప్రచురింప బడ్డవే. ఓ కధ చదివాక ఇంకొ కధని చదవాలనే ఆసక్తిని రేకెత్తించే కధలే.
మంచి కధల్లో ఎన్నో దినుసులు ఉంటాయి. కాని ఆ దినుసులు ఉన్నవి అన్నీ మంచి కధలు కావు. మంచి దినుసులున్న, ఒకో కధని ఐదు నిమిషాల్లోగా చదివేసే అనేక మంచి కధలని ఈ మిస్టరీ స్టోరీస్ లో పాఠకులు చదవచ్చు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
క్రైమ్, సస్పెన్స్, పోలీస్ ప్రోసిజర్, మిస్టరీ మొదలైన కధల లక్ష్యం ఒక్కటే. అది పాఠకుల్లో సస్పెన్స్ రేకెత్తించి, చివరి దాకా ఏక బిగిన చదివించి, ఎదురు చూడని మలుపుతో కధ ముగియడం. ఓ చాక్లెట్ నీ చప్పరిస్తూంటే చివర్లో బాదం పప్పు, జీడి పప్పు, కిస్ మిస్ లేదా వేరుశెనగ పప్పుల్లో ఏది వస్తుందో తినే వాడికి చివరి దాకా తెలీదు. అలాగే ఈ కధల్లోని ముగింపు కూడా పాఠకులకి ముందుగా తెలీదు. వేటిరుచి వాటివే. ఇందువల్ల ముగింపుని ముందుగా ఊహించలేక పోవడంతో 'ఓ మంచి కధని చదివాను' అనే తృప్తి పాఠకుల్లో కలుగుతుంది. ఈ సంపుటిలోని కధలన్నీ ప్లేబాయ్, న్యూయార్కర్, ది అట్లాంటిక్ మంత్లీ లాంటి ఎన్నో అమెరికన్ పత్రికల్లో తొలుత ప్రచురింప బడ్డవే. ఓ కధ చదివాక ఇంకొ కధని చదవాలనే ఆసక్తిని రేకెత్తించే కధలే. మంచి కధల్లో ఎన్నో దినుసులు ఉంటాయి. కాని ఆ దినుసులు ఉన్నవి అన్నీ మంచి కధలు కావు. మంచి దినుసులున్న, ఒకో కధని ఐదు నిమిషాల్లోగా చదివేసే అనేక మంచి కధలని ఈ మిస్టరీ స్టోరీస్ లో పాఠకులు చదవచ్చు. - మల్లాది వెంకట కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.