నిబద్ధతా నిమగ్నతలతో పెన్ను, గన్ను పట్టి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజాపక్షం వహించిన కమ్యునిస్టు యోధుడు సుద్దాల హనుమంతు. ' ఓ పల్లెటూరి పిల్లగాడా ! పసులుగాసే మొనగాడా! ' వంటి గీతాలకర్త హనుమంతు. ఈ పాటేగాదు మరెన్నో పోరుపాటల పుట్టిల్లయిన ఇంట పుట్టాడు అశోక్ తేజ. పాట పాలతో పెరిగిన అశోక్తేజ తన తండ్రి హనుమంతు వారసత్వాన్ని స్వీకరించి ఆ పాటను మరింత పదునేక్కించడం సహజమైన విషయం. దీని వెనుక అతనికి నేపద్యంతో పాటు నిరంతర కృషి ఉంది. తన అనుభవాలు, ఇతరుల అనుభవాలను అనుభూతులుగా మార్చుకోగల శక్తి, దానికి తోడు అధ్యయనం, అవగాహన కలిగిఉండటం వీరి ప్రత్యేకత.
అభ్యుదయ కవుల తీవ్రత, భావకవుల లాలిత్యాలను స్వీకరించి తనదైన బాణీని సృష్టించుకున్నవాడు అశోక్ తేజ. ఆ బాణీలో నుండే తనదైన గొంతుకతో విప్పారుతూ స్వచ్చమైన,స్పష్టమైన పాటలతో పాటల తోటలో ఒక కొత్త పరిమళమైనాడు. ఆ సుగంధ వీచికలను మనం ఆస్వాదిస్తున్నాం.
తెలుగు చలనచిత్ర గేయ రచయితగా రాష్ట్ర,జాతీయ స్థాయిలోనూ పలు పురస్కారాలను, ప్రజా సత్కారాలను అశోక్ తేజ నేలమ్మా పాటలు మన జీవితానికి, సమాజానికి చెందినవి. ఆ పాటల్లో అతను వ్యక్తమవుతాడు. మనలోకి వెన్నెలసోనై ప్రవహిస్తాడు.
..... పెనుగొండ లక్ష్మినారాయణ
© 2017,www.logili.com All Rights Reserved.