ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విప్లవాలలో చైనా విప్లవం ఒకటి. సాయుధ ప్రజా విప్లవం ద్వారా ప్రజాతంత్ర చైనా ఆవిర్భవించింది. భూస్వామ్య విధానానికీ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు సాగిన చైనా సాయుధ పోరాటాన్ని 'లాంగ్ మార్చ్' గా ప్రపంచ చరిత్రపుటల్లో నిక్షిప్తం చేయబడింది. కష్టాలు, కన్నీళ్లు, రక్తతర్పణంతో నవ చైనా అవతరించింది. అందుకు ఆనాటి ప్రపంచ దేశాల్లోని పురోగామి శక్తులన్నీ తమ అండదండలు తెలియజేశాయి. భారతదేశాన్నుండి కొట్నీస్ వెళ్లి చైనా విముక్తి పోరాటానికి తన సాహసోపేతమైన సేవలందిస్తూ మరణించాడు. అదే కోవకు చెందినవారు నార్మన్ బెతూన్. తమ దేశాలను, కుటుంబాలను విడిచిపెట్టి మరో దేశం వెళ్లి ఆ ప్రజల కోసం నిస్వార్థ సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన అమరవీరులు. చరిత్ర పుటల్లో, ప్రజల హృదయాల్లో ఆచంద్రతారార్కంగా వారు నిలిచిపోతారు.
నార్మన్ బెతూన్ కమ్యూనిస్టు. కమ్యూనిస్టు చైతన్యం ఆయన నరనరానా జీర్ణమైపోయింది. చైనా విముక్తి పోరాటంలో పాల్గొనడం తన అంతర్జాతీయ కర్తవ్యంగా భావించాడు. ఒకవైపున భీకరపోరాటం జరుగుతున్నా బాంబుల వర్హం కురుస్తున్నా, మొక్కవోని ధైర్యంతో ఒక అడుగు కూడా వెనక్కు వేయకుండా తనకు తానే నిర్దేశించుకున్న కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన మానవులలో మహోన్నతుడు నార్మన్ బెతూన్. ఆయన జీవిత అమరగాథే "రక్తాశ్రువులు" అనే నవలగా సిడ్నీ గోర్డన్, టెడ్ అలెన్ లు ఇంగ్లీషులో రాసిన నవలను సహవాసి తెలుగులో రచించారు.
- గడ్డం కోటేశ్వరరావు
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విప్లవాలలో చైనా విప్లవం ఒకటి. సాయుధ ప్రజా విప్లవం ద్వారా ప్రజాతంత్ర చైనా ఆవిర్భవించింది. భూస్వామ్య విధానానికీ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు సాగిన చైనా సాయుధ పోరాటాన్ని 'లాంగ్ మార్చ్' గా ప్రపంచ చరిత్రపుటల్లో నిక్షిప్తం చేయబడింది. కష్టాలు, కన్నీళ్లు, రక్తతర్పణంతో నవ చైనా అవతరించింది. అందుకు ఆనాటి ప్రపంచ దేశాల్లోని పురోగామి శక్తులన్నీ తమ అండదండలు తెలియజేశాయి. భారతదేశాన్నుండి కొట్నీస్ వెళ్లి చైనా విముక్తి పోరాటానికి తన సాహసోపేతమైన సేవలందిస్తూ మరణించాడు. అదే కోవకు చెందినవారు నార్మన్ బెతూన్. తమ దేశాలను, కుటుంబాలను విడిచిపెట్టి మరో దేశం వెళ్లి ఆ ప్రజల కోసం నిస్వార్థ సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన అమరవీరులు. చరిత్ర పుటల్లో, ప్రజల హృదయాల్లో ఆచంద్రతారార్కంగా వారు నిలిచిపోతారు. నార్మన్ బెతూన్ కమ్యూనిస్టు. కమ్యూనిస్టు చైతన్యం ఆయన నరనరానా జీర్ణమైపోయింది. చైనా విముక్తి పోరాటంలో పాల్గొనడం తన అంతర్జాతీయ కర్తవ్యంగా భావించాడు. ఒకవైపున భీకరపోరాటం జరుగుతున్నా బాంబుల వర్హం కురుస్తున్నా, మొక్కవోని ధైర్యంతో ఒక అడుగు కూడా వెనక్కు వేయకుండా తనకు తానే నిర్దేశించుకున్న కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన మానవులలో మహోన్నతుడు నార్మన్ బెతూన్. ఆయన జీవిత అమరగాథే "రక్తాశ్రువులు" అనే నవలగా సిడ్నీ గోర్డన్, టెడ్ అలెన్ లు ఇంగ్లీషులో రాసిన నవలను సహవాసి తెలుగులో రచించారు. - గడ్డం కోటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.