"పి.బి. శ్రీనివాస్ ప్రతివాద భయంకరులు. ఇంటి పేరు నిలబెట్టిన మేధావి. సంగీతం ఆయన తూణిరంలో ఒక పార్శ్వం మాత్రమే. ఎన్నో భాషలలో అఖండమయిన పాండిత్యాన్ని ఆపోశన పట్టిన రచయిత. అందుకు ఆయన "ప్రణవం" ఒక్క ఉదాహరణ చాలు. చిత్రకవితలకు, సాహిత్యంలో సరికొత్త సాముగారిడీలకు ఆయన పెట్టింది పేరు. కొత్త రాగాలనూ, కొత్త వృత్తాలనూ విచిత్రగతులలో రూపొందించిన ఘనుడు. నా షష్టిపూర్తికి శ్రీనివాస మారుతీ వృత్తాన్ని దాదాపు 40 పంక్తుల కవితను రాశారు. ఎప్పటికప్పుడు కొత్తదనం, కొత్త మాట, కొత్త గమకం, కొత్త ఆలోచన ఆయన్ని ఉర్రూతలూగిస్తుంది. పసివాడిలాగా పరవశింపజేస్తుంది. ఆయన మస్తిష్కాన్ని రెచ్చగొడుతుంది. ఒక్కోసారి ఆయన ఆలోచనకు భాష పరిధులు సరిపోవు. కొత్త మాటల్ని, కొత్త ప్రయోగాల్ని సృష్టించుకుంటారు. శ్రీనివాస్ గారి మరొక గొప్ప అదృష్టం - ఏ రంగంలో, ఏ వ్యక్తీ తన పరిణితిని ప్రదర్శించినా ఆయన పసివాడిలాగా తన్మయులవుతారు. నాకు మెహదీ హసన్, గులాం అలీ గజల్స్ ను పరిచయం చేసిన రసికుడు. ఆయన రాసిన ఎన్నో గజల్స్ కి నేను మొదటి శ్రోతని. ఆర్ద్రత ఆయన జీవలక్షణం. ఎప్పటికప్పుడు తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, ప్రతీ కొత్తదనంలోనూ కొత్త స్పూర్తిని సంతరించుకుంటూ జీవితాన్ని నిత్యనూతనం చేసుకున్న చరితార్ధుడు, మిత్రులు శ్రీనివాస్. శరీరానికి వృద్ధాప్యం వచ్చినా ఆలోచనల్లో యౌవనానికి ఎప్పటికప్పుడు నీరెత్తిన కృషీవలుడు. అనునిత్యం చుట్టూ వున్న ప్రపంచాన్ని తన కళలో ఆవిష్కరించుకుంటూ, జీవితంలో కొత్త ప్రపంచానికి స్వాగతం పలికే నిత్యనూతనుడు ఏనాటికీ అలసిపోడు. అందుకు అరుదైన ఉదాహరణ ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు.
- గొల్లపూడి మారుతిరావు
బహుముఖ ప్రజ్ఞాశాలి, మధురగాయకుడు పి.బి. శ్రీనివాస్ కొన్ని దశాబ్దాల క్రితం 'జ్యోతి' మానసపత్రికలో ధారావాహికంగా వెలువరించిన సంగీతదర్శకుల వ్యాసాలను 'స్వరలహరి'గా గ్రంధ రూపంలో మీ ముందుకు తెస్తున్న శుభతరుణం ఇది!
