కలియుగ దైవము వెంకటేశ్వరుడయితే కలియుగ 'సద్గురువు' షిరిడి సాయీశుడు. సద్గురువు మించిన వారులేరు.సద్గురువులు ఆశీస్సులతో సాధించలేనిది లేదు. సద్గురు సాయీశుని మహిమ మహిమాన్వితమైనది. కేవలం రెండువందల సంవత్సరాలలోనే షిరిడీ సాయీశుడు పురాణ పురుషుడయ్యాడు. సర్వ రూపుడైన సాయీశుని క్షేత్రం షిరిడీ గూడా హిందూ పుణ్య క్షేత్రాలలో ప్రత్యేకస్థానమాక్రమించింది. షిరిడి అనతి కాలంలోనే అంతర్జాతీయ పుణ్యక్షేత్రం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు.
షిరిడిశుని చరిత్ర నిస్వార్ధ చింతనకు, లౌకిక తత్త్వానికి మచ్చుతునక. హిందూత్వంలోని భక్తీ వేదాంతాన్ని, ముస్లిం సూఫీ సిద్ధాంతాన్ని ఔపోసన పట్టి భక్తులలో సన్మార్గ చింతనను అలవరచటానికి అవతరించిన సిద్ధయోగి.
సద్గురు సాయీశుని బోధనలు, సత్సంగాల సన్మార్గ చింతనకు మార్గదర్శకాలు. "నేను కొందరివాడనుకాను, అందరి వాడను" అనిన సాయీశుడు అన్ని మతాలవారి, కులాలవారి అభిమానం పొందగలిగాడు. అసమాన సద్గురువయ్యాడు.
ఇంతటి మహిమాన్విత చరిత్ర గల్గిన షిరిడిబాబా, సద్గురు సాయీశుని జీవితాన్ని ప్రాచుర్యం చేయాలనే సద్భావనతో మా వంతుగా ఈ 'శ్రీ సాయి సచ్చరిత్ర' ను మీకందిస్తున్నాము. పారాయణాలు చేసి సద్గురువు ఆశిస్సులను పొందండి.
- శ్రీ పురాణపండ శ్రీచిత్ర
కలియుగ దైవము వెంకటేశ్వరుడయితే కలియుగ 'సద్గురువు' షిరిడి సాయీశుడు. సద్గురువు మించిన వారులేరు.సద్గురువులు ఆశీస్సులతో సాధించలేనిది లేదు. సద్గురు సాయీశుని మహిమ మహిమాన్వితమైనది. కేవలం రెండువందల సంవత్సరాలలోనే షిరిడీ సాయీశుడు పురాణ పురుషుడయ్యాడు. సర్వ రూపుడైన సాయీశుని క్షేత్రం షిరిడీ గూడా హిందూ పుణ్య క్షేత్రాలలో ప్రత్యేకస్థానమాక్రమించింది. షిరిడి అనతి కాలంలోనే అంతర్జాతీయ పుణ్యక్షేత్రం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. షిరిడిశుని చరిత్ర నిస్వార్ధ చింతనకు, లౌకిక తత్త్వానికి మచ్చుతునక. హిందూత్వంలోని భక్తీ వేదాంతాన్ని, ముస్లిం సూఫీ సిద్ధాంతాన్ని ఔపోసన పట్టి భక్తులలో సన్మార్గ చింతనను అలవరచటానికి అవతరించిన సిద్ధయోగి. సద్గురు సాయీశుని బోధనలు, సత్సంగాల సన్మార్గ చింతనకు మార్గదర్శకాలు. "నేను కొందరివాడనుకాను, అందరి వాడను" అనిన సాయీశుడు అన్ని మతాలవారి, కులాలవారి అభిమానం పొందగలిగాడు. అసమాన సద్గురువయ్యాడు. ఇంతటి మహిమాన్విత చరిత్ర గల్గిన షిరిడిబాబా, సద్గురు సాయీశుని జీవితాన్ని ప్రాచుర్యం చేయాలనే సద్భావనతో మా వంతుగా ఈ 'శ్రీ సాయి సచ్చరిత్ర' ను మీకందిస్తున్నాము. పారాయణాలు చేసి సద్గురువు ఆశిస్సులను పొందండి. - శ్రీ పురాణపండ శ్రీచిత్ర© 2017,www.logili.com All Rights Reserved.