గత 'రెండు దశాబ్దాల్లో' శ్రీ షిర్డీ సాయిబాబా పేరుప్రఖ్యాతలు విస్తరిస్తున్న తీరు దానికదే ఓ అద్భుతం. దీనికి నిదర్శనంగా ఇటీవలకాలంలో దేశవిదేశాల్లో అనేక సాయిబాబా మందిరాలు నిర్మాణం కావటంతోబాటు, అనేక భాషల్లో పత్రికలూ, ఆడియో వీడియో సి.డి.లూ, సినిమాలూ, సీరియల్స్ పెద్దసంఖ్యలో వెలువడుతుండటం మనం చూడవచ్చు. అంతేగాక 1999 సంవత్సరం నుండి బాబాతత్వానికి, లీలలకూ, బోధనలకూ సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తూ అనేక వెబ్ సైట్స్ కూడా దర్శనమిస్తున్నాయి.
2000వ సంవత్సరం నవంబర్ లో సాయిఉత్సవాన్ని ప్రారంభించడం కోసం శ్రీ చంద్రభాను సత్పతిగారు చికాగోకి వెళ్ళారు. ఈ సంఘటన యు.యస్., లాటిన్ అమెరికా, కెనడా, యు.కె. తో సహా ప్రపంచ మొత్తంమీదా వందలాది కుటుంబాలను ఒకచోటికి చేర్చింది. సాయి అనుగ్రహంవల్ల సాయిభక్తుల ప్రపంచసభ సుహృద్భావ వాతావరణంలో వేడుకగా జరిగింది. ఈ సదస్సు స్పూర్తితో, 2001 సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని సిడ్ని నగరంలోనూ, 2003 సంవత్సరంలో ఆఫ్రికాలోని జొహనాస్ బర్గ్, నైరోబి నగరాలలోనూ ఇలాంటి సదస్సులు జరిగాయి. ఈ సమావేశాల్లో సాయిబాబా గురించీ, ఆయన బోధనల గురించీ అనేకమంది సాయిభక్తులు ఆయన్ని ప్రశ్నలడిగారు. ఈ ప్రశ్నల పరంపర ఇంటర్నెట్ ద్వారా మరింత జోరుగా కొనసాగింది. వీటికి శ్రీ చంద్రభాను సత్పతిగారు సరళంగా, సుబోధకంగా తనదైన ప్రత్యేకరీతిలో సమాధానాలిచ్చారు ఈ సమాధానాలన్నింటినీ ఒక క్రమబద్ధంగా సంకలనం చేసి, పుస్తకరూపంలో ముద్రిస్తే బాబాభక్తులకూ, ఇతర ఆద్యాత్మిక సాధకులకూ బాబా బోధనల్ని అవగాహన చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడగలదని భావించడం జరిగింది. దీని పర్యవసానంగా ఈ పుస్తకం రూపొందింది. ఈ పుస్తకంలో ప్రశ్నల జవాబులతోబాటు, 2004-2009 మధ్యకాలంలో వివిధ పత్రికల ద్వారా, వెబ్ సైట్స్ ద్వారా, వివిధ పర్వదినాలను పురస్కరించుకొని శ్రీ చంద్రభాను సత్పతిగారు అందించిన సందేశాలను కూడా జతపరచడం జరిగింది.
శ్రీ చంద్రభాను సత్పతిగారు 1989లో మొట్టమొదటిసారి శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించడం జరిగింది. అప్పటినుండి బాబా ప్రతిపాదించిన విలువల్ని వ్యాప్తిచేయడంకోసం అవిశ్రాంతంగా అహర్నిశలూ వీరు కృషిచేస్తున్నారు. ఆయనచే ప్రేరణపొంది, ఆయన మార్గదర్శకత్వంలో దేశవిదేశాల్లో వందలాది బాబా దేవాలయాలు నిర్మితమయ్యాయి. ఆయన స్వయంగా బాబా గురించీ రచనలు చేస్తూ, ఆంగ్లం, హిందీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, పంజాబీ, తెలుగు, తమిళ, ఇంకా ఇతర భారతీయభాషల్లో బాబాకు సంబంధించిన పత్రికలు ప్రచురించడాన్ని ప్రోత్సహిస్తున్నారు.
శ్రీ చంద్రభాను సత్పతిగారు ఉత్తరప్రదేశ్ నుండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ గా 2008లో పదవీవిరమణ చేసి, పూర్తి సమయాన్ని బాబా సేవలోనే గడుపుతున్నారు.
