ముళ్ళపూడి వెంకటరమణ సృష్టించిన పాత్రలన్నిటిలోనూ ప్రసిద్ది చెందినది బుడుగు. బొమ్మలు వేసి పెట్టడమే కాదు 'బుడుగు' సృష్టిలో బాపు గారు కూడా పెద్ద పాత్ర వహించారు. 1962 నుండి బుడుగు కార్టూన్ స్క్రిప్ట్ రన్ చేయడంలోనే కాదు, బుడుగు కొత్త ఎడిషన్ వచ్చినప్పుడల్లా బుడుగుని రకరకాలుగా ప్రెజెంట్ చేయడంలో బాపుగారి బొమ్మలే ఇన్స్పిరేషన్. జనంలోకి వచ్చి అర్థ శతాబ్ది అవుతున్న బుడుగు పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదనడానికి తాజా నిదర్శనం -ముళ్ళపూడి సాహితి సర్వస్వంలో మొదటి సంపుటం కథరామణీయం-1 వెలువడగానే అందరూ అడిగినది 'బుడుగు' ఎప్పుడు వస్తుందనే! అంతటి ఆదరణ పొందిన పుస్తకం ఈ 'బుడుగు'.
ఇటివల 7వ తరగతి పాఠ్య పుస్తకాల కెక్కిన 'బుడుగు' ఇప్పటికి, ఎప్పటికి మనకందరికే కాదు, రమణకు అభిమాన రచనే. బుడుగు వంటి చిరంజీవికి, ఆ చిరంజీవి సృష్టించిన సాహితి చిరంజీవికి లభించిన అరుదైన ఆశిర్వాదం ఒకటుంది. అదే రామకృష్ణ శాస్త్రి గారి అంతటి వారే రమణ గారి బుడుగు భాషను కొంత అనుకరించడం.
-ముళ్ళపూడి వెంకట రమణ.
ముళ్ళపూడి వెంకటరమణ సృష్టించిన పాత్రలన్నిటిలోనూ ప్రసిద్ది చెందినది బుడుగు. బొమ్మలు వేసి పెట్టడమే కాదు 'బుడుగు' సృష్టిలో బాపు గారు కూడా పెద్ద పాత్ర వహించారు. 1962 నుండి బుడుగు కార్టూన్ స్క్రిప్ట్ రన్ చేయడంలోనే కాదు, బుడుగు కొత్త ఎడిషన్ వచ్చినప్పుడల్లా బుడుగుని రకరకాలుగా ప్రెజెంట్ చేయడంలో బాపుగారి బొమ్మలే ఇన్స్పిరేషన్. జనంలోకి వచ్చి అర్థ శతాబ్ది అవుతున్న బుడుగు పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదనడానికి తాజా నిదర్శనం -ముళ్ళపూడి సాహితి సర్వస్వంలో మొదటి సంపుటం కథరామణీయం-1 వెలువడగానే అందరూ అడిగినది 'బుడుగు' ఎప్పుడు వస్తుందనే! అంతటి ఆదరణ పొందిన పుస్తకం ఈ 'బుడుగు'. ఇటివల 7వ తరగతి పాఠ్య పుస్తకాల కెక్కిన 'బుడుగు' ఇప్పటికి, ఎప్పటికి మనకందరికే కాదు, రమణకు అభిమాన రచనే. బుడుగు వంటి చిరంజీవికి, ఆ చిరంజీవి సృష్టించిన సాహితి చిరంజీవికి లభించిన అరుదైన ఆశిర్వాదం ఒకటుంది. అదే రామకృష్ణ శాస్త్రి గారి అంతటి వారే రమణ గారి బుడుగు భాషను కొంత అనుకరించడం. -ముళ్ళపూడి వెంకట రమణ.ఉత్త హాస్యమే కాకుండా, విలువలు, సంస్కృతి, అన్నింటికన్నా ముఖ్యంగా, తీయ్యటి తెలుగుని మనకి అందిస్తుంది. ఒకే ఒక్క మాటలొ చెప్పాలంటే... అద్భుతః :)
© 2017,www.logili.com All Rights Reserved.