ఇంటిల్లపాదికీ వినోదాన్ని, చిన్నారులకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే 'పంచతంత్రం' నీతికథా గ్రంధాన్ని మీకు సమర్పిస్తున్నాం.
'పంచతంత్రం' అనేక భాషలలో ప్రచురితమవుతూ పిల్లలతో పాటు పెద్దలని కూడా అలరిస్తూ పాఠకుల హృదయాల్లో సుస్థిరస్థాత్నం సంపాదించుకున్నది.
'పంచతంత్రం' గ్రంథ రచయిత విష్ణుశర్మ అని కొందరు, 'నారాయణ పండితుడు' అని కొందరు పేర్కొన్నారు. అయితే యీ గ్రంథంలో కథానాయకుడైన విష్ణుశర్మ యీ పంచతంత్రం సంస్కృతంలో రచించినట్లు ఆ పాత్ర పేరు ద్వారా మనం భవించవచ్చు.
సంస్కృతంలోని పంచతంత్రం మొదటి రెండు భాగాలను మహా పండితుడైన 'పరవస్తు చిన్నయసూరి' తెనుగులో రచించగా, మూడు- నాలుగు భాగాలను 'కందుకూరి వీరేశలింగం' గారు తెనుగించారు. ఐదవ భాగాన్ని 'చెరుకువాడ వెంకట రామయ్య' గారు రచించారు.
ఆ తర్వాత ఎందరో యీ కథలను రచించారు. ఎవరి శైలి వారిది... ఎవరి కథనం వారిది.
- తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు
పాఠకులకు నమస్కారాలు!