ఇక్కడ... ఈ నేల మీద అవతరించిన యోగులలో షిరిడీ సాయిబాబా ఒకరు! ఆయన ఓ అద్భుత వ్యక్తీ... మహాశక్తి! ఆ శక్తిని కొలిచేవారికీ, నమ్మినవారికీ ఎందులోనూ లోటుండదు. తనని ఎలా నమ్మితే తానలా కనిపిస్తానంటారు బాబా! ప్రేమించిన వారిని ప్రేమిస్తానంటారు... భక్తుని హృదయంలో కొలువై ఉంటారు... భక్తుడూ, తానూ వేరు కాదంటూ ఇద్దరం ఒకటేనంటారు! ఈ విషయాలే 'కలకండ పలుకులు' గా ఇప్పుడీ పుస్తకం మీ ముందు ఉంది. ఈ పలుకుల్లోని అర్ధాన్ని, పరమార్ధాన్ని తెలుసుకోవాలంటే ఇది చదివితీరాలి. చక్కని భాష, చల్లని మాట, గుండె జల్లునిపించే కధాకధనం ఈ పలుకుల ప్రత్యేకత! ప్రతీ పదంలోనూ నిజాయితీ ఉంది. ప్రతీ వాక్యంలోనూ పవిత్రత ఉంది. నమ్మింది నమ్మినట్టుగా రాశారు ఓలేటి శ్రీనివాసభాను.
- ఎ.ఎన్. జగన్నాధశర్మ(ఎడిటర్ : నవ్య విక్లి)
'నవ్య' వార పత్రికలో 'కలకండ పలుకులు' ధారావాహికంగా వస్తున్న రోజుల్లో నేనొకసారి బంధువుల ఊరు వెడితే అక్కడ మాటల సందర్భంలో ఆ ఇంటావిడ - "శ్రీనివాసభానుగారని ఎవరో సాయి గురించి ఎంత బాగా రాసున్నారండి! ప్రతీ వారం తప్పకుండా చదువుతున్నాను" అన్నారు. వెంటనే నా మొబైల్ తీసి ఆమె చేత భానుగారితో మాట్లాడించాను. ఆమె ఆనందం పట్టలేకపోయింది. నిజనికామె సాయి భక్తురాలు కాదు. 'కలకండ పలుకులు' చదివి సాయి భక్తురాలైపోయింది! అది ఈ కధల మహాత్మ్యం! మహిమలకు తావులేని ఈ కలియుగంలో నమ్మలేని అద్భుతాలనెన్నింటినో భక్తుల అనుభవంలోకీ తెచ్చిన మహాయోగి, కారుణ్యమూర్తి, సమర్ధ సద్గురువు శ్రీ షిరిడీ సాయి! ఆయన మహిమల్ని, మానవుల మధ్య ఆయన సంచరించినప్పటి కొన్ని సంఘటనల్ని మనం కళ్ళతో చూస్తున్న భావన కలిగేలా శ్రీనివాసభానుగారు తనదైన శైలిలో కధలుగా రాశారు. పలికింది భాను... పలికించినవాడు బాబా... చదివి తరించాల్సింది మనమూ, మన పరివారమూనూ!
- సరసి(కార్టూనిస్టు)
ఓలేటి శ్రీనివాసభాను (రచయిత గురించి) :
ఓలేటి శ్రీనివాసభాను 1953 మే 6న పార్వతీపురం, బొబ్బిలి, విశాఖపట్నంలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్.కామ్ చేశారు. చిన్ననాటి నుండి వివిధ సాహితీప్రక్రియల పట్ల మమకారం పెంచుకున్న వీరు పదిహేనో ఏటనే కధలు రాయటం ప్రారంభించారు. వివధ వార, మాస పత్రికల్లో వీరి కధలూ, కవితలూ, వ్యాసాలూ వెలువడ్డాయి. ఆంధ్రజ్యోతి ఆదివారం, నవ్య వీక్లీ, సితార సంచికలకు ఫ్రిలాన్సర్ గా అనేక శిర్శికలూ, వ్యాసాలూ ముఖచిత్ర కధనలూ, ధారావాహికలూ వీరు అందించారు. ఈనాడు ఆదివారంలో ప్రాచుర్యం పొందిన 'ఇదికధకాదు' శీర్షికను, 'తేజస్వి' కలం పేరుతో దశాబ్దకాలం పైగా నిర్వహించారు. వివిధ చానెల్స్ కోసం రచనలు చేశారు. నృత్య రూపకాల్ని రాశారు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో వీరి రూపకాలూ, పాటలు ప్రసారమయ్యాయి. ఇంగ్లిష్, కన్నడ, హిందీ భాషల ధారావాహికలకు డబ్బింగ్ రచన చేశారు. నవ్య విక్లిలో పాఠకాదరణ పొందిన వీరి 'పొగబండి కధలు' పుస్తకంగా వెలువడి 'తురగా కృష్ణమోహనరావు పురస్కారం - 2010' అందుకొంది.
