స్వాతంత్ర్యానికి ముందూ, ఆ తరువాతా ఈ దేశంలో ఒక దళితుని మనుగడ ఎట్లా వుందో చాలా శక్తివంతంగా పదునుగా చెప్పిన పుస్తకం ఇది.
- ది హిందూ (మార్చ్ 3, 2012)
ఈ కథ ఒక విజయ పరంపర. అయితే ఈ ప్రయాణం ఇంకా కొనసాగవలసి వున్నది. "మా నాయన బాలయ్య" బహుశా సొరంగంలో ప్రయాణం చేసిన తర్వాత ప్రత్యక్షమైన వెలుగు అనుకోవచ్చు.
- డెక్కన్ హెరాల్డ్ (ఫిబ్రవరి 19, 2012)
అలెక్స్ హేలీ 'ఏడుతరాలు' రాసి ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపాడు. ఆ పుస్తకం నల్లవాళ్ల బైబిల్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు వై.బి.సత్యనారాయణ మూడు తరాల ఆత్మకథ రచించి చరిత్ర సృష్టించాడు. సాహిత్యంలో మరాఠీ ఆత్మకథ విజయకేతనం ఎగురవేస్తే ఇప్పుడు తెలుగులో తొలిజెండా ఎగురవేసిన ఈ పుస్తకం సాహిత్య చరిత్రలో ఓ మైలురాయి. మాదిగల చరిత్రను అక్షరీకరిస్తే అది రామాయణ, మహాభారతాలను మించిపోతుంది. ఇది ఒక బాలయ్య ఆత్మకథ మాత్రమే కాదు, లక్షలాది బాలయ్యల భార చరిత. రచయిత తన అపూర్వ మేధతో, పరిశీలనతో, రచనా శిల్పంతో ఈ పుస్తకాన్ని అమూల్యం చేశాడు. ఈ పుస్తకం చిదివితే మాట తప్పని మానధనులైన మాదిగల మహోన్నత మనస్తత్వం, స్వేచ్ఛ, వారి అమాయకత్వం పరోపకారప్రియత్వం, బహుభాషా పరిజ్ఞానం, సౌందర్యాత్మక దృష్టి మరియు చెప్పుల నిర్మాణంలో గొప్ప కళాసృష్టి పాఠకుల దృష్టిని ప్రగాఢంగా ఆకర్షిస్తాయి.
- ఎండ్లూరి సుధాకర్
దళిత జీవితచరిత్రలలో ఓ మైలురాయి వంటిదీ పుస్తకం. ఈ జీవితకథలో అప్పటి రైలు మార్గాల నిర్మాణం వలెనే బాలయ్య కూడా అంతే వేగంగా మూడు తరాలను ఆధునికతలోకి ప్రయాణం చేయించాడు. ఆధునికతని పోరాట సాధనంగా చేసుకున్నాడు.
- గోపాల్ గురు
తెలంగాణా గ్రామీణ జీవితాల్లో పొరలు పొరలుగా ఎదురయ్యే పేదరికం, సామాజిక వెలి, అంటరానితనం, శ్రమ దోపిడీ, కష్టాల కడగండ్ల వంటి వాటన్నింటిపై ఓ దళిత కుటుంబం సాగించిన యుద్ధాన్ని కళ్లకు కట్టే రచన ఇది. వాళ్లీ క్రమంలో చేసిన ప్రయత్నాలనూ, అనుభవించిన వేదననూ నిజాయితీగా ఆవిష్కరిస్తుందిది. విద్యకోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛకోసం జరిపే పోరాటంలో విజయం ఎంత ప్రధానమో బలంగా నొక్కి చెప్పే ఈ రచన - మనల్ని కల్లోల పరుస్తుంది. అదే సమయంలో ఎంతో స్ఫూర్తినీ రగిలిస్తుంది.
- శాంతా సిన్హా
ఒక తరం ప్రయాణం
యెలుకటి రామదాసు అనే వ్యక్తి ప్రయాణాన్ని చిత్రిస్తుంది 'మా నాయన బాలయ్య' పుస్తకం. ఇదివరకు మనం చదివిన 'ఏడు తరాలు' 'టామ్ మామ ఇల్లు' 'ఊరువాడ బతుకు' వంటి రచనలను గుర్తు చేస్తుంది ఈ పుస్తకం. తెలంగాణ ప్రాంతంలోని ఒక మాదిగ కుటుంబం అవిశ్రాంతంగా కృషి చెయ్యడం ద్వారా సమాజంలో ఒక్కో మెట్టునూ ఎక్కుతూ వచ్చిన వైనాన్ని అద్భుతంగా చిత్రించిందీ రచన. గ్రామంలోనే ఉంటే వెట్టిచాకిరీ తప్పదని గ్రహించిన తండ్రి కొడుకును వేరే ఊరికి పంపడంతో మొదలవుతుంది రామదాసు ప్రయాణం.
