వివాహం మానవుల పంచదశకర్మలలో ప్రధానమైనది. ఇది వేదం నిర్దేశించిన బాధ్యతే కానీ వేడుక కాదు. స్త్రీ పురుషులు అన్యోన్యతతో కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ దేవ, పితృ, ఋషి ఋణాలు తీర్చుకోవటానికి ఏకగవాక్ష పధకంగా, ఏడడుగుల బంధంగా, ఏడేడు జన్మలబంధంగా మహర్షుల సంకల్పంతో రూపుదిద్దుకొంది. శాశ్వతమైన ఈ బంధం తాత్కాలిక ప్రయోజనాలు, ఆకర్షణలతో ఏర్పడితే అశాశ్వతమై ఆపదలను తెచ్చిపెడుతుంది. విజ్ఞానభరితమైన మన భారతీయ సంస్కృతీ మానవులు అజ్ఞానంతో వివాహం చేసుకొని అష్టకష్టాలు పడకుండా శాస్త్రీయమైన ఒక ప్రణాళికను అందించింది. జ్యోతిష్యం ద్వారా అనేక కోణాలలో పరిశీలించే వ్యవస్థ ఏర్పడింది. దైవజ్ఞుల సహాయంతో, వారి సలహాలతో అనుకూలత ఉన్న వధూవరులు వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం మూడుపువ్వులు - ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.
తెలుగువారి కోసం, వారి పరితమైన ధన, కాలాల వ్యయాన్ని తగ్గించుకుంటూ పిల్లల వివాహ విషయంలో ప్రాధమికంగా ఒక నిర్ణయానికి రావటానికి తోడ్పడుతుందని యీ పుస్తకాన్ని మీ ముందుంచుతున్నాను. ఎందరో జ్యోతిష్య పండితులు వ్రాసిన పుస్తకాలను, వ్యాసాలను, పరిశోధనా పత్రాలను చదివి, పరిశీలించి, వారు చెప్పిన విషయాలను, సేకరించి విషయ పరిజ్ఞానాన్ని మీ ముందుంచుతున్నాను.
- పోపూరి మాధవరావు
వివాహం మానవుల పంచదశకర్మలలో ప్రధానమైనది. ఇది వేదం నిర్దేశించిన బాధ్యతే కానీ వేడుక కాదు. స్త్రీ పురుషులు అన్యోన్యతతో కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ దేవ, పితృ, ఋషి ఋణాలు తీర్చుకోవటానికి ఏకగవాక్ష పధకంగా, ఏడడుగుల బంధంగా, ఏడేడు జన్మలబంధంగా మహర్షుల సంకల్పంతో రూపుదిద్దుకొంది. శాశ్వతమైన ఈ బంధం తాత్కాలిక ప్రయోజనాలు, ఆకర్షణలతో ఏర్పడితే అశాశ్వతమై ఆపదలను తెచ్చిపెడుతుంది. విజ్ఞానభరితమైన మన భారతీయ సంస్కృతీ మానవులు అజ్ఞానంతో వివాహం చేసుకొని అష్టకష్టాలు పడకుండా శాస్త్రీయమైన ఒక ప్రణాళికను అందించింది. జ్యోతిష్యం ద్వారా అనేక కోణాలలో పరిశీలించే వ్యవస్థ ఏర్పడింది. దైవజ్ఞుల సహాయంతో, వారి సలహాలతో అనుకూలత ఉన్న వధూవరులు వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం మూడుపువ్వులు - ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. తెలుగువారి కోసం, వారి పరితమైన ధన, కాలాల వ్యయాన్ని తగ్గించుకుంటూ పిల్లల వివాహ విషయంలో ప్రాధమికంగా ఒక నిర్ణయానికి రావటానికి తోడ్పడుతుందని యీ పుస్తకాన్ని మీ ముందుంచుతున్నాను. ఎందరో జ్యోతిష్య పండితులు వ్రాసిన పుస్తకాలను, వ్యాసాలను, పరిశోధనా పత్రాలను చదివి, పరిశీలించి, వారు చెప్పిన విషయాలను, సేకరించి విషయ పరిజ్ఞానాన్ని మీ ముందుంచుతున్నాను. - పోపూరి మాధవరావు© 2017,www.logili.com All Rights Reserved.