ఈ పుస్తకం తెలుగుభాషలోని సాహిత్యాన్ని, సమాజాన్ని ఒక సంకలనంగా రూపొందించే బృహత్తర ప్రయత్నాన్ని మహత్తరంగా చేసిందని నేను భావిస్తున్నాను. లోపాలు లేక కాదు. అవి బయటపెడితే కోపాలు వస్తాయని తెలుసు. దోషాలు చూడకుండా గుణాలు మాత్రం చెప్పడం ఈనాటి కాల ధర్మం. అటు పరిశోధకులకూ ఇటు కొత్త అధ్యాపకులకూ ఇవే కావాలి. ‘బుద్ధిచెప్పిన వాడు గుద్దినా మేలయా!’ అని వేమనలాగా ఎవరూ అనుకోవడం లేదు.
ఈ గ్రంథంలో ఆదికవి వాల్మీకి నుంచి ఆధునికోత్తర వాదాల దాకా సాహిత్యాంశాల విశ్లేషణ ఉంది. ఇందులో నూనూగు మీసాల పరిశోధకులూ ఉన్నారు. నునులేత పరిశోధకురాళ్ళూ ఉన్నారు. అందెవేసిన చేతుల్లాంటి ఆచార్యులూ ఉన్నారు. దాదాపు అందరూ బోధన, పరిశోధన రంగాలకు చెందిన వారుకావడం గమనించవలసిన అంశం. అయితే ఇందులో ప్రచురితమైన ప్రతి వ్యాసం ఆణిముత్యమని గాని, కోహినూరు అని గాని నేను అనడం లేదు. అది పాఠకులే నిర్ధారించుకుంటారు. అయితే పాఠకలోకం కళాశాలలనుంచి, విశ్వవిద్యాలయాల నుంచి, ఎంతో ఆశిస్తుంది. పరిశోధకులందించే పరిశోధన ఫలాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ విషయంలో రచయితలే పాఠకులకూ లేదా సమాజానికీ జవాబుదారులవుతారు.
రచయితలు సమాజానికి సాహిత్యానికి మధ్య వారధి లాంటివారు. సమాజంలోని విభిన్న కోణాలను, పరస్పర విరుద్ధ అంశాలను సాహిత్యం ద్వారా ఆవిష్కరిస్తుంటారు. సమాజంలో జరిగే ఎన్నో మార్పుల్ని, చేర్పుల్ని నిశితంగా పరిశీలిస్తూ వాటిని ఎప్పటికప్పుడు తమ రచనల్లో ప్రతిబింబించేటట్లు చేస్తుంటారు. యువ పరిశోధకులు, వివిధ విశ్వవిద్యాలకు చెందిన ఆచార్యులు వ్రాసిన పరిశోధక వ్యాసాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. భాషా సాహిత్యాల్లో లోతుపాతుల్ని తెలుసుకోవాలనే వారికి ఈ గ్రంథం ఒక కరదీపికగా ఉపయోగపడుతుంది.
ఈ పుస్తకం తెలుగుభాషలోని సాహిత్యాన్ని, సమాజాన్ని ఒక సంకలనంగా రూపొందించే బృహత్తర ప్రయత్నాన్ని మహత్తరంగా చేసిందని నేను భావిస్తున్నాను. లోపాలు లేక కాదు. అవి బయటపెడితే కోపాలు వస్తాయని తెలుసు. దోషాలు చూడకుండా గుణాలు మాత్రం చెప్పడం ఈనాటి కాల ధర్మం. అటు పరిశోధకులకూ ఇటు కొత్త అధ్యాపకులకూ ఇవే కావాలి. ‘బుద్ధిచెప్పిన వాడు గుద్దినా మేలయా!’ అని వేమనలాగా ఎవరూ అనుకోవడం లేదు. ఈ గ్రంథంలో ఆదికవి వాల్మీకి నుంచి ఆధునికోత్తర వాదాల దాకా సాహిత్యాంశాల విశ్లేషణ ఉంది. ఇందులో నూనూగు మీసాల పరిశోధకులూ ఉన్నారు. నునులేత పరిశోధకురాళ్ళూ ఉన్నారు. అందెవేసిన చేతుల్లాంటి ఆచార్యులూ ఉన్నారు. దాదాపు అందరూ బోధన, పరిశోధన రంగాలకు చెందిన వారుకావడం గమనించవలసిన అంశం. అయితే ఇందులో ప్రచురితమైన ప్రతి వ్యాసం ఆణిముత్యమని గాని, కోహినూరు అని గాని నేను అనడం లేదు. అది పాఠకులే నిర్ధారించుకుంటారు. అయితే పాఠకలోకం కళాశాలలనుంచి, విశ్వవిద్యాలయాల నుంచి, ఎంతో ఆశిస్తుంది. పరిశోధకులందించే పరిశోధన ఫలాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ విషయంలో రచయితలే పాఠకులకూ లేదా సమాజానికీ జవాబుదారులవుతారు. రచయితలు సమాజానికి సాహిత్యానికి మధ్య వారధి లాంటివారు. సమాజంలోని విభిన్న కోణాలను, పరస్పర విరుద్ధ అంశాలను సాహిత్యం ద్వారా ఆవిష్కరిస్తుంటారు. సమాజంలో జరిగే ఎన్నో మార్పుల్ని, చేర్పుల్ని నిశితంగా పరిశీలిస్తూ వాటిని ఎప్పటికప్పుడు తమ రచనల్లో ప్రతిబింబించేటట్లు చేస్తుంటారు. యువ పరిశోధకులు, వివిధ విశ్వవిద్యాలకు చెందిన ఆచార్యులు వ్రాసిన పరిశోధక వ్యాసాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. భాషా సాహిత్యాల్లో లోతుపాతుల్ని తెలుసుకోవాలనే వారికి ఈ గ్రంథం ఒక కరదీపికగా ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.