మిత్రలాభం
గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగుచెట్టు ఉండేది. ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘుపతనకం అనే కాకి ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే కిందకు చూసి ఆ చెట్టుకు కొద్దిదూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. వలపన్నటం పూర్తిచేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు.
కొంతసేపటికి అటువైపుగా కొన్ని పావురాలు గుంపుగా ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకి ‘చిత్రగ్రీవుడు’ అనే పావురం రాజు. ఆ బూరుగుచెట్టు దగ్గరకు వస్తూనే వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో ‘మిత్రులారా! మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి. ఏ వేటగాడో మనలాంటి పక్షులకోసం పన్నిన వల అయి ఉండవచ్చు. మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొనితెచ్చుకోవద్దు’ అంటూ హెచ్చరించాడు.
ఆ గుంపులో ఉన్న ఓ ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి ‘చిత్రగ్రీవా! అనవసరమైన అనుమానాలతో ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాలదన్నుకోవడం మూర్ఖత్వం. ఆ బూరుగు చెట్టుమీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవి తినటానికి మనం కిందకు దిగుదాం!’ అంటూ సలహా చెప్పింది. వద్దు మీరు నామాట వినకపోతే మన గతి బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారి వలె అవుతుంది అన్నాడు చిత్రగ్రీవుడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు. మరెన్నో కథలు ఈ పుస్తకాలలో కలవు.
మిత్రలాభం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగుచెట్టు ఉండేది. ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘుపతనకం అనే కాకి ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే కిందకు చూసి ఆ చెట్టుకు కొద్దిదూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. వలపన్నటం పూర్తిచేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు. కొంతసేపటికి అటువైపుగా కొన్ని పావురాలు గుంపుగా ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకి ‘చిత్రగ్రీవుడు’ అనే పావురం రాజు. ఆ బూరుగుచెట్టు దగ్గరకు వస్తూనే వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో ‘మిత్రులారా! మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి. ఏ వేటగాడో మనలాంటి పక్షులకోసం పన్నిన వల అయి ఉండవచ్చు. మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొనితెచ్చుకోవద్దు’ అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఓ ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి ‘చిత్రగ్రీవా! అనవసరమైన అనుమానాలతో ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాలదన్నుకోవడం మూర్ఖత్వం. ఆ బూరుగు చెట్టుమీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవి తినటానికి మనం కిందకు దిగుదాం!’ అంటూ సలహా చెప్పింది. వద్దు మీరు నామాట వినకపోతే మన గతి బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారి వలె అవుతుంది అన్నాడు చిత్రగ్రీవుడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు. మరెన్నో కథలు ఈ పుస్తకాలలో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.