వేమన ఒక తాత్త్విక విజ్ఞాన సర్వస్వం, సకల సామాజికానుభవ స్వారస్యం. మన పద్యాలు తెలుగులో ఉండటం వల్ల ఆ తెలుగు మన మాతృభాష అయిననందుకు నేనెంతో గర్విస్తున్నాను. రాతిబాటల్లో జాతిరత్నాలు వెదజల్లిన అపురూపమైన మహాకవి వేమన, నీతుల నీరనిధులు పొంగించిన సామాజిక ప్రవక్త. సుదీర్ఘరోగానికి చేదు మందులిచ్చే వైద్యుడిగా, తీరాన్ని గానం చేసే నావికుడిగా వేమన మనకు సాక్షాత్కరిస్తాడు.
విద్యాలయాల్లో తెలుగుకు వెలుగు తగ్గుతున్నదని ఎందరో వాపోతున్న రోజుల్లో వేమన్న వెలుగులకోసం ఉపాద్యాయులూ, విద్యార్థులూ ప్రతివారం ఎదురుచూస్తున్నారని తెలిసి ఎంతో ఉత్సాహం పొందాను. దానికి కారాణం వేమన్న గొప్పతనమే. నాలుగు దశాబ్దాలుగా వేమన్నలాంటి కవి ప్రపంచసాహిత్యంలోనే అరుదని. నేటి వ్యాపార ప్రపంచంలో ఇట్లాంటి సాహిత్య, తాత్త్విక, సామాజిక శీర్షికను మూడేళ్ళపాటు నడపడం అంత సులభం కాదు. అందుకు సాక్షి ఫన్ డే సంపాదకుల ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ముఖ్యంగా, ప్రియదర్శిని రామ్ రెడ్డికి మరీ ముఖ్యంగా ఫన్ డే ఇన్ చార్జ్ పూడురి రాజిరెడ్డికి నా అభినందనలూ ఆశీస్సులు అందజేస్తున్నాను.
వేమన్న ఆశుకవి, ఆయన పద్యాలు ఆయన నోటి నుంచి ఆయన అభిమానులు లేదా శిష్యుల చెవుల్లోకి, వారి హృదయంల్లోంచి తాటాకుల్లోకి ప్రవహించాయి.
- ఎన్. గోపి
వేమన ఒక తాత్త్విక విజ్ఞాన సర్వస్వం, సకల సామాజికానుభవ స్వారస్యం. మన పద్యాలు తెలుగులో ఉండటం వల్ల ఆ తెలుగు మన మాతృభాష అయిననందుకు నేనెంతో గర్విస్తున్నాను. రాతిబాటల్లో జాతిరత్నాలు వెదజల్లిన అపురూపమైన మహాకవి వేమన, నీతుల నీరనిధులు పొంగించిన సామాజిక ప్రవక్త. సుదీర్ఘరోగానికి చేదు మందులిచ్చే వైద్యుడిగా, తీరాన్ని గానం చేసే నావికుడిగా వేమన మనకు సాక్షాత్కరిస్తాడు. విద్యాలయాల్లో తెలుగుకు వెలుగు తగ్గుతున్నదని ఎందరో వాపోతున్న రోజుల్లో వేమన్న వెలుగులకోసం ఉపాద్యాయులూ, విద్యార్థులూ ప్రతివారం ఎదురుచూస్తున్నారని తెలిసి ఎంతో ఉత్సాహం పొందాను. దానికి కారాణం వేమన్న గొప్పతనమే. నాలుగు దశాబ్దాలుగా వేమన్నలాంటి కవి ప్రపంచసాహిత్యంలోనే అరుదని. నేటి వ్యాపార ప్రపంచంలో ఇట్లాంటి సాహిత్య, తాత్త్విక, సామాజిక శీర్షికను మూడేళ్ళపాటు నడపడం అంత సులభం కాదు. అందుకు సాక్షి ఫన్ డే సంపాదకుల ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ముఖ్యంగా, ప్రియదర్శిని రామ్ రెడ్డికి మరీ ముఖ్యంగా ఫన్ డే ఇన్ చార్జ్ పూడురి రాజిరెడ్డికి నా అభినందనలూ ఆశీస్సులు అందజేస్తున్నాను. వేమన్న ఆశుకవి, ఆయన పద్యాలు ఆయన నోటి నుంచి ఆయన అభిమానులు లేదా శిష్యుల చెవుల్లోకి, వారి హృదయంల్లోంచి తాటాకుల్లోకి ప్రవహించాయి. - ఎన్. గోపి© 2017,www.logili.com All Rights Reserved.