సినిమా విమర్శకు విలువైన చేర్పు
మొదట్లో ఒక సినిమా. ఒక ట్రైన్ ప్లాట్ఫాం మీదకి రావడం. అంతే. (లూమియేర్ సోదరులు 1896లో తీసిన The arrival of train 50 సెకండ్ల చిత్రం). దాన్ని ప్రదర్శించినప్పుడు ఆశ్చర్యమే కాదు ప్రేక్షకులకు భయం కూడా వేసి లేచి పరుగెత్తారట, బండి తమ మీదకు రాకముందే. ఇది ఎందుకు తలచుకుంటున్నానంటే సినిమా ప్రభావం మనిషి మీద ఎంత వున్నదీ చెప్పడానికి. 1895లో లూమియేర్ సోదరులు మొదలు పెట్టిన ప్రయాణం చాలా గొప్పగానే సాగింది. ఒక్క కెమెరాతో మొదలైన ప్రయాణం క్రమంగా మాటలు నేర్చి, రంగులు పులుముకుని పాతిక కొమ్మల చెట్టులా వికసించింది, ఇప్పటివరకు. రకరకాల కళల సమ్మేళనం వున్నా సినిమా అనేది తనంతట ఒక కొత్త కళ. దాని వ్యాకరణం ప్రత్యేకం. భిన్నమైన దృశ్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా చూపిస్తే అవి ఒక ప్రత్యేక అర్థాన్ని ప్రేక్షకునిలో సూచిస్తుంది అని montae ప్రతిపాదించినా Eisenstein నుంచి ఎందరో మహానుభావులు సినిమాను తీర్చి దిద్దుతూ ఇప్పుడున్న స్థితికి తీసుకు వచ్చారు. ఎక్కువ వివరాలు వ్రాయడానికి ఇది తగిన చోటు కాదు. Meshes of the afternoon, Un Chien Andalou లాంటి చిత్రాలను తప్పిస్తే సినిమాలన్నిటికీ మూలం కథ అంటే అతిశయోక్తి కాదు. కథనంలో భిన్న భిన్న పద్ధతులు, కథను చూసే-చెప్పే దృష్టికోణం వగైరాలు సినిమాలను ప్రత్యేకంగా పరిశీలించతగ్గవిగా చేస్తాయి. సినిమా తీసిన ఆయా కాలాల స్థితి గతులు, సమాజం, ఆలోచనలు అన్నీ రికార్డ్ చేస్తుంది సినిమా. ఖచ్చితంగా ఇక్కడ వంశీకృష్ణ కూడా అటువంటి పనే చేస్తున్నాడు. విరివిగా సినిమా వ్యాసాలు వ్రాస్తూ సినిమా ప్రయాణాన్ని రికార్డ్ చేస్తూనే సందర్భం వచ్చినప్పుడల్లా తను పరిచయం చేస్తున్న, పరిశీలిస్తున్న సినిమాని సమాజంతో, గతకాలపు సినిమాలతో సమన్వయం చేస్తూ తన అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నాడు....................
సినిమా విమర్శకు విలువైన చేర్పు మొదట్లో ఒక సినిమా. ఒక ట్రైన్ ప్లాట్ఫాం మీదకి రావడం. అంతే. (లూమియేర్ సోదరులు 1896లో తీసిన The arrival of train 50 సెకండ్ల చిత్రం). దాన్ని ప్రదర్శించినప్పుడు ఆశ్చర్యమే కాదు ప్రేక్షకులకు భయం కూడా వేసి లేచి పరుగెత్తారట, బండి తమ మీదకు రాకముందే. ఇది ఎందుకు తలచుకుంటున్నానంటే సినిమా ప్రభావం మనిషి మీద ఎంత వున్నదీ చెప్పడానికి. 1895లో లూమియేర్ సోదరులు మొదలు పెట్టిన ప్రయాణం చాలా గొప్పగానే సాగింది. ఒక్క కెమెరాతో మొదలైన ప్రయాణం క్రమంగా మాటలు నేర్చి, రంగులు పులుముకుని పాతిక కొమ్మల చెట్టులా వికసించింది, ఇప్పటివరకు. రకరకాల కళల సమ్మేళనం వున్నా సినిమా అనేది తనంతట ఒక కొత్త కళ. దాని వ్యాకరణం ప్రత్యేకం. భిన్నమైన దృశ్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా చూపిస్తే అవి ఒక ప్రత్యేక అర్థాన్ని ప్రేక్షకునిలో సూచిస్తుంది అని montae ప్రతిపాదించినా Eisenstein నుంచి ఎందరో మహానుభావులు సినిమాను తీర్చి దిద్దుతూ ఇప్పుడున్న స్థితికి తీసుకు వచ్చారు. ఎక్కువ వివరాలు వ్రాయడానికి ఇది తగిన చోటు కాదు. Meshes of the afternoon, Un Chien Andalou లాంటి చిత్రాలను తప్పిస్తే సినిమాలన్నిటికీ మూలం కథ అంటే అతిశయోక్తి కాదు. కథనంలో భిన్న భిన్న పద్ధతులు, కథను చూసే-చెప్పే దృష్టికోణం వగైరాలు సినిమాలను ప్రత్యేకంగా పరిశీలించతగ్గవిగా చేస్తాయి. సినిమా తీసిన ఆయా కాలాల స్థితి గతులు, సమాజం, ఆలోచనలు అన్నీ రికార్డ్ చేస్తుంది సినిమా. ఖచ్చితంగా ఇక్కడ వంశీకృష్ణ కూడా అటువంటి పనే చేస్తున్నాడు. విరివిగా సినిమా వ్యాసాలు వ్రాస్తూ సినిమా ప్రయాణాన్ని రికార్డ్ చేస్తూనే సందర్భం వచ్చినప్పుడల్లా తను పరిచయం చేస్తున్న, పరిశీలిస్తున్న సినిమాని సమాజంతో, గతకాలపు సినిమాలతో సమన్వయం చేస్తూ తన అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నాడు....................© 2017,www.logili.com All Rights Reserved.