సినిమా పట్ల గాఢమయిన అభిరుచి, ఆసక్తి వున్న సినిమా విద్యార్ధులకు ఇది విజ్ఞాన సర్వస్వం. 1895 నుంచి 1930 వరకు క్రమ పరిణామంలో మూకీ సినిమా రూపొందిన విధానాన్ని పసుపులేటి పూర్ణచంద్ర రావు కళ్లకు కట్టించారు. ఫ్రాన్స్ లో మొదలయిన సినిమా ఎట్లా ప్రపంచ వ్యాప్తమయిందో, సమాంతరంగా భారతీయ సినిమా ఎట్లా రూపుదిద్దుకుందో ఆయన వివరించారు.
సౌలభ్యం కోసం ఒక్కో సంవత్సరాన్ని తీసుకుని ఆ సంవత్సరంలో ఏ దేశంలో ఎట్లాంటి చిత్రాలు నిర్మించారో, సాంకేతిక అభివృద్ధి ఎట్లా జరిగిందో ప్రదర్శించారు. అదే సమయంలో ఆయా దేశాల సాంఘిక, రాజకీయ పరిస్థితుల్ని కూడా సందర్భానుసారంగా రాశారు. స్వేచ్ఛ గురించి మాట్లాడే అమెరికాలో సినిమాల్లో కూడా కనిపించే జాత్యహంకారం; నియంతృత్వం రాజ్యమేలే కమ్యూనిస్టు రష్యాలో కళావిలువల్ని కాపాడుకున్న ఐసేన్ స్టీన్ వంటి మహాదర్శకుల ప్రతిభ మనకు దిగ్భ్రమ కలిగిస్తాయి.
పూర్ణచంద్ర రావుగారు మూకీ చిత్రాల సంపూర్ణచరిత్రను మన కళ్లముందుంచారు. ఇది తెలుగులో మాత్రమే కాదు. భారతదేశంలో ఏ ఇతర భాషలోనూ వెలువడని అపూర్వగ్రంధం.
దశాబ్దాల పాటు మూకీ సినిమాకు మకుటం లేని మహారాజుగ వెలిగిన చాప్లిన్ తన నటనతో, దర్శక సాంకేతిక సామజిక సరిహద్దుల్ని దాటి ప్రపంచ ప్రజానీకాన్ని ప్రభావితం చేసిన తీరు; అమెరికాలో వుంటూ అమెరికాని ఎదిరించి ఇంగ్లాండుకు తిరిగి వెళ్లడం మొదలయిన విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సినిమా మొదలయిన నాటి నుంచీ వినోదం, వ్యాపారం దానితోబాటు నడిచాయని పూర్ణచంద్ర రావుగారు నిర్మొహమాటంగా చెప్పాడు.
1895లో లూమీర్ బ్రదర్స్ 'కదిలే బొమ్మల్ని' మొదటి సారి ప్రదర్శించారు. హల్లో తెరమీదికీ ఏకంగా ట్రెయిన్ వచ్చి పడడంతో ప్రేక్షకులు తన మీదకే వచ్చిపడ్డట్టు భయభ్రాంతులయ్యారట!
తరువాత సినిమాకు పరిణత దశకు తీసుకెళ్లినవాడు 'జార్జి మెలీ'. ఆయన గురించి జార్జెన్ శాండోల్ అన్న విమర్శకుడు 'లూమీర్స్ సినిమాటోగ్రాఫ్ ని నిర్మిస్తే మెలీ మొత్తం సినిమా కళనే నిర్మించాడు' అన్నాడు.
1896లో జులై 7న 'లూమీర్ ప్రోగ్రాం' గా ప్రసిద్ధి కెక్కిన కొన్ని సినిమా ముక్కల్ని బొంబాయిలో తెరమీద ప్రాజెక్ట్ చేసి చూపారట.
D.W. గ్రిఫిత్ అమెరికాలో ప్రపంచ సినిమా రూపురేఖల్ని మార్చే సినిమా తీశాడు. కానీ అతనికి 'తెల్లజాతి' ప్రజలంటే ఇష్టం.
దాదా సాహెబ్ ఫాల్కే రఘుపతి వెంకయ్య నాయుడు ఎట్లా సినిమా రంగ ప్రవేశం చేశారో వివరాలతో ఇచ్చారు.
ఈ క్రమంలో మూకీ సినిమాను తొలినాళ్లలో నిర్మించిన కొందరి వ్యక్తిగత జీవితాలు మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వ్యాపారం దెబ్బతిని జార్జి మెలీ చాలాకాలం అదృశ్యమై 1928లో పారిస్ వీధుల్లో న్యూస్ పేపర్ లు అమ్ముకుంటూ కనిపించాడట!