- ఓలేటి శ్రీనివాసభాను
ఇక్కడ... ఈ నేల మీద అవతరించిన యోగులలో షిరిడీ సాయిబాబా ఒకరు! ఆయన ఓ అద్భుత వ్యక్తీ... మహాశక్తి! ఆ శక్తిని కొలిచేవారికీ, నమ్మినవారికీ ఎందులోనూ లోటుండదు. తనని ఎలా నమ్మితే తానలా కనిపిస్తానంటారు బాబా! ప్రేమించిన వారిని ప్రేమిస్తానంటారు... భక్తుని హృదయంలో కొలువై ఉంటారు... భక్తుడూ, తానూ వేరు కాదంటూ ఇద్దరం ఒకటేనంటారు! ఈ విషయాలే 'కలకండ పలుకులు' గా ఇప్పుడీ పుస్తకం మీ ముందు ఉంది. ఈ పలుకుల్లోని అర్ధాన్ని, పరమార్ధాన్ని తెలుసుకోవాలంటే ఇది చదివితీరాలి. చక్కని భాష, చల్లని మాట, గుండె జల్లునిపించే కధాకధనం ఈ పలుకుల ప్రత్యేకత! ప్రతీ పదంలోనూ నిజాయితీ ఉంది. ప్రతీ వాక్యంలోనూ పవిత్రత ఉంది. నమ్మింది నమ్మినట్టుగా రాశారు ఓలేటి శ్రీనివాసభాను. - ఎ.ఎన్. జగన్నాధశర్మ(ఎడిటర్ : నవ్య విక్లి) 'నవ్య' వార పత్రికలో 'కలకండ పలుకులు' ధారావాహికంగా వస్తున్న రోజుల్లో నేనొకసారి బంధువుల ఊరు వెడితే అక్కడ మాటల సందర్భంలో ఆ ఇంటావిడ - "శ్రీనివాసభానుగారని ఎవరో సాయి గురించి ఎంత బాగా రాసున్నారండి! ప్రతీ వారం తప్పకుండా చదువుతున్నాను" అన్నారు. వెంటనే నా మొబైల్ తీసి ఆమె చేత భానుగారితో మాట్లాడించాను. ఆమె ఆనందం పట్టలేకపోయింది. నిజనికామె సాయి భక్తురాలు కాదు. 'కలకండ పలుకులు' చదివి సాయి భక్తురాలైపోయింది! అది ఈ కధల మహాత్మ్యం! మహిమలకు తావులేని ఈ కలియుగంలో నమ్మలేని అద్భుతాలనెన్నింటినో భక్తుల అనుభవంలోకీ తెచ్చిన మహాయోగి, కారుణ్యమూర్తి, సమర్ధ సద్గురువు శ్రీ షిరిడీ సాయి! ఆయన మహిమల్ని, మానవుల మధ్య ఆయన సంచరించినప్పటి కొన్ని సంఘటనల్ని మనం కళ్ళతో చూస్తున్న భావన కలిగేలా శ్రీనివాసభానుగారు తనదైన శైలిలో కధలుగా రాశారు. పలికింది భాను... పలికించినవాడు బాబా... చదివి తరించాల్సింది మనమూ, మన పరివారమూనూ! - సరసి(కార్టూనిస్టు) ఓలేటి శ్రీనివాసభాను (రచయిత గురించి) : ఓలేటి శ్రీనివాసభాను 1953 మే 6న పార్వతీపురం, బొబ్బిలి, విశాఖపట్నంలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్.కామ్ చేశారు. చిన్ననాటి నుండి వివిధ సాహితీప్రక్రియల పట్ల మమకారం పెంచుకున్న వీరు పదిహేనో ఏటనే కధలు రాయటం ప్రారంభించారు. వివధ వార, మాస పత్రికల్లో వీరి కధలూ, కవితలూ, వ్యాసాలూ వెలువడ్డాయి. ఆంధ్రజ్యోతి ఆదివారం, నవ్య వీక్లీ, సితార సంచికలకు ఫ్రిలాన్సర్ గా అనేక శిర్శికలూ, వ్యాసాలూ ముఖచిత్ర కధనలూ, ధారావాహికలూ వీరు అందించారు. ఈనాడు ఆదివారంలో ప్రాచుర్యం పొందిన 'ఇదికధకాదు' శీర్షికను, 'తేజస్వి' కలం పేరుతో దశాబ్దకాలం పైగా నిర్వహించారు. వివిధ చానెల్స్ కోసం రచనలు చేశారు. నృత్య రూపకాల్ని రాశారు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో వీరి రూపకాలూ, పాటలు ప్రసారమయ్యాయి. ఇంగ్లిష్, కన్నడ, హిందీ భాషల ధారావాహికలకు డబ్బింగ్ రచన చేశారు. నవ్య విక్లిలో పాఠకాదరణ పొందిన వీరి 'పొగబండి కధలు' పుస్తకంగా వెలువడి 'తురగా కృష్ణమోహనరావు పురస్కారం - 2010' అందుకొంది. - ఓలేటి శ్రీనివాసభాను
© 2017,www.logili.com All Rights Reserved.