పరాజయం విజయానికి సోపానం
A Setback is a Setup for a Comeback by Willie Jolley కి తెలుగు అనువాదం .
" ఈ పుస్తకం చదివి జీవితం మీకు విసిరే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి . ఉత్తేజపరిచే పుస్తకం " -
ఆయన్ లా వాన్జేoట్
మీకెప్పుడైన పరాజయం సంభవించిందా ?
జీవితం మోసగించిందా ?
గడ్డు కాలాలు కృంగదీశాయా ?
మీ పరాజయాలను అపూర్వమైన విజయాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం, ఈ జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషం చాలు , రాసిన విలీ జాలీ , పరాజయo విజయానికి సోపానం , అనే ఈ పుస్తకం లో మీరు కృషి చెయ్యడానికి, మీ లక్ష్యం సాధించుకోవడానికి స్పూర్తి నిస్తాడు. వి. డి . ఏ . డి ఫార్ములా - ముందు చూపు, నిర్ణయం, చర్య, కోరిక - జీవితంలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను ఆదిగమించడానికి ఎలా తోడ్పడుతుందో చూపిస్తుంది . మీ అదృష్టం పగ్గాలు మీ చేతుల్లోనే ఉంచుకోవడానికి సాయపడే తన టెక్నిక్ లను మీతో పంచుకుంటాడు . కష్టాల ముందు తలవంచని, అనుకోని ప్రదేశాలలో అవకాశాలు అన్వేసించిన సాధారణ వ్యక్తుల అనుభవాల గురించి చెబుతాడు . మనోరంజనమైన ప్రసంగాలు, ఉదాహరణలు, కధలతో మీరు మీ శక్తులను కేంద్రీకరించి, కార్మోన్ముఖులు అయేలా చేస్తుంది . విలీ ప్రతిపాదించిన పన్నెండు సరళమైన వ్యూహాలను ఉపయోగించి, మీరు మీ పరాజయాలను విజయాలుగా, సమస్యలను సంభ్యావ్యతలుగా మార్చుకొగలరు. ఇది నిజంగా ఒక ' ప్రేరనాత్మకమైన ఉత్తమ రచన '.
విలీ జాలీ, ' ఈ సంవత్సరంలోని ఒక విశిష్ట స్పూర్థిదాయక వక్త '
:నీ జీవితం లో నువ్వు ఎప్పుడైనా క్రింది స్థాయిలో ఉన్నప్పుడు, పైకి ఎలా వెళ్ళాలో , ఎలా బయటపడాలో, ముందు ఎటువంటి మార్గం ఉందో, ఈ పుస్తకం చూపిస్తుంది . తప్పక చదవవలసిన గొప్ప పుస్తకo . "
- లెస్ బ్రౌన్, లివ్ యువర్ డ్రీమ్స్ రచయత
" పరాజయం విజయానికి సోపానం పుస్తకం చదవడం, మీ సమస్యలను సంభావ్యతలుగా మార్చుకోవడంలో, మీ సవాళ్ళను అధ్బుత అవకాశాలుగా మలుచుకోవడంలో సహాయపడు తుందని నేను నమ్ముతున్నాను . "
- వాలి ఫేమస్ ఎమస్ , వాటర్ మెలన్ మ్యూజిక్ రచయిత.
© 2017,www.logili.com All Rights Reserved.