కొన్నికొన్ని సాంకేతిక పదాల వివరణల్ని కూడా రచయిత ఇస్తారు. 'మేలోడ్రామా' అంటే ఏమిటో చెబుతూ 'మేలోడ్రామా కూడా ఓ శిల్పమే. సమస్యల్ని మలుపుల్ని లాజికల్ గానే ప్రారంభించి, ఆ తీగల్ని మరికొంచెం లాగి, ప్రేక్షకుల్ని తీవ్రమైన ఎమోషన్ లో ముంచెత్తడం మెలోడ్రామా చేసేపని' అంటారు.
సినిమాకు సంబంధించిన రచన, స్క్రీన్ ప్లే రూపుదిద్దుకున్న విధానాల్ని, నాటి స్క్రిప్టు రచన ఎట్లా వుండేదో వుదాహరణ ప్రాయంగా ప్రదర్శించారు.
క్రమక్రమంగా మారిన టెక్నికల్ విశేషాలు, సామజిక అంశాలు వాటిని అనుసరించి సినిమాలలో వచ్చిన మార్పులు వివరించారు.
పాశ్చాత్య సినిమా 1927 నాటికే మాటలు నేర్చినా 1931 దాకా మన భారతీయ సినిమా మూకీగా వుండిపోయిందట.
సినిమాలలో మనం ఇప్పటికి చూడ్డానికి అలవాటు పడిపోయిన కొన్ని ఆదర్శాలు, వాటి పూర్వరంగం వివరించారు.
ఈ గ్రంధంలో కంపారిటివ్ స్టడీ మాత్రమే కాక సినిమాకు సంబంధించిన అనేక సైద్ధాంతికాంశాల గురించి, శిల్పానికి సంబంధించిన isms, forms, genres, trends and styles గురించి సందర్భోచితంగా చర్చించారు.
ఇదొక మహాగ్రంథం. ఇదొక మహాసముద్రం, ఇదొక మహాప్రస్థానం, పూర్ణచంద్ర రావుగారు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ సినిమారంగం పట్ల అపారమయిన అనురాగంతో చేసిన అనంత శ్రమకు ఫలిత మీ రచన.
'ముక్కసినిమా' అనేది పూర్ణచంద్రరావుగారి 'సృష్టి'. ఆ ముక్క నాకెంత నచ్చిందో....!
- తనికెళ్ళ భరణి
సినిమా పట్ల గాఢమయిన అభిరుచి, ఆసక్తి వున్న సినిమా విద్యార్ధులకు ఇది విజ్ఞాన సర్వస్వం. 1895 నుంచి 1930 వరకు క్రమ పరిణామంలో మూకీ సినిమా రూపొందిన విధానాన్ని పసుపులేటి పూర్ణచంద్ర రావు కళ్లకు కట్టించారు. ఫ్రాన్స్ లో మొదలయిన సినిమా ఎట్లా ప్రపంచ వ్యాప్తమయిందో, సమాంతరంగా భారతీయ సినిమా ఎట్లా రూపుదిద్దుకుందో ఆయన వివరించారు. సౌలభ్యం కోసం ఒక్కో సంవత్సరాన్ని తీసుకుని ఆ సంవత్సరంలో ఏ దేశంలో ఎట్లాంటి చిత్రాలు నిర్మించారో, సాంకేతిక అభివృద్ధి ఎట్లా జరిగిందో ప్రదర్శించారు. అదే సమయంలో ఆయా దేశాల సాంఘిక, రాజకీయ పరిస్థితుల్ని కూడా సందర్భానుసారంగా రాశారు. స్వేచ్ఛ గురించి మాట్లాడే అమెరికాలో సినిమాల్లో కూడా కనిపించే జాత్యహంకారం; నియంతృత్వం రాజ్యమేలే కమ్యూనిస్టు రష్యాలో కళావిలువల్ని కాపాడుకున్న ఐసేన్ స్టీన్ వంటి మహాదర్శకుల ప్రతిభ మనకు దిగ్భ్రమ కలిగిస్తాయి. పూర్ణచంద్ర రావుగారు మూకీ చిత్రాల సంపూర్ణచరిత్రను మన కళ్లముందుంచారు. ఇది తెలుగులో మాత్రమే కాదు. భారతదేశంలో ఏ ఇతర భాషలోనూ వెలువడని అపూర్వగ్రంధం. దశాబ్దాల పాటు మూకీ సినిమాకు మకుటం లేని మహారాజుగ వెలిగిన చాప్లిన్ తన నటనతో, దర్శక సాంకేతిక సామజిక సరిహద్దుల్ని దాటి ప్రపంచ ప్రజానీకాన్ని ప్రభావితం చేసిన తీరు; అమెరికాలో వుంటూ అమెరికాని ఎదిరించి ఇంగ్లాండుకు తిరిగి వెళ్లడం మొదలయిన విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. సినిమా మొదలయిన నాటి నుంచీ వినోదం, వ్యాపారం దానితోబాటు నడిచాయని పూర్ణచంద్ర రావుగారు నిర్మొహమాటంగా చెప్పాడు. 