ధవళమైన చంద్రకాంతితో రమేష్ ఆమెను అలా
చాలాసేపు చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళు ఇలా
మొదటిసారి కలుసుకున్న సన్నివేశం ఎంతో
విచిత్రంగా ఉంది. ప్రాణానికీ, మరణానికీ మధ్యనా
అన్నట్లు నది మధ్యన ఇసుక తిన్నెలమీద ఇక్కడే
మొదటిసారిగా ఆమెను చూడటం ఎంత
విచిత్రమైన, విశిష్టమైన సన్నివేశం!
'సుశీల చూడటానికి బాగుండదని అన్నదెవడు?'
రమేష్ సర్వమూ మరచిపోయాడు. అతనిలా
అనుకున్నాడు 'పెళ్ళి హడావుడిలో నేను ఈమెవంక
చూడకుండా వుండటం కూడా మంచిదే అయింది.
ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విధంగా, చూడటానికి
అవకాశం ఉండేది కాదు. ఆమెను పునరుజ్జీవింపచేసి
నాకు నేను సరికొత్త జీవనం తెచ్చుకుంటున్నాను.
వివాహ మంత్రాల బంధంకంటె ఈ బంధం వల్ల
మా ఇద్దరికీ మరింత ఆప్యాయత, పూర్ణ ప్రేమ
ఏర్పడుతాయి. ఆ తతంగాలన్నీ పెద్దలకోసం మటుకే!
ఇప్పుడు ఈమె నాకు సృష్టి ప్రసాదితంగా భావిస్తాను'.
ఒకనాడు సాయంత్రం సరదాగా ఆమె జుట్టు
ముడి పట్టుకు ఊపి "సుశీలా! ఈ రకంగా ముడి
వేసుకోవడం నాకు అందంగా కనిపించడం
లేదు" అన్నాడు.
ఆమె లేచి కూర్చుంది. "చూడండి, ఎన్నిమార్లు
చెప్పినా నన్ను ఇలా 'సుశీలా! సుశీలా!' అని
పిలుస్తారేం?" అని అడిగింది. రమేష్
ఆమెవంక ఆశ్చర్యంగా చూశాడు. ఈ ప్రశ్న
అతనికి అర్ధం కాలేదు.
తనని ఎంతగానో ప్రేమించే భర్తని ఆమె
ఎందుకలా నిలదీసింది? ఆమె అలా నిలదీయడం
వెనుక వున్న పరిస్థితులేమిటి?
తెలుసుకోవాలంటే చదవండి,
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వినూత్న సృష్టి
'పడవ మునక'.
ధవళమైన చంద్రకాంతితో రమేష్ ఆమెను అలా చాలాసేపు చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళు ఇలా మొదటిసారి కలుసుకున్న సన్నివేశం ఎంతో విచిత్రంగా ఉంది. ప్రాణానికీ, మరణానికీ మధ్యనా అన్నట్లు నది మధ్యన ఇసుక తిన్నెలమీద ఇక్కడే మొదటిసారిగా ఆమెను చూడటం ఎంత విచిత్రమైన, విశిష్టమైన సన్నివేశం! 'సుశీల చూడటానికి బాగుండదని అన్నదెవడు?' రమేష్ సర్వమూ మరచిపోయాడు. అతనిలా అనుకున్నాడు 'పెళ్ళి హడావుడిలో నేను ఈమెవంక చూడకుండా వుండటం కూడా మంచిదే అయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విధంగా, చూడటానికి అవకాశం ఉండేది కాదు. ఆమెను పునరుజ్జీవింపచేసి నాకు నేను సరికొత్త జీవనం తెచ్చుకుంటున్నాను. వివాహ మంత్రాల బంధంకంటె ఈ బంధం వల్ల మా ఇద్దరికీ మరింత ఆప్యాయత, పూర్ణ ప్రేమ ఏర్పడుతాయి. ఆ తతంగాలన్నీ పెద్దలకోసం మటుకే! ఇప్పుడు ఈమె నాకు సృష్టి ప్రసాదితంగా భావిస్తాను'. ఒకనాడు సాయంత్రం సరదాగా ఆమె జుట్టు ముడి పట్టుకు ఊపి "సుశీలా! ఈ రకంగా ముడి వేసుకోవడం నాకు అందంగా కనిపించడం లేదు" అన్నాడు. ఆమె లేచి కూర్చుంది. "చూడండి, ఎన్నిమార్లు చెప్పినా నన్ను ఇలా 'సుశీలా! సుశీలా!' అని పిలుస్తారేం?" అని అడిగింది. రమేష్ ఆమెవంక ఆశ్చర్యంగా చూశాడు. ఈ ప్రశ్న అతనికి అర్ధం కాలేదు. తనని ఎంతగానో ప్రేమించే భర్తని ఆమె ఎందుకలా నిలదీసింది? ఆమె అలా నిలదీయడం వెనుక వున్న పరిస్థితులేమిటి? తెలుసుకోవాలంటే చదవండి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వినూత్న సృష్టి 'పడవ మునక'.© 2017,www.logili.com All Rights Reserved.