రాధ చూపులు మదనుని తూపుల్లా చెదిరిపోతున్నాయి
ఒక చోట నిలువనీయని తళుకు మేను
మట్టిగొట్టుకపోయిన వస్త్రాలతో
మెరిసే దరహాసంతో మరీమరీ ప్రకాశిస్తున్నది.
సిగ్గుతో చీరె అంచును పెదవుల్తో కరచి పట్టుకుంది.
ఆమె ఇప్పుడు ప్రణయపథాల్లోకి పరిగెడుతూ
ఏకాంతంలో తన పూప చనులను
గమనించుకొని వెంటనే కప్పుకుంటున్నది
కాసేపట్లోనే అవి
అక్కడున్నాయనే సంగతినే మర్చిపోతున్నది
బాల్య యౌవనాల సంధి దశ కరిగిపోతున్నది
పూర్వమేదో అపూర్వమేదో స్మృతి దూరమౌతున్నది
ఓ జీవేశ్వరా
వయసు చిన్నెల సంగతి నీకు తెలియదా!
ఇది విద్యాపతి ఉవాచ.
- ఎన్. గోపి