కృతజ్ఞత
మండు వేసవికాలంలో ఒక రోజు రాత్రి, వెన్నెల ముమ్మరంగా కాస్తోంది. పెదపంతులుగారి లోగిలిముందు ఆరుబైట వేసిన తెల్లటి పక్కలమీద ఆ వెన్నెల విరగబడి నవ్వుతూ పొర్లాడింది.
వెండికొండ పరమేశ్వరుడివలె ఆ తెల్లటి పక్కవేసిన మంచం పైన పంతులుగారు సభాభిముఖవదనులై మందహాసంతో నీలి ఆకాశాన వెలిగిపోతున్న చంద్రుణ్ణి చూస్తున్నారు. కొంచెం దూరంలో పెదరైతు బంగారయ్య గొంతుకిలా కూచుని పొలం సంగతులు చెపుతున్నాడు. అరుగుచివర దూరంగా నిల్చున్న పాలేరు ముళ్ళకర్ర పిడిమీద పెట్టుకున్న చేతిముణుకులమీద గడ్డం ఆనించి కబుర్లు ఆలకిస్తున్నాడు.
సుబ్రహ్మణ్యంగారి సతీమణి కామేశ్వరీ, పెదపంతులుగారి భార్య సుందరమ్మా గుమ్మం మెట్లమీద కూర్చున్నారు. వాళ్ళు తలలో తురుముకున్న మల్లెపూల చెండ్లూ, మరువం పరిమళాలు గుబాళిస్తున్నాయి.
హఠాత్తుగా ఒక పెద్ద గావుకేక గాలిని బద్దలు చేస్తూ వినవచ్చింది. అందరూ ఉలికిపడ్డారు..............
కృతజ్ఞత మండు వేసవికాలంలో ఒక రోజు రాత్రి, వెన్నెల ముమ్మరంగా కాస్తోంది. పెదపంతులుగారి లోగిలిముందు ఆరుబైట వేసిన తెల్లటి పక్కలమీద ఆ వెన్నెల విరగబడి నవ్వుతూ పొర్లాడింది. వెండికొండ పరమేశ్వరుడివలె ఆ తెల్లటి పక్కవేసిన మంచం పైన పంతులుగారు సభాభిముఖవదనులై మందహాసంతో నీలి ఆకాశాన వెలిగిపోతున్న చంద్రుణ్ణి చూస్తున్నారు. కొంచెం దూరంలో పెదరైతు బంగారయ్య గొంతుకిలా కూచుని పొలం సంగతులు చెపుతున్నాడు. అరుగుచివర దూరంగా నిల్చున్న పాలేరు ముళ్ళకర్ర పిడిమీద పెట్టుకున్న చేతిముణుకులమీద గడ్డం ఆనించి కబుర్లు ఆలకిస్తున్నాడు. సుబ్రహ్మణ్యంగారి సతీమణి కామేశ్వరీ, పెదపంతులుగారి భార్య సుందరమ్మా గుమ్మం మెట్లమీద కూర్చున్నారు. వాళ్ళు తలలో తురుముకున్న మల్లెపూల చెండ్లూ, మరువం పరిమళాలు గుబాళిస్తున్నాయి. హఠాత్తుగా ఒక పెద్ద గావుకేక గాలిని బద్దలు చేస్తూ వినవచ్చింది. అందరూ ఉలికిపడ్డారు..............© 2017,www.logili.com All Rights Reserved.