పేరు రావాలని నేను రచనలు చేయలేదు. చెడును,దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం. అన్యాయాన్ని బజారుకీడిస్తే ఆనందం.అందుకే, నా తృప్తి కోసమే, నన్ను నేను సంతోష పరచుకోవడానికే రచనలు చేశాను. నా వ్యంగ్యంలో భాద,క్రోధం ఉన్నాయి.అందులో స్వచమైన ప్రతిస్పందన కనిపిస్తుంది. నాకు రాయాలనిపించింది,తెలిసినది నేను రాశాను.....పేరు కోసం రాయలేదు.పేరు వేరు యశస్సు వేరు.
సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారేవ్వరు ఉండరు.నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉంది తీరుతుంది.అది మార్చడానికి జరుగుతున్నా ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ భాద్యతల నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఫలితంగా ఒక్కొక్కప్పుడు నా వ్యక్తిగత ప్రకటనే మరొక స్తాయిలో సాముహిక ప్రకటన అవుతుంది. సామూహిక క్రోధమే ఒక్కొక్కప్పుడు నా వ్యక్తిగత క్రోధమవుతుంది. సామూహిక శోకం నా కంట్లో ఒక నీటి బొట్టవుతుంది.
...................పతంజలి
మొదటి సంపుటి
నవలలు
రెండవ సంపుటి
కధలు,పతంజలి భాష్యం, సంపాదకీయాలు , అవీ ఇవీ , గెలుపు సరే బ్రతకడం ఎలా ?
© 2017,www.logili.com All Rights Reserved.