చరిత్ర ఎందుకు చదువుతున్నాం అని మనకి మనం తప్పకుండా తరచు ప్రశ్న వేసుకుంటాం. చరిత్ర అధ్యయనం గతాన్ని గురించి తెలుసుకునే ఒక మార్గం. మన పూర్వులు ఒకనాడు ఎలా జీవించారు, అలా ఎందుకు జీవించారు, ఏ అవరోధాల్ని ఎదుర్కొన్నారు, ఆ అవరోధాల్ని ఎలా అధిగమించారు అనేది అవగాహన చేసుకోడానికి చేసే ఒక ప్రయత్నం, చరిత్ర. గత చరిత్రతో పరిచయం కలిగించుకోటం చాలా అవసరం. ఎంచేతంటే ఈనాడు దేశంలో జరిగే పరిణామాల్ని ఇంకా మెరుగ్గా ఆకళించుకోటానికి అది దోహదపడుతుంది. అనేక వందల ఏళ్ల కిందట ఆరంభమైన మనదేశ కథ తెలుస్తుంది. మన దేశాన్ని ఏలిన రాజులు, రాజనీతిజ్ఞుల్ని గురించి, దేశ చరిత్రని నిర్మించిన ప్రజల్ని గురించి తెలుస్తుంది. ఇంకా, మనం మాట్లాడే భాషని ఎందుకు మాట్లాడుతున్నామో కూడా తెలుస్తుంది.
ఇదిగాక, గతం లోతుల్లోకి వెళ్ళటం ఉద్రేక భరితంగా ఉంటుంది. ఇది "నిధి అన్వేషణ" క్రీడ ఆడటం వంటిది. 'నిధి' ని కనుక్కోడానికి అవసరమైన ఆధారాలు అన్ని తావులా దాగి వున్నాయి. ఒక్క ఆధారం కనుక్కున్నామంటే అది మరొక ఆధారం వైపు మనల్ని లాక్కుపోతుంది. అట్లా ఒక్కొక్క ఆధారం పట్టుకుని నెమ్మదిగా ముందుకి సాగితే 'నిధి' దాటి తావు బైట పడుతుంది. ఇక్కడ 'నిధి' అంటే మనం పుట్టక పూర్వం అనేక వందల ఏళ్ల కిందట ఈ ప్రపంచంలో, అందులో భాగమైన ఈ దేశంలో ఏం జరిగిందో ఆకళింపునకు వచ్చే చరిత్ర.
చరిత్ర ఎందుకు చదువుతున్నాం అని మనకి మనం తప్పకుండా తరచు ప్రశ్న వేసుకుంటాం. చరిత్ర అధ్యయనం గతాన్ని గురించి తెలుసుకునే ఒక మార్గం. మన పూర్వులు ఒకనాడు ఎలా జీవించారు, అలా ఎందుకు జీవించారు, ఏ అవరోధాల్ని ఎదుర్కొన్నారు, ఆ అవరోధాల్ని ఎలా అధిగమించారు అనేది అవగాహన చేసుకోడానికి చేసే ఒక ప్రయత్నం, చరిత్ర. గత చరిత్రతో పరిచయం కలిగించుకోటం చాలా అవసరం. ఎంచేతంటే ఈనాడు దేశంలో జరిగే పరిణామాల్ని ఇంకా మెరుగ్గా ఆకళించుకోటానికి అది దోహదపడుతుంది. అనేక వందల ఏళ్ల కిందట ఆరంభమైన మనదేశ కథ తెలుస్తుంది. మన దేశాన్ని ఏలిన రాజులు, రాజనీతిజ్ఞుల్ని గురించి, దేశ చరిత్రని నిర్మించిన ప్రజల్ని గురించి తెలుస్తుంది. ఇంకా, మనం మాట్లాడే భాషని ఎందుకు మాట్లాడుతున్నామో కూడా తెలుస్తుంది. ఇదిగాక, గతం లోతుల్లోకి వెళ్ళటం ఉద్రేక భరితంగా ఉంటుంది. ఇది "నిధి అన్వేషణ" క్రీడ ఆడటం వంటిది. 'నిధి' ని కనుక్కోడానికి అవసరమైన ఆధారాలు అన్ని తావులా దాగి వున్నాయి. ఒక్క ఆధారం కనుక్కున్నామంటే అది మరొక ఆధారం వైపు మనల్ని లాక్కుపోతుంది. అట్లా ఒక్కొక్క ఆధారం పట్టుకుని నెమ్మదిగా ముందుకి సాగితే 'నిధి' దాటి తావు బైట పడుతుంది. ఇక్కడ 'నిధి' అంటే మనం పుట్టక పూర్వం అనేక వందల ఏళ్ల కిందట ఈ ప్రపంచంలో, అందులో భాగమైన ఈ దేశంలో ఏం జరిగిందో ఆకళింపునకు వచ్చే చరిత్ర.© 2017,www.logili.com All Rights Reserved.