"ఉన్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో చేరాలని ఉత్సాహపడే అభ్యర్దుల నైతిక విలువల పై కూడా గత మూడేళ్ళగా ప్రభుత్వం శ్రద్ద చూపుతున్నది. దీనికి అనుగుణంగా 'పాలనలో నైతికత' అంశంపై పుస్తకాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే సైద్దాంతిక అంశాలపై ఫలప్రదమైన చర్చకు అవకాశమిచ్చాయి. సత్యనిష్ట కలిగిన సివిల్ సర్వీసెస్ అధికారిగా మాత్రమే కాదు. నైతికతను గురించి వ్రాయడానికి డా. మోహన్ కు మరో ముఖ్యమైన అర్హత వుంది. న్యాయమూర్తి, ధర్మజ్ఞుడైన తండ్రి నుంచి ఆ విలువలను పుణికి పుచ్చుకున్నారాయన."
- కే.పద్మనాభయ్య, ఐఏయస్
"చట్టప్రకారం రహస్యాల పరిరక్షణ భాద్యతను గౌరవిస్తూనే ప్రభుత్వ పాలనలో పారదర్శక విలువలను కాపాడడానికి కూడా ప్రభుత్వ అధికారులు కృషి చేయాలి"
"పౌరుల మానమర్యాదలను గౌరవించడంలో అధికారుల విధినిర్వహణ స్పూర్తిదాయకంగా ఉండాలి."
ప్రభుత్వ, ప్రభుత్వేతర పాలనారంగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులే కాకుండా పాలనారంగంలో విధులు నిర్వహించగోరే ఔత్సాహికులకు కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడానికి నాకెలాంటి సంకోచము లేదు. ఎందుకంటే విధినిర్వహణ సమయం లో ఎదురయ్యే, ఎదురు కాబోయే అడ్డంకులను తొలగించుకునే ఉపాయాలు సైతం ఇందులో పొందుపర్చారు.
- జస్టిస్ సి.వై.సోమయాజులు
"ఉన్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో చేరాలని ఉత్సాహపడే అభ్యర్దుల నైతిక విలువల పై కూడా గత మూడేళ్ళగా ప్రభుత్వం శ్రద్ద చూపుతున్నది. దీనికి అనుగుణంగా 'పాలనలో నైతికత' అంశంపై పుస్తకాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే సైద్దాంతిక అంశాలపై ఫలప్రదమైన చర్చకు అవకాశమిచ్చాయి. సత్యనిష్ట కలిగిన సివిల్ సర్వీసెస్ అధికారిగా మాత్రమే కాదు. నైతికతను గురించి వ్రాయడానికి డా. మోహన్ కు మరో ముఖ్యమైన అర్హత వుంది. న్యాయమూర్తి, ధర్మజ్ఞుడైన తండ్రి నుంచి ఆ విలువలను పుణికి పుచ్చుకున్నారాయన." - కే.పద్మనాభయ్య, ఐఏయస్ "చట్టప్రకారం రహస్యాల పరిరక్షణ భాద్యతను గౌరవిస్తూనే ప్రభుత్వ పాలనలో పారదర్శక విలువలను కాపాడడానికి కూడా ప్రభుత్వ అధికారులు కృషి చేయాలి" "పౌరుల మానమర్యాదలను గౌరవించడంలో అధికారుల విధినిర్వహణ స్పూర్తిదాయకంగా ఉండాలి." ప్రభుత్వ, ప్రభుత్వేతర పాలనారంగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులే కాకుండా పాలనారంగంలో విధులు నిర్వహించగోరే ఔత్సాహికులకు కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడానికి నాకెలాంటి సంకోచము లేదు. ఎందుకంటే విధినిర్వహణ సమయం లో ఎదురయ్యే, ఎదురు కాబోయే అడ్డంకులను తొలగించుకునే ఉపాయాలు సైతం ఇందులో పొందుపర్చారు. - జస్టిస్ సి.వై.సోమయాజులు
© 2017,www.logili.com All Rights Reserved.