నేడు భారతదేశంలోనూ, అదేవిధంగా ప్రపంచంలో అనేకప్రాంతాల్లో ఎందరికో శ్రీ షిర్డీ సాయిబాబా తమ ఇష్టదైవంగా మారారు. ఈ పుస్తకం శ్రీ షిర్డీ సాయిబాబా, ఇతర సద్గురుల జీవితాలనూ, వారు ప్రదర్శించిన అద్భుతాలనూ రేఖామాత్రంగా స్పృశిస్తుంది. ఈ పుస్తకాన్ని చదవడంవల్ల కలిగే అనుభవం పాఠకుని ఆలోచనాద్రుష్టిలో మౌలికమైన మార్పును తీసుకోని వచ్చి ఆద్యాత్మిక ప్రగతికి చెప్పుకోదగినంతగా తోడ్పడుతుంది.
లోకకళ్యాణమే ధ్యేయంగా, దైవాంశసంభూతులైన సద్గురులు స్థూల, సుక్ష్మ స్థాయిల్లో తమ దివ్యశక్తుల్ని వినియోగించే తీరు గురించీ, జీవనిర్జీవపదార్ధాల్లో నిద్రాణంగా ఉన్న చైతన్యశక్తిని జాగృతంచేసి, వాటిని పరిణామమొనర్చి ఉన్నత చైతన్య స్థాయిలకు చేర్చడంకోసం సర్వకాలసర్వావస్థల్లో వారు నిర్వహించే అద్వితీయమైన పాత్ర గురించీ, ఈ పుస్తకం సోదాహరణంగా వివరిస్తుంది.
1991 - 1995 శ్రీ చంద్రభాను సత్పతి గారు రచించిన వ్యాసాల సంకలనమే ఈపుస్తకం. శ్రీ చంద్రభాను సత్పతిగారు 1989లో మొట్టమొదటిసారి శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించడం జరిగింది. అప్పటినుండి బాబా ప్రతిపాదించిన విలువల్ని వ్యాప్తిచేయడంకోసం అవిశ్రాంతంగా అహర్నిశలూ వీరు కృషిచేస్తున్నారు. ఆయనచే ప్రేరణపొంది, ఆయన మార్గదర్శకత్వంలో దేశవిదేశాల్లో వందలాది బాబా దేవాలయాలు నిర్మితమయ్యాయి. ఆయన స్వయంగా బాబా గురించీ రచనలు చేస్తూ, ఆంగ్లం, హిందీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, పంజాబీ, తెలుగు, తమిళ, ఇంకా ఇతర భారతీయభాషల్లో బాబాకు సంబంధించిన పత్రికలు ప్రచురించడాన్ని ప్రోత్సహిస్తున్నారు.
శ్రీ చంద్రభాను సత్పతిగారు ఉత్తరప్రదేశ్ నుండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ గా 2008లో పదవీవిరమణ చేసి, పూర్తి సమయాన్ని బాబా సేవలోనే గడుపుతున్నారు.
నేడు భారతదేశంలోనూ, అదేవిధంగా ప్రపంచంలో అనేకప్రాంతాల్లో ఎందరికో శ్రీ షిర్డీ సాయిబాబా తమ ఇష్టదైవంగా మారారు. ఈ పుస్తకం శ్రీ షిర్డీ సాయిబాబా, ఇతర సద్గురుల జీవితాలనూ, వారు ప్రదర్శించిన అద్భుతాలనూ రేఖామాత్రంగా స్పృశిస్తుంది. ఈ పుస్తకాన్ని చదవడంవల్ల కలిగే అనుభవం పాఠకుని ఆలోచనాద్రుష్టిలో మౌలికమైన మార్పును తీసుకోని వచ్చి ఆద్యాత్మిక ప్రగతికి చెప్పుకోదగినంతగా తోడ్పడుతుంది. లోకకళ్యాణమే ధ్యేయంగా, దైవాంశసంభూతులైన సద్గురులు స్థూల, సుక్ష్మ స్థాయిల్లో తమ దివ్యశక్తుల్ని వినియోగించే తీరు గురించీ, జీవనిర్జీవపదార్ధాల్లో నిద్రాణంగా ఉన్న చైతన్యశక్తిని జాగృతంచేసి, వాటిని పరిణామమొనర్చి ఉన్నత చైతన్య స్థాయిలకు చేర్చడంకోసం సర్వకాలసర్వావస్థల్లో వారు నిర్వహించే అద్వితీయమైన పాత్ర గురించీ, ఈ పుస్తకం సోదాహరణంగా వివరిస్తుంది. 1991 - 1995 శ్రీ చంద్రభాను సత్పతి గారు రచించిన వ్యాసాల సంకలనమే ఈపుస్తకం. శ్రీ చంద్రభాను సత్పతిగారు 1989లో మొట్టమొదటిసారి శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించడం జరిగింది. అప్పటినుండి బాబా ప్రతిపాదించిన విలువల్ని వ్యాప్తిచేయడంకోసం అవిశ్రాంతంగా అహర్నిశలూ వీరు కృషిచేస్తున్నారు. ఆయనచే ప్రేరణపొంది, ఆయన మార్గదర్శకత్వంలో దేశవిదేశాల్లో వందలాది బాబా దేవాలయాలు నిర్మితమయ్యాయి. ఆయన స్వయంగా బాబా గురించీ రచనలు చేస్తూ, ఆంగ్లం, హిందీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, పంజాబీ, తెలుగు, తమిళ, ఇంకా ఇతర భారతీయభాషల్లో బాబాకు సంబంధించిన పత్రికలు ప్రచురించడాన్ని ప్రోత్సహిస్తున్నారు. శ్రీ చంద్రభాను సత్పతిగారు ఉత్తరప్రదేశ్ నుండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ గా 2008లో పదవీవిరమణ చేసి, పూర్తి సమయాన్ని బాబా సేవలోనే గడుపుతున్నారు.
© 2017,www.logili.com All Rights Reserved.