జయం
దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకమ్
మనుష్యత్వం ముముక్షత్వం మహా పురుష సంశ్రయ
- వివేక చూడామణి
అర్ధం: :- మనిషి జన్మ, ముక్తి పొందాలన్న కోరిక, సద్గురువు సన్నిధి అనే ఈ మూడూ దైవానుగ్రహం వల్లనే లభ్యమౌతాయి.
ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అది. అందులో 'హౌస్ కీపింగ్' విభాగంలో గత నాలుగేళ్ళుగా స్కావెంజర్గా పని చేస్తున్న పృధ్వీరాజ్ గంటన్నర క్రితం డ్యూటీలోకి ఎక్కాక, 'వర్క్ క్లోత్స్ 'లోకి మారాడు. ఒక్కో టాయ్లెట్ లోకి వెళ్ళి వెస్ట్రన్ కమోడ్స్ క్లీన్ చేసి, యాంటీ బేక్టీరియా డిస్ ఇన్ఫెక్స్టెంట్ని పోసి, పైన సెల్లిఫోన్ పేపర్ని ఉంచుతున్నాడు. ఆ పేపర్ మీద 'డిస్ఇన్ఫెక్టెడ్' అన్న నీలం రంగు అక్షరాలు అచ్చువేసి ఉన్నాయి.
అతని దగ్గరకి వచ్చిన ఒకతను పృథ్వీరాజ్తో చెప్పాడు.
"నీ పేరిట ఓ కొరియర్ వచ్చింది. ఆఫీస్ గదిలో ఉందది."..............
© 2017,www.logili.com All Rights Reserved.