గత 'రెండు దశాబ్దాల్లో' శ్రీ షిర్డీ సాయిబాబా పేరుప్రఖ్యాతలు విస్తరిస్తున్న తీరు దానికదే ఓ అద్భుతం. దీనికి నిదర్శనంగా ఇటీవలకాలంలో దేశవిదేశాల్లో అనేక సాయిబాబా మందిరాలు నిర్మాణం కావటంతోబాటు, అనేక భాషల్లో పత్రికలూ, ఆడియో వీడియో సి.డి.లూ, సినిమాలూ, సీరియల్స్ పెద్దసంఖ్యలో వెలువడుతుండటం మనం చూడవచ్చు. అంతేగాక 1999 సంవత్సరం నుండి బాబాతత్వానికి, లీలలకూ, బోధనలకూ సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తూ అనేక వెబ్ సైట్స్ కూడా దర్శనమిస్తున్నాయి. 2000వ సంవత్సరం నవంబర్ లో సాయిఉత్సవాన్ని ప్రారంభించడం కోసం శ్రీ చంద్రభాను సత్పతిగారు చికాగోకి వెళ్ళారు. ఈ సంఘటన యు.యస్., లాటిన్ అమెరికా, కెనడా, యు.కె. తో సహా ప్రపంచ మొత్తంమీదా వందలాది కుటుంబాలను ఒకచోటికి చేర్చింది. సాయి అనుగ్రహంవల్ల సాయిభక్తుల ప్రపంచసభ సుహృద్భావ వాతావరణంలో వేడుకగా జరిగింది. ఈ సదస్సు స్పూర్తితో, 2001 సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని సిడ్ని నగరంలోనూ, 2003 సంవత్సరంలో ఆఫ్రికాలోని జొహనాస్ బర్గ్, నైరోబి నగరాలలోనూ ఇలాంటి సదస్సులు జరిగాయి. ఈ సమావేశాల్లో సాయిబాబా గురించీ, ఆయన బోధనల గురించీ అనేకమంది సాయిభక్తులు ఆయన్ని ప్రశ్నలడిగారు. ఈ ప్రశ్నల పరంపర ఇంటర్నెట్ ద్వారా మరింత జోరుగా కొనసాగింది. వీటికి శ్రీ చంద్రభాను సత్పతిగారు సరళంగా, సుబోధకంగా తనదైన ప్రత్యేకరీతిలో సమాధానాలిచ్చారు ఈ సమాధానాలన్నింటినీ ఒక క్రమబద్ధంగా సంకలనం చేసి, పుస్తకరూపంలో ముద్రిస్తే బాబాభక్తులకూ, ఇతర ఆద్యాత్మిక సాధకులకూ బాబా బోధనల్ని అవగాహన చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడగలదని భావించడం జరిగింది. దీని పర్యవసానంగా ఈ పుస్తకం రూపొందింది. ఈ పుస్తకంలో ప్రశ్నల జవాబులతోబాటు, 2004-2009 మధ్యకాలంలో వివిధ పత్రికల ద్వారా, వెబ్ సైట్స్ ద్వారా, వివిధ పర్వదినాలను పురస్కరించుకొని శ్రీ చంద్రభాను సత్పతిగారు అందించిన సందేశాలను కూడా జతపరచడం జరిగింది. శ్రీ చంద్రభాను సత్పతిగారు 1989లో మొట్టమొదటిసారి శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించడం జరిగింది. అప్పటినుండి బాబా ప్రతిపాదించిన విలువల్ని వ్యాప్తిచేయడంకోసం అవిశ్రాంతంగా అహర్నిశలూ వీరు కృషిచేస్తున్నారు. ఆయనచే ప్రేరణపొంది, ఆయన మార్గదర్శకత్వంలో దేశవిదేశాల్లో వందలాది బాబా దేవాలయాలు నిర్మితమయ్యాయి. ఆయన స్వయంగా బాబా గురించీ రచనలు చేస్తూ, ఆంగ్లం, హిందీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, పంజాబీ, తెలుగు, తమిళ, ఇంకా ఇతర భారతీయభాషల్లో బాబాకు సంబంధించిన పత్రికలు ప్రచురించడాన్ని ప్రోత్సహిస్తున్నారు. శ్రీ చంద్రభాను సత్పతిగారు ఉత్తరప్రదేశ్ నుండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ గా 2008లో పదవీవిరమణ చేసి, పూర్తి సమయాన్ని బాబా సేవలోనే గడుపుతున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.