'తరం మారుతుంది' - ఇదో కధల సంపుటి. బహు చిన్న సంపుటి. గట్టిగా కూర్చుంటే ఇందులోని పన్నెండు కధలు ఒక్క ఉదుటున రెండు గంటల్లో చదివేయొచ్చు. అందుకు వీలుగానే రూపకల్పన చేయడం జరిగింది.
అద్భుత కల్పనలతో ఊహాలోకాల్లో విహరింపజేసే కధల్లాంటివి ఇందులో లేవు. ఈ కధల్లో కనిపించే పాత్రలన్నీ ఎక్కడో ఓ అక్కడ నిజజీవితంలో మనకు తారసపడేవే. వ్యక్తుల అనుభవసారమే కధల రూపాన్ని సంతరించుకుని మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఇందులోని కధలన్నీ ముక్కుసూటిగానే సాగుతాయి.
శిల్పం అంటారా? చెప్పే విధానమే కదండి! ఎవరి విధానం వారిది. ఇది నా విధానం. శిల్పం అనేది ఓ కళ. ఆకాశమే దానికి హద్దు. నామటుకు నేను చెప్పే విధానానికి కాక, చెప్పదలచుకున్న విషయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను.
'సాహిత్యానికీ అసలు శాశ్వతమైన విలువ మానవత్వం' అంటారు మధురాంతకం రాజారాం. అది నా కధల్లో కనిపిస్తుందనే నా నమ్మకం.
- పులుసు గోపిరెడ్డి
'తరం మారుతుంది' - ఇదో కధల సంపుటి. బహు చిన్న సంపుటి. గట్టిగా కూర్చుంటే ఇందులోని పన్నెండు కధలు ఒక్క ఉదుటున రెండు గంటల్లో చదివేయొచ్చు. అందుకు వీలుగానే రూపకల్పన చేయడం జరిగింది. అద్భుత కల్పనలతో ఊహాలోకాల్లో విహరింపజేసే కధల్లాంటివి ఇందులో లేవు. ఈ కధల్లో కనిపించే పాత్రలన్నీ ఎక్కడో ఓ అక్కడ నిజజీవితంలో మనకు తారసపడేవే. వ్యక్తుల అనుభవసారమే కధల రూపాన్ని సంతరించుకుని మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఇందులోని కధలన్నీ ముక్కుసూటిగానే సాగుతాయి. శిల్పం అంటారా? చెప్పే విధానమే కదండి! ఎవరి విధానం వారిది. ఇది నా విధానం. శిల్పం అనేది ఓ కళ. ఆకాశమే దానికి హద్దు. నామటుకు నేను చెప్పే విధానానికి కాక, చెప్పదలచుకున్న విషయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. 'సాహిత్యానికీ అసలు శాశ్వతమైన విలువ మానవత్వం' అంటారు మధురాంతకం రాజారాం. అది నా కధల్లో కనిపిస్తుందనే నా నమ్మకం. - పులుసు గోపిరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.