ఒక విజేతతో చేతులు కలపడానికి ఎవరు ఉవ్విళ్ళూరరని!
భారతీయ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఒక దార్శనిక స్పష్టత లేకపోవడం, ఒక దిశా నిర్దేశం లేకపోవడం. ఆ సందర్భంగానే నేను నా జీవితాన్ని తీర్చిదిద్దిన మహనీయుల గురించీ, పరిస్థితుల గురించీ రాయాలనుకున్నాను. అంతేతప్ప ఈ సందర్భంగా కొందరికి నివాళి ఇవ్వడానికి గానీ లేదా నా జీవితాన్ని ఎత్తిచూపుకోవడానికి గానీ కాదు. నేను చెప్పాలనుకున్నదిదే. ఎవరు ఎంత చిన్నవాళ్ళు గానీ, ఎంత తక్కువ అవకాశాలకు నోచుకోనీ, ఎంత బీదవాళ్ళు గానీ వాళ్ళు నిరాశ చెందనవసరం లేదనే.
తమనితాము మలచుకోవడానికి నా జీవితం ఎవరికన్నా ఆదర్శప్రాయమనేటంత ఆలోచన నాకు లేదు. కానీ ఎక్కడన్నా ఒక బీద విద్యార్థి ఏ మారుమూలనో ఒక నిర్భాగ్య సామాజిక స్థితిలో ఉంటున్నవాడెవడైనా ఈ కథ చదివి ఎంతో కొంత ఓదార్పు పొందుతాడని నా ఆశ. అటువంటి పిల్లలు తమ మిథ్యాత్మక ద్యాసం నుంచీ, బంధాల నుంచీ విడివడటానికి నా జీవితయాత్రా కథనం ఏ మేరకో సహకరిస్తుందని నమ్ముతున్నాను.
- ఎ పి జె అబ్దుల్ కలాం
ఒక విజేతతో చేతులు కలపడానికి ఎవరు ఉవ్విళ్ళూరరని! భారతీయ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఒక దార్శనిక స్పష్టత లేకపోవడం, ఒక దిశా నిర్దేశం లేకపోవడం. ఆ సందర్భంగానే నేను నా జీవితాన్ని తీర్చిదిద్దిన మహనీయుల గురించీ, పరిస్థితుల గురించీ రాయాలనుకున్నాను. అంతేతప్ప ఈ సందర్భంగా కొందరికి నివాళి ఇవ్వడానికి గానీ లేదా నా జీవితాన్ని ఎత్తిచూపుకోవడానికి గానీ కాదు. నేను చెప్పాలనుకున్నదిదే. ఎవరు ఎంత చిన్నవాళ్ళు గానీ, ఎంత తక్కువ అవకాశాలకు నోచుకోనీ, ఎంత బీదవాళ్ళు గానీ వాళ్ళు నిరాశ చెందనవసరం లేదనే. తమనితాము మలచుకోవడానికి నా జీవితం ఎవరికన్నా ఆదర్శప్రాయమనేటంత ఆలోచన నాకు లేదు. కానీ ఎక్కడన్నా ఒక బీద విద్యార్థి ఏ మారుమూలనో ఒక నిర్భాగ్య సామాజిక స్థితిలో ఉంటున్నవాడెవడైనా ఈ కథ చదివి ఎంతో కొంత ఓదార్పు పొందుతాడని నా ఆశ. అటువంటి పిల్లలు తమ మిథ్యాత్మక ద్యాసం నుంచీ, బంధాల నుంచీ విడివడటానికి నా జీవితయాత్రా కథనం ఏ మేరకో సహకరిస్తుందని నమ్ముతున్నాను. - ఎ పి జె అబ్దుల్ కలాం© 2017,www.logili.com All Rights Reserved.