మసీదులో ముల్లా ఆలీసాహెబ్ చొరవతో నాలుగు అక్షరాలు దిద్దుకున్న రామదాసు రైల్వేలో చేరి సికింద్రాబాద్ చుట్టుపక్కల ఊళ్లలో బాలయ్యగా ఎదగడం వెనక ఎగుడుదిగుళ్లన్నిటినీ కళ్లకు కట్టినట్టు వివరిస్తుందీ పుస్తకం. ఆయనకు చదువు విలువ తెలియడం వల్లనే ఆయన సంతానం బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో నిలదొక్కుకున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే బాలయ్య తన బిడ్డలను చదివించడం వల్ల ఇప్పుడీ రచనలోని అక్షరాల్లో జీవించాడు, ఇన్నేళ్ల తర్వాత కూడా ఎంతోమందికి తన జీవితాన్ని ప్రేరణ చెయ్యగలిగాడు. 'మా కుటుంబమే కాదు, ఒక మంచి భవిష్యత్తు నిర్మించడం కోసం దళితులూ దళితేతరులూ కూడా మా గతాన్ని తెలుసుకోవాలి అనేది నా అభిమతం' అంటారు రచయిత వై.బి. సత్యనారాయణ.
ఆయన ఉద్దేశాలను పూర్తిగా నెరవేరుస్తుందీ రచన. ఆయన ఇంగ్లీషులో రాసినదాన్ని ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి తెలుగులోకి అనువదించారు. తెలంగాణ నుడికారంతో చక్కగా ఉన్న శైలి వలన ఇది అనువాదమనిపించదు.
-ఆదివారం ఆంధ్రజ్యోతి
స్వాతంత్ర్యానికి ముందూ, ఆ తరువాతా ఈ దేశంలో ఒక దళితుని మనుగడ ఎట్లా వుందో చాలా శక్తివంతంగా పదునుగా చెప్పిన పుస్తకం ఇది. - ది హిందూ (మార్చ్ 3, 2012) ఈ కథ ఒక విజయ పరంపర. అయితే ఈ ప్రయాణం ఇంకా కొనసాగవలసి వున్నది. "మా నాయన బాలయ్య" బహుశా సొరంగంలో ప్రయాణం చేసిన తర్వాత ప్రత్యక్షమైన వెలుగు అనుకోవచ్చు. - డెక్కన్ హెరాల్డ్ (ఫిబ్రవరి 19, 2012) అలెక్స్ హేలీ 'ఏడుతరాలు' రాసి ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపాడు. ఆ పుస్తకం నల్లవాళ్ల బైబిల్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు వై.బి.సత్యనారాయణ మూడు తరాల ఆత్మకథ రచించి చరిత్ర సృష్టించాడు. సాహిత్యంలో మరాఠీ ఆత్మకథ విజయకేతనం ఎగురవేస్తే ఇప్పుడు తెలుగులో తొలిజెండా ఎగురవేసిన ఈ పుస్తకం సాహిత్య చరిత్రలో ఓ మైలురాయి. మాదిగల చరిత్రను అక్షరీకరిస్తే అది రామాయణ, మహాభారతాలను మించిపోతుంది. ఇది ఒక బాలయ్య ఆత్మకథ మాత్రమే కాదు, లక్షలాది బాలయ్యల భార చరిత. రచయిత తన అపూర్వ మేధతో, పరిశీలనతో, రచనా శిల్పంతో ఈ పుస్తకాన్ని అమూల్యం చేశాడు. ఈ పుస్తకం చిదివితే మాట తప్పని మానధనులైన మాదిగల మహోన్నత మనస్తత్వం, స్వేచ్ఛ, వారి అమాయకత్వం పరోపకారప్రియత్వం, బహుభాషా పరిజ్ఞానం, సౌందర్యాత్మక దృష్టి మరియు చెప్పుల నిర్మాణంలో గొప్ప కళాసృష్టి పాఠకుల దృష్టిని ప్రగాఢంగా ఆకర్షిస్తాయి. - ఎండ్లూరి సుధాకర్ దళిత జీవితచరిత్రలలో ఓ మైలురాయి వంటిదీ పుస్తకం. ఈ జీవితకథలో అప్పటి రైలు మార్గాల నిర్మాణం వలెనే బాలయ్య కూడా అంతే వేగంగా మూడు తరాలను ఆధునికతలోకి ప్రయాణం చేయించాడు. ఆధునికతని పోరాట సాధనంగా చేసుకున్నాడు. - గోపాల్ గురు తెలంగాణా గ్రామీణ జీవితాల్లో పొరలు పొరలుగా ఎదురయ్యే పేదరికం, సామాజిక వెలి, అంటరానితనం, శ్రమ దోపిడీ, కష్టాల కడగండ్ల వంటి వాటన్నింటిపై ఓ దళిత కుటుంబం సాగించిన యుద్ధాన్ని కళ్లకు కట్టే రచన ఇది. వాళ్లీ క్రమంలో చేసిన ప్రయత్నాలనూ, అనుభవించిన వేదననూ నిజాయితీగా ఆవిష్కరిస్తుందిది. విద్యకోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛకోసం జరిపే పోరాటంలో విజయం ఎంత ప్రధానమో బలంగా నొక్కి చెప్పే ఈ రచన - మనల్ని కల్లోల పరుస్తుంది. అదే సమయంలో ఎంతో స్ఫూర్తినీ రగిలిస్తుంది. - శాంతా సిన్హా ఒక తరం ప్రయాణంయెలుకటి రామదాసు అనే వ్యక్తి ప్రయాణాన్ని చిత్రిస్తుంది 'మా నాయన బాలయ్య' పుస్తకం. ఇదివరకు మనం చదివిన 'ఏడు తరాలు' 'టామ్ మామ ఇల్లు' 'ఊరువాడ బతుకు' వంటి రచనలను గుర్తు చేస్తుంది ఈ పుస్తకం. తెలంగాణ ప్రాంతంలోని ఒక మాదిగ కుటుంబం అవిశ్రాంతంగా కృషి చెయ్యడం ద్వారా సమాజంలో ఒక్కో మెట్టునూ ఎక్కుతూ వచ్చిన వైనాన్ని అద్భుతంగా చిత్రించిందీ రచన. గ్రామంలోనే ఉంటే వెట్టిచాకిరీ తప్పదని గ్రహించిన తండ్రి కొడుకును వేరే ఊరికి పంపడంతో మొదలవుతుంది రామదాసు ప్రయాణం.మసీదులో ముల్లా ఆలీసాహెబ్ చొరవతో నాలుగు అక్షరాలు దిద్దుకున్న రామదాసు రైల్వేలో చేరి సికింద్రాబాద్ చుట్టుపక్కల ఊళ్లలో బాలయ్యగా ఎదగడం వెనక ఎగుడుదిగుళ్లన్నిటినీ కళ్లకు కట్టినట్టు వివరిస్తుందీ పుస్తకం. ఆయనకు చదువు విలువ తెలియడం వల్లనే ఆయన సంతానం బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో నిలదొక్కుకున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే బాలయ్య తన బిడ్డలను చదివించడం వల్ల ఇప్పుడీ రచనలోని అక్షరాల్లో జీవించాడు, ఇన్నేళ్ల తర్వాత కూడా ఎంతోమందికి తన జీవితాన్ని ప్రేరణ చెయ్యగలిగాడు. 'మా కుటుంబమే కాదు, ఒక మంచి భవిష్యత్తు నిర్మించడం కోసం దళితులూ దళితేతరులూ కూడా మా గతాన్ని తెలుసుకోవాలి అనేది నా అభిమతం' అంటారు రచయిత వై.బి. సత్యనారాయణ.ఆయన ఉద్దేశాలను పూర్తిగా నెరవేరుస్తుందీ రచన. ఆయన ఇంగ్లీషులో రాసినదాన్ని ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి తెలుగులోకి అనువదించారు. తెలంగాణ నుడికారంతో చక్కగా ఉన్న శైలి వలన ఇది అనువాదమనిపించదు. -ఆదివారం ఆంధ్రజ్యోతి
© 2017,www.logili.com All Rights Reserved.