పి.బి. శ్రీనివాస్ సినీరంగంలో నేపధ్యగాయకునిగా ప్రవేశించకమునుపే పత్రికారంగాన రచయితగా తన కౌశల్యాన్ని ప్రదర్శించిన మేధావి! 'ప్రియభాషి', 'విశ్వసాక్షి', 'త్రిలోకసంచారి' వంటి వినూత్నమైన కలంపేర్లతో ఆయన పలుపత్రికల్లో రచనలు వెలువరించారు. ఆ కారణంవల్లనే కావచ్చు. శ్రీనివాస్ రచనలన్నింటా రచనాధార గోదారి ప్రవాహంలో సాగిపోతుంది. ఈ సుగుణాన్ని మనం 'స్వరలహరి' వ్యాసాల్లోకూడా చూడగలం! ప్రవాహతుల్యమైన రచనాధార మాత్రమేగాక, ఆయన రచనలో చదివించేగుణం, మాతృభాష మీద సాధికారికత, చమత్కృతి వంటి మరెన్నో ప్రత్యెకగుణాలకు ఈ వ్యాసాలు చెక్కుచెదరని సాక్ష్యాలు! తెలుగుభాష మీద పి.బి.ఎస్.కి గల మమకారం అపారం! తన ఇంగ్లీషుకవిత్వవైదుష్యంతో అమెరికాఅధ్యక్షుని ప్రశంసలను పొందగలిగినంతటి ఇంగ్లీషు భాషా నైపుణ్యం ఆయన సొంతం! అయినా, తన తెలుగురచనల్లో అగత్యమైతే తప్ప ఇంగ్లీషుపదాల్ని ఉపయోగించని సత్సంప్రదాయవాది ఆయన. అంతేకాదు, హాస్యరసస్పూర్తితో సరదాకోసం శ్రీనివాస్ కొన్ని తమాషా ప్రయోగాలను చేస్తుండేవారు. ఇలాంటి ప్రయోగాలు, వినూత్నపదాలు తిరుపతిలడ్డూలోని జీడిపప్పు, కలకండపలుకుల వలె పాఠకుల్ని బాగా ఆకట్టుకుంటాయి.
"స్వరలహరి" వ్యాసాలు సంగీతాభీమానులనే కాకుండా, తెలుగుభాషను ప్రేమించేవారికి కూడా ఒక విందుభోజనంలా సంతోషపరుస్తాయని నా ప్రగాఢవిశ్వాసం!
- డా. కంపల్లె రవిచంద్రన్
"పి.బి. శ్రీనివాస్ ప్రతివాద భయంకరులు. ఇంటి పేరు నిలబెట్టిన మేధావి. సంగీతం ఆయన తూణిరంలో ఒక పార్శ్వం మాత్రమే. ఎన్నో భాషలలో అఖండమయిన పాండిత్యాన్ని ఆపోశన పట్టిన రచయిత. అందుకు ఆయన "ప్రణవం" ఒక్క ఉదాహరణ చాలు. చిత్రకవితలకు, సాహిత్యంలో సరికొత్త సాముగారిడీలకు ఆయన పెట్టింది పేరు. కొత్త రాగాలనూ, కొత్త వృత్తాలనూ విచిత్రగతులలో రూపొందించిన ఘనుడు. నా షష్టిపూర్తికి శ్రీనివాస మారుతీ వృత్తాన్ని దాదాపు 40 పంక్తుల కవితను రాశారు. ఎప్పటికప్పుడు కొత్తదనం, కొత్త మాట, కొత్త గమకం, కొత్త ఆలోచన ఆయన్ని ఉర్రూతలూగిస్తుంది. పసివాడిలాగా పరవశింపజేస్తుంది. ఆయన మస్తిష్కాన్ని రెచ్చగొడుతుంది. ఒక్కోసారి ఆయన ఆలోచనకు భాష పరిధులు సరిపోవు. కొత్త మాటల్ని, కొత్త ప్రయోగాల్ని సృష్టించుకుంటారు. శ్రీనివాస్ గారి మరొక గొప్ప అదృష్టం - ఏ రంగంలో, ఏ వ్యక్తీ తన పరిణితిని ప్రదర్శించినా ఆయన పసివాడిలాగా తన్మయులవుతారు. నాకు మెహదీ హసన్, గులాం అలీ గజల్స్ ను పరిచయం చేసిన రసికుడు. ఆయన రాసిన