విశాల విశ్వంలోని వస్తు పదార్ధమంతా రసాయనాలతో తయారయింది. ఆ రసాయనాలను ఒక పద్ధతిలో పనిచేయించే విధానాలు, భౌతికశాస్త్రంలోకి వస్తాయి. ప్రతిప్రాణికి, ప్రతి మనిషికి అనునిత్యం అనుభవంలోకి వచ్చే ఈ భౌతిక శాస్త్రం ఎంతో విచిత్రమైనది. మనం ఎలా నడుస్తాము. ఎలా కదులుతాము అని ఎప్పుడయినా ప్రశ్నించుకున్నామా? కానీ, భౌతిక శాస్త్రపరంగా ఈ నడక వెనుక గల పద్దతిని, విశేషాలను చెప్పినప్పుడు విన్నవారికి, చదివిన వారికీ ఆశ్చర్యం తప్పదు.
సూది ఎందుకు కుచ్చుకుంటుంది? గాలిలో చలి ఎందుకు ఎక్కువనిపిస్తుంది? మంట పైకే ఎందుకు మండుతుంది? విసనకర్ర మనకు ఎలా సహాయం చేస్తుంది? ఇవన్నీ మనం, ఎప్పటికప్పుడు 'ఎవరినయినా అడిగి తెలుసుకుంటే బాగుండును!' అనిపించే ప్రశ్నలు అయితే, వీటికి ఓపికగా, మనకు ఎలా సహాయం చేస్తుంది? ఇవ్వన్నీ మనం, ఎప్పటికప్పుడు 'ఎవరినయినా అడిగి తెలుసుకుంటే బాగుండును!? అనిపించే ప్రశ్నలు అయితే, వీటికి ఓపికగా, మనకు అర్ధం అయే పద్దతిలో జవాబు చెప్పేవారు ఎక్కడున్నారో తెలియక, ప్రశ్నను ప్రశ్నగానే వదిలేస్తాం. యాకోవ్ పెరెల్మాన్ ఇటువంటి సమాచారాన్నంతా సమీకరించి ఒక చక్కని పుస్తకం తయారు చేశారు. ఆ పుస్తకం రష్యన్ లో 18 ముద్రణలు పొందింది. దాని ఆధారంగా ఇదుగో ఈ తెలుగు పుస్తకాన్ని మీకు అందిస్తున్నాం.
పుస్తకం రాసి చాలా సంవత్సరాలయిన మాట నిజమే! కానీ ఇందులో చెప్పిన విషయాలేవీ, పనికి రానివి కావు. అవి ఈ నాటికే కాదు. ఏనాటికైనా సత్యాలే. కానీ, ఈ పుస్తకం చేదివేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది భౌతిక శాస్తంలోని అధునాతన సిద్ధాంతాలను కానీ, అన్ని సిద్ధాంతాలను కానీ తెలియజెప్పడానికి రాసింది కాదు. సరదాగానూ, ఉపయోగకరంగాను ఉండే కొన్ని విషయాలను ఎంచుకొని, వాటిని చాలా చక్కని పద్దతిలో మనకు అందజేశాడు రచయిత. ఈ పుస్తకం చదివే వారికీ తప్పకుండా వినోదంతో బాటు విజ్ఞానం కూడా కలుగుతుంది.
- కే.బి.గోపాలం
విశాల విశ్వంలోని వస్తు పదార్ధమంతా రసాయనాలతో తయారయింది. ఆ రసాయనాలను ఒక పద్ధతిలో పనిచేయించే విధానాలు, భౌతికశాస్త్రంలోకి వస్తాయి. ప్రతిప్రాణికి, ప్రతి మనిషికి అనునిత్యం అనుభవంలోకి వచ్చే ఈ భౌతిక శాస్త్రం ఎంతో విచిత్రమైనది. మనం ఎలా నడుస్తాము. ఎలా కదులుతాము అని ఎప్పుడయినా ప్రశ్నించుకున్నామా? కానీ, భౌతిక శాస్త్రపరంగా ఈ నడక వెనుక గల పద్దతిని, విశేషాలను చెప్పినప్పుడు విన్నవారికి, చదివిన వారికీ ఆశ్చర్యం తప్పదు. సూది ఎందుకు కుచ్చుకుంటుంది? గాలిలో చలి ఎందుకు ఎక్కువనిపిస్తుంది? మంట పైకే ఎందుకు మండుతుంది? విసనకర్ర మనకు ఎలా సహాయం చేస్తుంది? ఇవన్నీ మనం, ఎప్పటికప్పుడు 'ఎవరినయినా అడిగి తెలుసుకుంటే బాగుండును!' అనిపించే ప్రశ్నలు అయితే, వీటికి ఓపికగా, మనకు ఎలా సహాయం చేస్తుంది? ఇవ్వన్నీ మనం, ఎప్పటికప్పుడు 'ఎవరినయినా అడిగి తెలుసుకుంటే బాగుండును!? అనిపించే ప్రశ్నలు అయితే, వీటికి ఓపికగా, మనకు అర్ధం అయే పద్దతిలో జవాబు చెప్పేవారు ఎక్కడున్నారో తెలియక, ప్రశ్నను ప్రశ్నగానే వదిలేస్తాం. యాకోవ్ పెరెల్మాన్ ఇటువంటి సమాచారాన్నంతా సమీకరించి ఒక చక్కని పుస్తకం తయారు చేశారు. ఆ పుస్తకం రష్యన్ లో 18 ముద్రణలు పొందింది. దాని ఆధారంగా ఇదుగో ఈ తెలుగు పుస్తకాన్ని మీకు అందిస్తున్నాం. పుస్తకం రాసి చాలా సంవత్సరాలయిన మాట నిజమే! కానీ ఇందులో చెప్పిన విషయాలేవీ, పనికి రానివి కావు. అవి ఈ నాటికే కాదు. ఏనాటికైనా సత్యాలే. కానీ, ఈ పుస్తకం చేదివేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది భౌతిక శాస్తంలోని అధునాతన సిద్ధాంతాలను కానీ, అన్ని సిద్ధాంతాలను కానీ తెలియజెప్పడానికి రాసింది కాదు. సరదాగానూ, ఉపయోగకరంగాను ఉండే కొన్ని విషయాలను ఎంచుకొని, వాటిని చాలా చక్కని పద్దతిలో మనకు అందజేశాడు రచయిత. ఈ పుస్తకం చదివే వారికీ తప్పకుండా వినోదంతో బాటు విజ్ఞానం కూడా కలుగుతుంది. - కే.బి.గోపాలం© 2017,www.logili.com All Rights Reserved.