అయల సోమయాజుల నీలకంటేశ్వర (ఎ.ఎన్) జగన్నాధశర్మ 13-4-1956 లో జన్మించారు. ప్రవృత్తిరీత్యా రచయిత, వృత్తిరీత్యా పత్రికా రచయిత అయిన ఈయన సుమారుగా అయిదు వందల కధలు రాశారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ 'నవ్యవీక్లీ' కీ సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
దిగువ మధ్యతరగతి జీవిత వాస్తవాల నిప్పు కణికెలు చేతి వ్రేళ్ళకీ తగిలి, కాలిన కమురు వాసనతో గుండెలు పిండేసేలా రాసిన కధలివి. ఈ కధల్లో ఛిద్ర జీవితాల పట్ల కసీ, కోపం, అభిమానం, జాలి, దయ... అన్నీ కలగలసిపోయి ఉంటాయి. చెప్పదలచినదీ, చెప్పగలిగినది ఇంత వాడిగా, వేడిగా, సూటిగా, ఒడుపుగా చెప్పే అక్షర విద్య జగన్నాధశర్మకే చాతనవును. చకచ్చికితాలయిన అక్షరాలూ, పదాల పరుగుల ఉరవడి, కెరటాల్లా విరిగి పడే వాక్యాల విరుపులూ వీటితో... ఈ కధలన్నీ మనల్ని వెంటాడుతాయి. కన్నీళ్లు, వేదనలూ నిండిన ఈ కధలు మరోసారి చదవడానికి భయపెడుతూనే, మళ్ళీ మళ్ళీ చదివించేలా చేస్తాయి. అదే వీటి గొప్పతనం.
- పంతుల జోగారావు
కోట్లాది మంది జీవిస్తున్న ఈ దేశంలో దీనజనులకేసి మాత్రేమే అ పేక్షగా చూసే చూపూ, వాస్తవికతా పరిధిని దాటిపోని యదార్ధవాద దృక్పధమూ, మానవీయవిలువలకు, ప్రతీకలుగా మారే వ్యక్తులతో అలవోకగా మమేకమయ్యే ధర్మ నిగ్రహమూ, మొదలు పెట్టిన నాలుగు వాక్యాలలోపే కధకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించుకునే నేర్పూ, నింపాదిగా, ఒడుపుగా, హుందాగా సాగిపోయే కధనమూ, సదవగహనా తీరాలకు చేర్చే శిల్పమూ, సామజిక వ్యవస్థపట్ల నిరసనను పెల్లుబికేలా చేసే నిపుణతా... వెరసి జీవితాన్ని కధలా, కరుణసాత్మక కావ్యంలా మలిచే కళాకారుడి కౌశాలమే ఎ.ఎన్..జగన్నాధశర్మ కధలు.
- మధురాంతకం నరేంద్ర
అయల సోమయాజుల నీలకంటేశ్వర (ఎ.ఎన్) జగన్నాధశర్మ 13-4-1956 లో జన్మించారు. ప్రవృత్తిరీత్యా రచయిత, వృత్తిరీత్యా పత్రికా రచయిత అయిన ఈయన సుమారుగా అయిదు వందల కధలు రాశారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ 'నవ్యవీక్లీ' కీ సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. దిగువ మధ్యతరగతి జీవిత వాస్తవాల నిప్పు కణికెలు చేతి వ్రేళ్ళకీ తగిలి, కాలిన కమురు వాసనతో గుండెలు పిండేసేలా రాసిన కధలివి. ఈ కధల్లో ఛిద్ర జీవితాల పట్ల కసీ, కోపం, అభిమానం, జాలి, దయ... అన్నీ కలగలసిపోయి ఉంటాయి. చెప్పదలచినదీ, చెప్పగలిగినది ఇంత వాడిగా, వేడిగా, సూటిగా, ఒడుపుగా చెప్పే అక్షర విద్య జగన్నాధశర్మకే చాతనవును. చకచ్చికితాలయిన అక్షరాలూ, పదాల పరుగుల ఉరవడి, కెరటాల్లా విరిగి పడే వాక్యాల విరుపులూ వీటితో... ఈ కధలన్నీ మనల్ని వెంటాడుతాయి. కన్నీళ్లు, వేదనలూ నిండిన ఈ కధలు మరోసారి చదవడానికి భయపెడుతూనే, మళ్ళీ మళ్ళీ చదివించేలా చేస్తాయి. అదే వీటి గొప్పతనం. - పంతుల జోగారావు కోట్లాది మంది జీవిస్తున్న ఈ దేశంలో దీనజనులకేసి మాత్రేమే అ పేక్షగా చూసే చూపూ, వాస్తవికతా పరిధిని దాటిపోని యదార్ధవాద దృక్పధమూ, మానవీయవిలువలకు, ప్రతీకలుగా మారే వ్యక్తులతో అలవోకగా మమేకమయ్యే ధర్మ నిగ్రహమూ, మొదలు పెట్టిన నాలుగు వాక్యాలలోపే కధకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించుకునే నేర్పూ, నింపాదిగా, ఒడుపుగా, హుందాగా సాగిపోయే కధనమూ, సదవగహనా తీరాలకు చేర్చే శిల్పమూ, సామజిక వ్యవస్థపట్ల నిరసనను పెల్లుబికేలా చేసే నిపుణతా... వెరసి జీవితాన్ని కధలా, కరుణసాత్మక కావ్యంలా మలిచే కళాకారుడి కౌశాలమే ఎ.ఎన్..జగన్నాధశర్మ కధలు. - మధురాంతకం నరేంద్ర© 2017,www.logili.com All Rights Reserved.