ఎన్నో గజల్స్ కి నేను మొదటి శ్రోతని. ఆర్ద్రత ఆయన జీవలక్షణం. ఎప్పటికప్పుడు తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, ప్రతీ కొత్తదనంలోనూ కొత్త స్పూర్తిని సంతరించుకుంటూ జీవితాన్ని నిత్యనూతనం చేసుకున్న చరితార్ధుడు, మిత్రులు శ్రీనివాస్. శరీరానికి వృద్ధాప్యం వచ్చినా ఆలోచనల్లో యౌవనానికి ఎప్పటికప్పుడు నీరెత్తిన కృషీవలుడు. అనునిత్యం చుట్టూ వున్న ప్రపంచాన్ని తన కళలో ఆవిష్కరించుకుంటూ, జీవితంలో కొత్త ప్రపంచానికి స్వాగతం పలికే నిత్యనూతనుడు ఏనాటికీ అలసిపోడు. అందుకు అరుదైన ఉదాహరణ ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు. - గొల్లపూడి మారుతిరావు బహుముఖ ప్రజ్ఞాశాలి, మధురగాయకుడు పి.బి. శ్రీనివాస్ కొన్ని దశాబ్దాల క్రితం 'జ్యోతి' మానసపత్రికలో ధారావాహికంగా వెలువరించిన సంగీతదర్శకుల వ్యాసాలను 'స్వరలహరి'గా గ్రంధ రూపంలో మీ ముందుకు తెస్తున్న శుభతరుణం ఇది! పి.బి. శ్రీనివాస్ సినీరంగంలో నేపధ్యగాయకునిగా ప్రవేశించకమునుపే పత్రికారంగాన రచయితగా తన కౌశల్యాన్ని ప్రదర్శించిన మేధావి! 'ప్రియభాషి', 'విశ్వసాక్షి', 'త్రిలోకసంచారి' వంటి వినూత్నమైన కలంపేర్లతో ఆయన పలుపత్రికల్లో రచనలు వెలువరించారు. ఆ కారణంవల్లనే కావచ్చు. శ్రీనివాస్ రచనలన్నింటా రచనాధార గోదారి ప్రవాహంలో సాగిపోతుంది. ఈ సుగుణాన్ని మనం 'స్వరలహరి' వ్యాసాల్లోకూడా చూడగలం! ప్రవాహతుల్యమైన రచనాధార మాత్రమేగాక, ఆయన రచనలో చదివించేగుణం, మాతృభాష మీద సాధికారికత, చమత్కృతి వంటి మరెన్నో ప్రత్యెకగుణాలకు ఈ వ్యాసాలు చెక్కుచెదరని సాక్ష్యాలు! తెలుగుభాష మీద పి.బి.ఎస్.కి గల మమకారం అపారం! తన ఇంగ్లీషుకవిత్వవైదుష్యంతో అమెరికాఅధ్యక్షుని ప్రశంసలను పొందగలిగినంతటి ఇంగ్లీషు భాషా నైపుణ్యం ఆయన సొంతం! అయినా, తన తెలుగురచనల్లో అగత్యమైతే తప్ప ఇంగ్లీషుపదాల్ని ఉపయోగించని సత్సంప్రదాయవాది ఆయన. అంతేకాదు, హాస్యరసస్పూర్తితో సరదాకోసం శ్రీనివాస్ కొన్ని తమాషా ప్రయోగాలను చేస్తుండేవారు. ఇలాంటి ప్రయోగాలు, వినూత్నపదాలు తిరుపతిలడ్డూలోని జీడిపప్పు, కలకండపలుకుల వలె పాఠకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. "స్వరలహరి" వ్యాసాలు సంగీతాభీమానులనే కాకుండా, తెలుగుభాషను ప్రేమించేవారికి కూడా ఒక విందుభోజనంలా సంతోషపరుస్తాయని నా ప్రగాఢవిశ్వాసం! - డా. కంపల్లె రవిచంద్రన్© 2017,www.logili.com All Rights Reserved.