1895లో లూమీర్ బ్రదర్స్ 'కదిలే బొమ్మల్ని' మొదటి సారి ప్రదర్శించారు. హల్లో తెరమీదికీ ఏకంగా ట్రెయిన్ వచ్చి పడడంతో ప్రేక్షకులు తన మీదకే వచ్చిపడ్డట్టు భయభ్రాంతులయ్యారట! తరువాత సినిమాకు పరిణత దశకు తీసుకెళ్లినవాడు 'జార్జి మెలీ'. ఆయన గురించి జార్జెన్ శాండోల్ అన్న విమర్శకుడు 'లూమీర్స్ సినిమాటోగ్రాఫ్ ని నిర్మిస్తే మెలీ మొత్తం సినిమా కళనే నిర్మించాడు' అన్నాడు. 1896లో జులై 7న 'లూమీర్ ప్రోగ్రాం' గా ప్రసిద్ధి కెక్కిన కొన్ని సినిమా ముక్కల్ని బొంబాయిలో తెరమీద ప్రాజెక్ట్ చేసి చూపారట. D.W. గ్రిఫిత్ అమెరికాలో ప్రపంచ సినిమా రూపురేఖల్ని మార్చే సినిమా తీశాడు. కానీ అతనికి 'తెల్లజాతి' ప్రజలంటే ఇష్టం. దాదా సాహెబ్ ఫాల్కే రఘుపతి వెంకయ్య నాయుడు ఎట్లా సినిమా రంగ ప్రవేశం చేశారో వివరాలతో ఇచ్చారు. ఈ క్రమంలో మూకీ సినిమాను తొలినాళ్లలో నిర్మించిన కొందరి వ్యక్తిగత జీవితాలు మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వ్యాపారం దెబ్బతిని జార్జి మెలీ చాలాకాలం అదృశ్యమై 1928లో పారిస్ వీధుల్లో న్యూస్ పేపర్ లు అమ్ముకుంటూ కనిపించాడట! కొన్నికొన్ని సాంకేతిక పదాల వివరణల్ని కూడా రచయిత ఇస్తారు. 'మేలోడ్రామా' అంటే ఏమిటో చెబుతూ 'మేలోడ్రామా కూడా ఓ శిల్పమే. సమస్యల్ని మలుపుల్ని లాజికల్ గానే ప్రారంభించి, ఆ తీగల్ని మరికొంచెం లాగి, ప్రేక్షకుల్ని తీవ్రమైన ఎమోషన్ లో ముంచెత్తడం మెలోడ్రామా చేసేపని' అంటారు. సినిమాకు సంబంధించిన రచన, స్క్రీన్ ప్లే రూపుదిద్దుకున్న విధానాల్ని, నాటి స్క్రిప్టు రచన ఎట్లా వుండేదో వుదాహరణ ప్రాయంగా ప్రదర్శించారు. క్రమక్రమంగా మారిన టెక్నికల్ విశేషాలు, సామజిక అంశాలు వాటిని అనుసరించి సినిమాలలో వచ్చిన మార్పులు వివరించారు. పాశ్చాత్య సినిమా 1927 నాటికే మాటలు నేర్చినా 1931 దాకా మన భారతీయ సినిమా మూకీగా వుండిపోయిందట. సినిమాలలో మనం ఇప్పటికి చూడ్డానికి అలవాటు పడిపోయిన కొన్ని ఆదర్శాలు, వాటి పూర్వరంగం వివరించారు. ఈ గ్రంధంలో కంపారిటివ్ స్టడీ మాత్రమే కాక సినిమాకు సంబంధించిన అనేక సైద్ధాంతికాంశాల గురించి, శిల్పానికి సంబంధించిన isms, forms, genres, trends and styles గురించి సందర్భోచితంగా చర్చించారు. ఇదొక మహాగ్రంథం. ఇదొక మహాసముద్రం, ఇదొక మహాప్రస్థానం, పూర్ణచంద్ర రావుగారు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ సినిమారంగం పట్ల అపారమయిన అనురాగంతో చేసిన అనంత శ్రమకు ఫలిత మీ రచన. 'ముక్కసినిమా' అనేది పూర్ణచంద్రరావుగారి 'సృష్టి'. ఆ ముక్క నాకెంత నచ్చిందో....! - తనికెళ్ళ భరణి© 2017,www.logili.com All Rights Reserved.