ఇది కథ కాదు!
లావణ్యకు శ్రీరాంతో పెళ్లై పది సంవత్సరాలు కావస్తుంది. ఇద్దరికీ హైదరాబాదులోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు. కారు, స్వంత ప్లాటు... ఈలోగా ఇద్దరు పిల్లలు. అమ్మాయికి ఆరేళ్ళు, అబ్బాయికి నాలుగేళ్ళు. సాఫీగా సాగుతున్న సంసారం. 1. పెళ్లి పదవ వార్షికోత్సవానికి లావణ్యకు ఓ మంచి గిఫ్ట్ కింద నాలుగు లక్షల పైన ఖరీదు చేసే 'నెక్లెస్' ఇవ్వాలనుకున్నాడు. ఇద్దరు కలిసి అప్పటిదాకా మార్కెట్లో లేని ఓ కొత్త నమూనాను డిజైన్ చేసి ఆర్డర్ ఇచ్చారు. నెక్లెస్ ఖరీదు కన్నా దాన్ని శ్రీరామ్ 13. లావణ్యకు బహుకరించే సందర్భం చాలా విలువైనది. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఆ నెక్లెస్ అంటే లావణ్యకు ఎనలేని ఇష్టం.. ప్రాణం! పెళ్లిరోజున బహుకరించిన తనకిష్టమైన జ్ఞాపిక!
ఆ తరువాత ఓ నెల రోజులకు ఎవరో లావణ్య దగ్గర బంధువుల అబ్బాయి పెళ్ళికి అలంకరణలో భాగంగా ఆ నెక్లెస్ ధరించి చంపాపేటలో ఓ కళ్యాణ మండపానికి వెళ్ళారు. పెళ్లి తంతు ముగిసింది. భోజనాలు ముగించుకొని కారులో ఇంటికి తిరుగు ముఖం పట్టారు. కారు అలా గేటు దాటిందోలేదో... అనుకోకుండా ఓ సారి మెడ తడుముకున్న లావణ్యగట్టిగా అరిచింది.
'ఏమండీ.. నా నెక్లెస్! కొంప మునిగిందండి!' ఏడుస్తూ అరుస్తూనే వుంది లావణ్య. అర్థంగాక అయోమయంలో శ్రీరామ్ కారుని పక్కకు ఆపి... 'ఓకే...లావణ్యా! వర్రీ అవకు.. ఎక్కడో పడిపోయి వుంటుంది. వెనక్కి వెళ్లి వెతుకుదాం.' ఓదార్పుగా అన్నాడు శ్రీరామ్.
'లేదండి! ఇంకెక్కడి నెక్లెస్ అండి! ఎవడో దొంగ వెధవ కొట్టేసుంటాడు. ఒకవేళ పడిపోయినా ఎవరో ఒకరు తీసుకెళ్ళి వుంటారు. వెతికినా లాభంలేదు.’................
ఇది కథ కాదు! లావణ్యకు శ్రీరాంతో పెళ్లై పది సంవత్సరాలు కావస్తుంది. ఇద్దరికీ హైదరాబాదులోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు. కారు, స్వంత ప్లాటు... ఈలోగా ఇద్దరు పిల్లలు. అమ్మాయికి ఆరేళ్ళు, అబ్బాయికి నాలుగేళ్ళు. సాఫీగా సాగుతున్న సంసారం. 1. పెళ్లి పదవ వార్షికోత్సవానికి లావణ్యకు ఓ మంచి గిఫ్ట్ కింద నాలుగు లక్షల పైన ఖరీదు చేసే 'నెక్లెస్' ఇవ్వాలనుకున్నాడు. ఇద్దరు కలిసి అప్పటిదాకా మార్కెట్లో లేని ఓ కొత్త నమూనాను డిజైన్ చేసి ఆర్డర్ ఇచ్చారు. నెక్లెస్ ఖరీదు కన్నా దాన్ని శ్రీరామ్ 13. లావణ్యకు బహుకరించే సందర్భం చాలా విలువైనది. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఆ నెక్లెస్ అంటే లావణ్యకు ఎనలేని ఇష్టం.. ప్రాణం! పెళ్లిరోజున బహుకరించిన తనకిష్టమైన జ్ఞాపిక! ఆ తరువాత ఓ నెల రోజులకు ఎవరో లావణ్య దగ్గర బంధువుల అబ్బాయి పెళ్ళికి అలంకరణలో భాగంగా ఆ నెక్లెస్ ధరించి చంపాపేటలో ఓ కళ్యాణ మండపానికి వెళ్ళారు. పెళ్లి తంతు ముగిసింది. భోజనాలు ముగించుకొని కారులో ఇంటికి తిరుగు ముఖం పట్టారు. కారు అలా గేటు దాటిందోలేదో... అనుకోకుండా ఓ సారి మెడ తడుముకున్న లావణ్యగట్టిగా అరిచింది. 'ఏమండీ.. నా నెక్లెస్! కొంప మునిగిందండి!' ఏడుస్తూ అరుస్తూనే వుంది లావణ్య. అర్థంగాక అయోమయంలో శ్రీరామ్ కారుని పక్కకు ఆపి... 'ఓకే...లావణ్యా! వర్రీ అవకు.. ఎక్కడో పడిపోయి వుంటుంది. వెనక్కి వెళ్లి వెతుకుదాం.' ఓదార్పుగా అన్నాడు శ్రీరామ్. 'లేదండి! ఇంకెక్కడి నెక్లెస్ అండి! ఎవడో దొంగ వెధవ కొట్టేసుంటాడు. ఒకవేళ పడిపోయినా ఎవరో ఒకరు తీసుకెళ్ళి వుంటారు. వెతికినా లాభంలేదు.’................© 2017,www.logili.com All Rights Reserved.